Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఇలా మారిపోతామా! మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...
తమిళ నటి రైజా విల్సన్ ఫేస్ ఎలా తయారైందో చూస్తే షాకవుతారు.
ఈరోజుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఇందుకోసం కొందరు సహజ చిట్కాలను పాటిస్తున్నారు. మరికొందరు చర్మ నిపుణుల సలహాలను పాటిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏవేవో ట్రీట్ మెంట్లు తీసుకుంటున్నారు. అనవసరంగా అందవికారంగా మారిపోతున్నారు.

తాజాగా తమిళ నటి రైజా విల్ సన్ కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన చర్మం మరింత మెరుస్తుందనుకుంటే.. ఉన్న మెరుపు కాస్త పోయి.. తన ఫేసు భయంకరంగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్కిన్ డాక్టర్ తనకు బలవంతంగా చికిత్స చేశారని, దీంతో తన ఫేస్ ఇలా తయారైందని.. తన బాధను వెల్లడించింది. ఫేషియల్ ట్రీట్మెంట్ తో అందం పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మీ చర్మానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకు తానే నిదర్శనమని చెప్పింది. ఇంతకీ ఆమె ఏ పొరపాటు చేసింది.. ఆమెకు ఎందుకు జరిగింది.. అలా జరగకుండా ఉండాలంటే ఏయే జాగ్రత్తలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఖరీదైన చర్మ చికిత్స..
తమిళ నటి రైజా విల్సన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన ఫేస్ మీద ఒక నల్లని పెద్ద మచ్చ కనిపిస్తుంది. తన కళ్ల కింద కూడా ఎక్కువ వాపు కనిపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. దీనికి స్కిన్ డాక్టర్ ట్రీట్మెంట్ వల్లే ఇదంతా జరిగిందని వివరించింది. ఈ పోస్టు షేర్ చేసే ముందు తాను సాధారణ ఫేషియల్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ భైరవి వద్దకు వెళ్లానని, అయితే ఆమె తన స్కిన్ పాడైందని.. బలవంతంగా తనకు స్కిన్ ట్రీట్మెంట్ చేసిందని.. ఇలా జరిగిన తర్వాత డాక్టర్ తనను కలవడానికి నిరాకరించిందని చెప్పుకొచ్చింది.

ఫేషియల్ ట్రీట్మెంట్ అంటే..
ఫేషియల్ ట్రీట్మెంట్ అంటే.. చర్మ సంరక్షణ కోసం కొన్ని రకాల క్రీములను, ఫేస్ మాస్క్ వంటి వాటిని ఉపయోగిస్తారు. టోనర్లను ఉపయోగించడం వల్ల చర్మంలో మరింత నిగారింపు కనిపిస్తుంది.

ఫేషియల్ ట్రీట్మెంట్ ప్రతికూలతలు..
ఫేషియల్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, ఎన్నో రకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాంటి రసాయన ఉత్పత్తుల వల్ల ఫేస్ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరి చర్మానికి కెమికల్స్ దుష్ర్పభావం వల్ల దురద పెరుగుతుంది.

ఎర్రని గుర్తులు..
ఎవరైనా ఫేస్ పై తప్పుగా స్క్రబ్ చేయడం వల్ల ముఖం మీద ఎర్రని గుర్తులు ఏర్పడతాయి. దీని వల్ల చర్మం యొక్క అందం తగ్గిపోతుంది. అంతేకాదు చాలా వికారంగా కనిపిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.

మొటిమలు..
ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చర్మ రంధ్రాలు తెరచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు పెరిగిపోవచ్చు. అవి మెల్లగా బయటకు కనిపిస్తాయి. దీంతో మీ అందం మరింత చెడిపోవచ్చు.

స్కిన్ అలర్జీ..
ఫేస్ పై ఫేషియల్స్ సమయంలో అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇది స్కిన్ అలర్జీని కలిగించే ప్రమాదం ఉంటుంది. మీ ముఖం యొక్క చర్మంపై సహజంగా వచ్చే తేమ ఆరిపోతుంది. అదే సమయంలో, మీ ముఖంలో నిగారింపు తగ్గిపోతుంది. చాలా సార్లు ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాపు వస్తుంది. అలాంటి సమయంలో, ఫేషియల్ ట్రీట్మెంట్ ను మంచి సెలూన్ షాపులో తీసుకోవడం ఉత్తమం.

ఫేషియల్ తర్వాత ఇవి మరిచిపోవద్దు..
ఫేషియల్ ట్రీట్మెంట్ తర్వాత ఎండ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. మీ ఫేషియల్ ట్రీట్మెంట్ తర్వాత వీలైంతన ఎక్కువ నీరు తాగాలి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల మీ ఫేస్ పై మంచి ప్రభావం చూపుతుంది. ఎందుకంటే తాగునీరు కూడా ముఖం మీద మెరుపును తీసుకొస్తుంది. ఫేషియల్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.



Click it and Unblock the Notifications