Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
హిజాబ్, బుర్ఖాల మధ్య ప్రధాన తేడాలేంటో తెలుసా...
బుర్ఖా మరియు హిజాబ్ మధ్య ఉండే తేడాలేంటో చూసెయ్యండి.
కర్నాటకలో ఇటీవల ఓ చిన్న విద్యా సంస్థలో బుర్ఖా, హిజాబ్ గురించి చిన్నగా మొదలైన గొడవలు.. చిలికి చిలికి గాలివానలా మారేలా ఉన్నాయి. అవి ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేంత ప్రభావం చూపాయి.

దీంతో చాలా మంది హిజాబ్ మరియు బురఖాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనలో చాలా మంది హిజాబ్, బురఖా రెండూ ఒకటే అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు వస్త్రాలు వేర్వేరుగా ఉంటాయి.

హిజాబ్ అనేది ప్రతి ఒక్క స్త్రీ జుట్టు, మెడ మరియు కొన్నిసార్లు స్త్రీ భుజాలు మరియు ఛాతీని కప్పి ఉంచే ఒక కండువా మాదిరిగా ఉంటుంది. అదే బురఖా విషయానికొస్తే.. ఇది రకరకాల డిజైన్లలో లభిస్తుంది. ఇది ఒకే రకంగా స్త్రీ శరీరాన్ని కింద నుండి పైవరకు కప్పివేసేలా ఉంటుంది.

ఇది మహిళల శరీర భాగంలోని ముఖం, తలతో పాటు కాలిగోరు కూడా బయటకు కనిపించకుండా కవర్ చేస్తుంది. ఈ హిజాబ్ మరియు బురఖా రెండూ ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం ధరించాల్సిన దుస్తులు. అయితే బురఖాను ఎక్కువగా ఆఫ్ఘనిస్థాన్ లేదా పాకిస్థాన్లో నివసించే మహిళలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే హిజాబ్ లను మాత్రం అనేక విభిన్న సంస్క్రుతులను పాటించే మహిళలు ధరిస్తారు.

హిజాబ్ లో రకాలు..
‘హిజాబ్'అనే పదాన్ని రెండు రకాలుగా వాడొచ్చు. మొదటిది ఒక ముస్లిం మహిళ దుస్తుల్లో నమ్రత ప్రమాణాలకు సాధారణంగా కట్టుబడి ఉన్నట్లు సూచించడాన్ని వివరిస్తుంది. ముస్లిం మహిళలు తమ తల మరియు వెంట్రుకలను దాచుకోవడానికి ఒక నిర్దిష్టమైన వస్త్రాన్ని, అంటే తలకు కండువా లేదా కవచంలా వాడుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

హిజాబ్ లో శైలులు..
హిజాబ్ యొక్క అనేక విభిన్న శైలులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కల్చర్ మరియు వాటిని ధరించిన మహిళల ప్రాధాన్యతలను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా, హిజాబ్ ధరించే స్త్రీ జుట్టును అలాగే ఆమె మెడ భాగాన్ని కప్పి ఉంచుతుంది. కొన్ని సందర్భాల్లో అదనపు కవరేజ్ కోసం హిజాబ్ ఆమె భుజాల వరకు పెరగొచ్చు. హిజాబ్ ధరించిన మహిళల ముఖం ఎప్పుడు కప్పి ఉంచదు. అయితే వారు తలకు స్కార్ప్ తో, ఫేస్ మాస్కును ధరిస్తూ ఉంటారు.

బురఖాలో..
బురఖా అనేది ఒక సంప్రదాయకమైన వస్త్రం. ఇది ధరించే వారికి గణనీయమైన కవరేజీని అందిస్తుంది. ఇది హిజాబ్ లా కాకుండా, బురఖా ఆమె కళ్లతో సహా, తన ముఖంతో పాటు బాడీ మొత్తాన్ని బాగా కవర్ చేస్తుంది. బురఖాలో మరియు హిజాబ్ లో ఉండే ప్రధాన వ్యత్యాసం స్త్రీ ముఖం మరియు కళ్లను కప్పి ఉంచడం.

భిన్నాభిప్రాయాలు..
ఒక స్త్రీ బహిరంగంగా లేదా ఆమెకు సన్నిహిత సంబంధం లేని మగాళ్ల దగ్గర మహిళ తన తల మరియు శరీరాన్ని ఎంతవరకు కప్పుకోవాలి అనే విషయంలో ఇస్లామిక్ పండితుల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇస్లాం ప్రకారం, దుస్తులు ధరించడం సముచితమైనప్పటికీ, మహిళలు కొన్ని కఠినమైన దుస్తుల పద్ధతులను మతపరంగా కాకుండా సాంస్క్రుతిక స్వభావం కలిగి ఉన్నాయని అభిప్రాయపడుతుంటారు.

ఎందుకు ధరిస్తారంటే?
ముస్లిం మహిళలు దేవుని పట్ల గౌరవం మరియు విధేయతను ప్రదర్శించడానికి మరియు వారి ఇళ్ల వెలుపల తమ నిరాండబరతను కాపాడుకోవడానికి ఈ సంప్రదాయక శిరస్త్రాణాలను ధరిస్తారట. అయితే వీరి శైలి మరియు ప్రదర్శన దేశం నుండి దేశానికి మరియు ఒక స్త్రీ నుండి స్త్రీకి కూడా చాలా తేడా ఉంటుంది.



Click it and Unblock the Notifications