Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
రష్మీక మాదిరిగా స్మార్ట్ గా కనిపించాలంటే.. ఈ క్యూట్ భామ ఫ్యాషన్ ను ఫాలో కావాల్సిందే..
మహేష్ బాబు సరసన నటించే అవకాశం కొట్టేసిన ఈ క్యూట్, స్వీట్ పిల్ల అందులోనూ అందరినీ తెగ ఇంప్రెస్ చేసింది. అదే ఊపులో నితిన్ తో భీష్మలో తెగ అల్లరి చేసింది ఈ భామ.
రష్మీక మందాన అంటే పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో పాటు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో దక్షిణాది భాషలన్నింటిలోనూ వరుస సినిమా హిట్లతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది ఈ కన్నడ భామ.

1996 ఏప్రిల్ 5వ తేదీన జన్మించిన రష్మిక మందాన 2016లో కిరాక్ పార్టీతో వెండి తెరపై అడుగు పెట్టింది. అయితే తెలుగులో గీత గోవిందంలో విజయదేవర కొండతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ హిట్ తో మహేష్ బాబు సరసన నటించే అవకాశం కొట్టేసిన ఈ క్యూట్, స్వీట్ పిల్ల అందులోనూ అందరినీ తెగ ఇంప్రెస్ చేసింది.

అదే ఊపులో నితిన్ తో భీష్మలో తెగ అల్లరి చేసింది ఈ భామ. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఈ కర్నాటక అందాల భామకు ఫ్యాషన్ అంటే కూడా చాలా ఇష్టమట. అందుకే తాను ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు నలుగురిలోనూ ప్రత్యేకంగా.. ఆకర్షణీయంగా కనిపించేందుకు.. యవ్వనంగా కనిపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుందట.

ఫ్యాషన్ విషయానికొస్తే అందంతో పాటు తన డ్రెస్సింగ్ స్టైల్స్ పై రష్మిక ఎక్కువ శ్రద్ధ చూపుతుందట. ఎందుకంటే తన డ్రెస్సు ను బట్టే అందం, ఆకర్షణ పెరుగుతుందని తనకు బాగా తెలుసట. అలాంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటేనే ఎదుటివారిని సులభంగా ఆకర్షించగలుగుతారని చెబుతోంది. ఏప్రిల్ 5వ తేదీన ఆమె పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులలో టాప్-5 దుస్తులపై మీరు కూడా ఓ లుక్కేయండి...

పింక్ డ్రెస్...
రష్మిక మందాన తన బర్త్ డే సందర్భంగా క్యూట్ పింక్ డ్రెస్ వేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. ఈ రకమైన డ్రస్సులు అమ్మాయిలందరికీ కచ్చితంగా నచ్చుతాయి. ఈ డ్రెస్సులో రష్మిక లుక్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక అమ్మాయిగా మీరు ఫ్యాషన్ లో కొత్తగా కనిపించాలనుకుంటే మీరు వీటిని ట్రై చేయండి.

పూల చీర..
మన దేశంలో చీరకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఎలాంటి అమ్మాయి అయినా చీర అంటే కచ్చితంగా ఇష్టపడుతుంది. తన బర్త్ డే సందర్భంగా చీరలో చిలిపిగా చూస్తున్న ఫొటోను కూడా షేర్ చేసింది రష్మిక. ఆ చీరలో ఆకుపచ్చ పూలు అందరినీ తెగ ఆకర్షిస్తోంది. తన చీరకు తగ్గట్టే సగం స్లీవ్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసింది. ఇదే చీరను గీత గోవిందం సినిమాలో మీరు కూడా ఇదివరకే చూసే ఉంటారు.

అనార్కలి డ్రస్ లో అందంగా..
అనార్కలి డ్రస్ అంటే ఇష్టపడని అమ్మాయి ఎవరైనా ఉంటారా? చాలా మంది వెడ్డింగ్ సీజన్ లో కొత్త కొత్త డ్రెస్సుల గురించి.. ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎన్ని డిజైన్లు వచ్చినా.. వెళ్లినా.. అనార్కలి ఉన్న డిమాండ్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ అనార్కలి డ్రస్ చూడటానికి సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. అంతేకాదు ఏ అమ్మాయి అనార్కలి డ్రస్సు వేసుకున్నా వారికి ఈ డిజైన్ మంచి లుక్స్ ని కూడా ఇస్తుంది.

జంప్సూట్..
రష్మిక వేసుకున్న జంఫూట్స్ డ్రస్సు ఏ సందర్భానికైనా సౌకర్యవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాదు ఈ డ్రెస్సులో స్మార్ట్ గా కూడా కనిపిస్తారు. రష్మిక ఫ్యాషన్ అంటే కేవలం డ్రస్సులపైనే కాదు.. అందుకు తగ్గ మేకప్, జ్యువెలరీ, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పైనా ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అయితే అతిగా మేకప్ వేసుకోవడం రష్మిక కు ఇష్టముండదట.

రష్మిక గౌను..
రష్మిక మందాన వెస్ట్రన్ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్ డ్రస్సులనే కాదు. బోల్డ్ గౌను వంటి దుస్తులను వేసుకుని అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ. ఇటీవల నితిన్ తో కలిసిన నటించిన భీష్మ ఆడియో లాంచ్ సమయంలో గ్రీన్ కలర్ బోల్డ్ గౌను వేసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ క్యూట్, స్వీట్ పిల్లకు మరిన్ని అవకాశాలు రావాలని.. తన జీవితంలో ఇలాగే ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటూ బోల్డ్ స్కై తెలుగు తరపున రష్మిక మందానకు పుట్టినరోజు శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications
