Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కళ్యాణ వేళ.. బాలీవుడ్ భామల మెడలో ధరించిన మంగళసూత్రం ధరెంతో తెలుసా...
ఫేమస్ నటీమణుల మంగళసూత్రాల భారీ ఖర్చుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత వైశాఖ మాసంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తెలుగింట పెళ్లి అంటే కళ్యాణ తిలకం, నుదుటన బాసికం, చెవులకు అందమైన కమ్మలు, మెడలో బంగారు ఆభరణాలు, ముచ్చటైన పట్టుచీర, నడుముకి వడ్డాణం, కాళ్లకు వెండి పట్టీలు, పాదాలకు పారాణి. ఇది మన దేశ పెళ్లికూతరి ఆహార్యం.

చూడగానే ఎంత బాగుందో అనిపించేలా అందంగా తయారవుతుంది కొత్త పెళ్లికూతురు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించే కాంతి, కళ్లకు ఏదీ సాటిరాదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పెళ్లి తర్వాత ఎలాంటి మహిళకైనా మెడలో గొప్ప ఆభరణం ఏదైనా ఉందంటే అది మంగళసూత్రమే. నల్లపూసలతో తయారు చేసే ఆ మంగళసూత్రాన్ని భర్త క్షేమంగా పరిగణిస్తారు.

దంపతులిద్దరూ కలిసి హాయిగా జీవిస్తున్నారనడానికి మహిళల మెడలోని ఆ మంగళ సూత్రమే సాక్ష్యం. అయితే ప్రస్తుతం అలాంటి మంగళ సూత్రాల్లో ఎన్నో రకాల కొత్త మోడల్స్ వచ్చాయి. బంగారం, వజ్ర రూపాలలో కూడా ప్రత్యేక మోడల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన బాలీవుడ్ భామలు కూడా పెళ్లి తర్వాత చాలాసార్లు తమ మెడలో మంగళ సూత్రంతో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వారు ధరించిన మంగళ సూత్రం ధరెంతో చూద్దాం రండి...

సాధారణంగా పెళ్లికి కొన్ని రోజుల నుండే హడావుడి మొదలవుతుంది. పెళ్లి రోజు కట్టుకునే చీరలు కొనడం, అందుకు తగ్గ మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజులు కుట్టించుకోవడం, నచ్చిన నగలు చేయించుకోవడం ఇలా పెళ్లికి చాలా సమయం ముందు నుండే పెళ్లికూతుళ్ల హడావుడి మొదలవుతుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. పెళ్లి తర్వాత వధువు మెడలో మంగళసూత్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

అనుష్క శర్మ..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీను ప్రేమించి పెళ్లాడిన అనుష్క శర్మ ఖర్చుల విషయంలో ఏ మాత్రం వెనుకాడదట. తన కళ్యాణం సమయంలో కేవలం మంగళ సూత్రానికి 52 లక్షల రూపాయల ఖర్చు పెట్టిందట.

ఐశ్వర్యరాయ్..
అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన ఐశ్వర్యరాయ్ తన కళ్యాణం సమయంలో అచ్చం మహారాణిలా కనిపించింది. పెళ్లి తర్వాత కూడా ఆమె మంగళసూత్రంతో దర్శనమిచ్చింది. పెళ్లి సమయంలో తను పసుపు బంగారు వర్ణాల కలయిక ఉన్న కాంజీవరం చీరను ధరించింది. దాని ఖరీదు సుమారు రూ.75 లక్షలు కాగా.. తను ధరించిన మంగళసూత్రం ధర అక్షరాల రూ.45 లక్షల రూపాయలు.

దీపికా పదుకొనే..
బాలీవుడ్ హీరో రణవీర్ ను పెళ్లాడిన పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే తన పెళ్లి సమయంలో మంగళ సూత్రానికి దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట.

ప్రియాంక చోప్రా..
తన కంటే వయసులో చిన్న వాడు.. అమెరికా దేశస్థుడు, పాపులర్ సింగర్ నిక్ జోన్స్ ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా తన మంగళసూత్రం ఎంత ఖర్చు పెట్టిందనే విషయం బయటకు రాలేదు. కానీ నిక్ ప్రియాంక మెడలో కట్టిన మంగళ సూత్రానికి పెద్ద డైమండ్ కనిపించింది. దాని విలువ సుమారు లక్షల రూపాయల్లో ఉంటుంది.

సోనమ్ కపూర్..
మరో బాలీవుడ్ భామ సోనమ్ కపూర్. తన పెళ్లి సమయంలో మంగళ సూత్రాన్ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. తన పెళ్లి సమయంలో దంపతులిద్దరి రాశులను తెలియజేసేలా ఈ మంగళసూత్రాన్ని తయారు చేశారు. ఇది ఎంత ఖరీదైనదనే విషయం కూడా బయటకు రాలేదు.

మాధురీ దీక్షిత్..
బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్ మాధురీ దీక్షిత్ 90వ దశకంలో(1999)నే పెళ్లి చేసుకోగా.. అప్పట్లోనే ఆమె ధరించిన మంగళసూత్రం ధర 8.5 లక్షల రూపాయలు కావడం విశేషం.

శిల్పాశెట్టి..
బాలీవుడ్ లో మరో పొడుగు కాళ్ల సుందరీ, రాజస్థాన్ రాయల్స్ ఓనర్ అయిన శిల్పాశెట్టి పెళ్లి సమయంలో భారీగా ఖర్చు చేసింది. తన పెళ్లి ఉంగరం విలువ మూడు కోట్ల రూపాయలు కాగా.. తన మెడలో మంగళసూత్రం ధర సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుంది.

కరిష్మా కపూర్..
మరో బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ తన పెళ్లి సమయంలో అందమైన లెహంగాను ధరించగా.. విలువైన ఆభరణాలను ధరించి అందరినీ ఆకట్టుకుంది. ఇక తన మంగళసూత్రం ఒక్క దానికే 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది.

కాజోల్
బాలీవుడ్ సింగం అజయ్ దేవ్ గన్ ను పెళ్లాడిన కాజోల్ తన కళ్యాణం సమయంలో ఖరీదైన ఆభరణాలు, పట్టుచీరలు ధరించింది. తన పెళ్లి సమయంలో ఒక్క మంగళసూత్రానికే దాదాపు 21 లక్షల రూపాయలను ఖర్చు చేసింది.



Click it and Unblock the Notifications
