Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
Saranga Dariya Saree: ‘సారంగ దరియా’ సిన్నది.. స్కై బ్లూ కలర్ సారీలో మెరిసిపోయింది..!
సారంగ దరియ నటి సాయిపల్లవి వేసుకున్న స్కై బ్లూ కలర్ సారీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
తొలి సినిమాతోనే సహజ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తన అందం.. అభినయం.. నాట్యం చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

అదిరిపోయే స్టెప్పులతో అందరినీ అలరించే సాయి పల్లవి.. తాజాగా 'లవ్ స్టోరీ' సినిమా కోసం ధరించిన లేటెస్ట్ సారీ అమ్మాయిలను తెగ ఆకట్టుకుంటోంది.స్కై బ్లూ కలర్ సారీ.. స్లీవ్ లెస్ జాకెట్ తో.. సాయి పల్లవి స్టిల్స్ చూస్తే.. అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా ఫిదా అయిపోవడం ఖాయం.

కేరళ కుట్టి సాయిపల్లవి వేసుకున్న ఈ చీరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా దీని ధరేంతో తెలిస్తే మీరు షాకవుతారు.. ఆ విశేషాలేంటో మీరు కూడా చూసెయ్యండి...
నీలి రంగు చీరలో మెరిసిన నిహారిక... ఈ చీరకు ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా...

స్కై బ్లూ కలర్ సారీ..
‘లవ్ స్టోరీ' సినిమా కన్నా ‘సారింగ దరియా' సాంగ్ తోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దీనంతటికీ కారణం ఆ పాటకు తగ్గట్టు సాయి పల్లవి స్టెప్పులు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా ఈ కేరళ బ్యూటీ సినిమా ప్రమోషన్ కోసం లేటెస్ట్ గా స్కై బ్లూ కలర్లో దర్శనమిచ్చింది.

హాట్ టాపిక్..
ఈ సహజ సుందరి రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ చీరకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తోంది. స్కై బ్లూ కలర్లోని సారీలో సాయి పల్లవి మరింత అందంగా కనిపించింది. తన ఫేసుకు తగ్గట్టు సారీ అంచున ఫ్లోరల్ ప్రింట్ ఈ చీరకు మరింత రిచ్ నెస్ తెచ్చిపెట్టింది.

సరికొత్తగా సాయిపల్లవి..
ఈ స్కై బ్లూ కలర్ సారీలో సాయిపల్లవి సరికొత్తగా కనిపించింది. స్లీవ్ లెస్ జాకెట్ .. స్కై బ్లూ కలర్ సారీ తన అందాన్ని మరింత పెంచాయి. అయితే ఈమె ధరించిన ఈ సారీ ధర ఎంతో తెలిస్తే మనం షాకవ్వాల్సిందే.

లక్ష రూపాయలంట..!
ఈ చీర ధర సుమారు లక్ష రూపాయలని గుసగుసలు వినిపిస్తున్నాయంట. రియల్ లైఫ్ లో ఎప్పుడూ చాలా సింపుల్ గా కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు ఇంత ఖరీదైన చీర ధరించడం ఇదే తొలిసారి.

స్టైలీష్ హెయిర్ స్టైల్..
సాయి పల్లవి సహజంగా ఉండటమే కాదు.. తన హెయిర్ స్టైల్ వల్ల తన అందం మరింత పెరుగుతుంది. స్టూనర్ మ్రుణాళిని రావు చేత రూపొందించబడిన ఈ చీరను రెషామ్ ఎంబ్రాయిడరీతో సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి స్లీవ్ లెస్ జాకెట్ యాడ్ చేయడం వల్ల మరింత బ్యూటీఫుల్ గా కనిపించింది.

ఇయర్ రింగ్స్..
చీర హైలెట్ కావడానికి తన కురులను మొత్తం లూజుగా వదిలేసి.. వెండి రంగులో ఉండే ఇయర్ రింగ్స్ ను ధరించింది. ఈ ఫొటోలను సాయి పల్లవి తాజాగా తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు కొన్ని గంటల్లో లైకులు, కామెంట్లు తెగ వచ్చేస్తున్నాయి. సాయి పల్లవి ‘లవ్ స్టోరీ'తో పాటు రానాతో కలిసి ‘విరాటపర్వం' అనే సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు అతి త్వరలో వెండి తెర మీదకు రానున్నాయి. ఇప్పటికే సారంగ దరియా సాంగ్ తో నాగచైతన్యతో కలిసి నటించిన సినిమాకు కావాల్సినంత క్రేజ్ వచ్చేసింది.



Click it and Unblock the Notifications
