Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
గ్రాండ్ గా ముగిసిన ఐఐజెడబ్ల్యు ఫ్యాషన్ వీక్: షో స్టాపర్స్ వీరే
ఐఐజెడబ్ల్యు 2014 డే 3 నిన్నటితో షో గ్రాండ్ గా ముగిసింది. ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ 2014 కు హాటెస్ట్ సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ చేశారు. ఊహించిన విధంగానా, మనోహరమైన బ్యూటిఫుల్ సెలబ్రెటీలు మరియు వారి అందచందాలకు ఆభరణాలు మరింత అందాన్ని జోడించి స్టేజ్ మీద ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ..అత్యద్భుతంగా ఆకట్టుకొన్నారు.
ఇండియా ఇంటర్నేషన్ జ్యువెలరీ వీక్ 2014 మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగింది. ప్రపంచం మొత్తంలో ఉన్న ఫ్యాషన్ యాంగిల్స్ మొత్తం ఈ ఐఐజెడబ్ల్యు ర్యాంప్ మీద ఉన్నట్టే మనం గమనించవచ్చు. అద్భుతమైన డిజైన్లతో ముత్యాలు, రత్నాలు, డైమండ్స్, గోల్డ్, సిల్వర్ తో డిజైన్ చేసిన ఆభరణాలతో చాలా మంది సెలబ్రెటీలు షో స్టాపర్స్ గా నిలిచారు.
ఒక్క జ్యువెలరీతో మాత్రమే బాలీవుడ్ బ్యూటీస్ ర్యాంప్ వాక్ లో హైలైట్ కాలేదు, వారు ధరించిన అవుట్ ఫిట్స్ కూడా వారికి మరింత అడ్వాంటేజ్ అయ్యింది. దాంతో ర్యాంప్ వాక్ లో మరింత సౌందర్యంగా మెరిసారు. అలా మెరిసిన ప్రముఖ సెలబ్రెటీలు దాదాపు అందరూ కూడా ఇండియన్ బ్రైడ్ వలె కనిపించారు. మరి ఇంత మంది సెలబ్రెటీల్లో అత్యధ్భుతంగా మనోహరంగా అలకరించుకొన్న, ఆభరణాల పరంగా మరియు అవుట్ ఫిట్స్, స్టైల్ పరంగా షోస్టాపర్స్ గా నిలిచిన కొంత మంది టాప్ సెలబ్రెటీలు ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయండి.

నేహా ధూపియా:
గీతాంజలీ జెమ్స్ యొక్క ఆభరణాలను ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్ చేసిన బాలీవుడ్ యాక్టర్స్ నేహా ధూపియా హెవీ బ్రైట్ లెహంగాలో ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ జ్యువెలరీస్ తో చాలా అద్భుతంగా ఉన్నది.

అమీషా పటేల్:
సూర్య గోల్డ్ మరియు స్వర్వ్స్కి వారి జ్యువెలరీస్ ను ప్రదర్శించిన అమీషా పటేల్ షోస్టాపర్ గా నిలిచింది.

చిత్రాంగద సింగ్:
మోని అగర్వాల్ డిజైనర్ జ్యువెలరీస్ ను ప్రదర్శించిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ చిత్రాంగద సింగ్ కోరల్ లెహంగా చోలీ చాలా అద్భుతంగా ఉంది. డ్రెస్సుకు ఫర్ ఫెక్ట్ గా నడుము వడ్డానం కూడా బాగా నప్పింది.

కల్కికొయిచ్లిన్:
కల్కి కొయిచ్లిన్ ప్రీతి జ్యువెలర్స్ ను రెప్రజెంట్ చేస్తూ ర్యాంప్ వాక్ చేసిన షో స్టాపర్ గా నిలించింది . రెడ్ స్ట్రాప్ లెస్ గౌన్, మరిు చోకర్ నెక్ లెస్, అది కూడా డైమండ్, ఎమ్రాల్డ్స్ మరియు రుబీతో డిజైన్ చేసిన ఆభరణాలు బాగా సూట్ అయ్యాయి.

లిసా రాయ్:
ఫరాక్ అలీ ఖాన్ డిజనర్ జ్యువెలర్స్ తో ర్యాంప్ వాక్ చేసిన లిసా రాయ్ షో స్టాపర్ గా నిలించది . పొడవాటి రెక్ట్యాంగులర్ ఎమ్రాల్డ్ జ్యువెలరీ సెట్ చాలా అద్బుతంగా ఉంది.

షిబానీ కషప్:
ఎఎస్ కె జ్యువెలర్స్ వారి యొక్క బెస్ట్ కలెక్షన్స్ ను ప్రదర్శించిన షిబానీ క్యాషప్ షో స్టాపర్ గా నిలిచింది . ఆమె బ్లాక్ డ్రెస్ మీదకు గోల్డెన్ నెక్ లెస్ మరియు గోల్డెన్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.

దియా మీర్జా:
అద్భుతమైనటువంటి ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లెహంగా చోలీ డ్రెస్సులో శోభా స్రింగార్ జ్యువెలరీస్ ను ర్యాంప్ మీద ప్రదర్శించి షోస్టాపర్ గా నిలిచారు.

సన్నీ లియోన్:
స్టార్ సెలబ్రెటీ సన్నీలియోన్ అపల జ్యువెలర్స్ డిజైన్ ను ర్యాంప్ మీద రెప్రెజెంట్ చేసింది.

సిమ్రాన్ కౌర్ ముండి:
సిమ్రాన్ కౌర్ ముండి, పంజాబీ యాక్టర్స్ మరియు మోడల్ స్వర్వోస్కి షోను ప్రారంభిచి, పంజాబీ బ్రైడ్ గా ర్యాంప్ వాక్ చేసి షో స్టాపర్స్ గా నిలిచారు.

జరీన్ ఖాన్:
స్వర్వోస్కి డిజైన్స్ తో ఫర్ఫెక్ట్ ఇండయన్ బ్రైడ్ గా ఉన్నారు . జరీన్ ఖాన్ లెహంగా చోలీలో అద్భుతంగా ఉంది. లెహంగా భారీగా థ్రెడ్ వర్క్ చేయబడింది.

రవీనా టాండన్:
90s లీడింగ్ బాలీవుడ్ బ్యూటీ ఇలా ర్యాంప్ వాక్ చేయడం చాలా గ్రేట్ గా ఉంది. ఆమె దీప్తి మరియు అమిషా యొక్క డిజైనర్ ఆభరణాలను ర్యాంప్ మీద ప్రదర్శించారు.

గౌరవ్ ఖాన్:
ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ అఫ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి బెస్ట్ కలెక్షన్ ను గౌరవ్ ఖాన్ ఇలా ర్యాంప్ మీద ప్రదర్శించి షో స్టాపర్ గా నిలిచారు.

సాగరికా:
సాగరికా గాట్జే ఐఐజెడబ్ల్యు ర్యాంప్ మీద గంజన్ జ్యువెలర్స్ యొక్క ఆభరణాలను ప్రదర్శించింది. సాగరిక ట్రిపుల్ లేయర్డ నెక్ లెస్ అదే పెయిర్ బ్యాంగిల్స్, ఇయరింగ్స్, ఎమ్రాల్డ్ నెక్ లెస్ ధరించి షో స్టాపర్ గా నిలిచింది. ఒక ఇండియన్ ట్రెడిషన్ గానే చాలా డిఫరెంట్ గా సింపుల్ శారీ కట్టుకొన్నది.

దివ్వా కోస్లా:
పిఎన్ గాడ్జి జ్యువెలర్స్ ను ప్రదర్శించిన దివ్వా కోస్లా ఐఐజెడబ్ల్యు డే2న షో స్టాపర్ గా నిలిచింది

శ్రద్దాకపూర్:
గీతాంజలీ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ తరపున ఆభరణాలను రెప్రజెంట్ చేసిన శ్రద్దాకపూర్ ఐఐజెడబ్ల్యు డే2న షో ష్టాపర్ గా నిలిచింది .ఆమె ధరించిన నెక్ లెస్ ఆ అవుట్ ఫిట్ కు చాలా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

శ్రీదేవి:
గొలెచాస్ జ్యువెరీస్ ను ప్రదర్శించిన అలనాటి మేటి నటి అతిలోక సుందరి శ్రీదేవి షో స్టాపర్ గా నిలిచారు. గోల్డ్, డైమండ్స్ మరియు రుబీస్ తో రూపొందిచిన జ్యువెరీస్ ను ఈమె ప్రదర్శించారు.

సోనమ్ కపూర్:
ఐఐజెడబ్ల్యు బ్రాండ్ అంబాసిడర్ సోనమ్ కపూర్ ఈ సంవత్సరం ఐఐజెడబ్ల్యు 2014డే3న ర్యాంప్ వాక్ చేసింది. ఆమె రియో టింటోస్ నజ్రానా వారి ఆభరణాలను రెప్రెజెంట్ చేసింది . ఆమె ధరించిన వైట్ కలర్ అవుట్ ఫిట్ కు ఫర్ ఫెక్ట్ గా డైమండ్ ఇయర్ రింగ్స్ మరియు ఫింగర్ రింగ్స్ కు మ్యాచ్ అయ్యాయి .

యామీ గౌతమ్:
ఐఐజెడబ్ల్యు డే 3న ర్యాంప్ వాక్ లో యామీ గౌతమ్ వైట్ కలర్ ఫ్లోర్ లెగ్గ్ స్ట్రాప్ లెస్ గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది . రియో టింటోస్ డిజైన్ చేసిన డైమండ్ నెక్ లెస్ ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేసిన నెక్ లెస్ బ్రైడల్ అట్రాక్షన్ ను ఇచ్చింది. ఈ డిజైన్స్ చాలా మందిని ఆకర్షించింది.



Click it and Unblock the Notifications