Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
తమన్నా బర్త్ డే స్పెషల్ : మోడ్రన్ చీరలలో హాట్ లుక్స్ తో కుర్రకారు మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ...
తమన్నా వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెకు ఆఫర్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఆమె అభిమానుల సంఖ్య సైతం ఏ మాత్రం తగ్గలేదు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దక్షిణ భారతదేశంతో పాటు బాలీవుడ్ లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తమన్నా వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెకు ఆఫర్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. ఆమె అభిమానుల సంఖ్య సైతం ఏ మాత్రం తగ్గలేదు. హ్యాపీ డేస్ ద్వారా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో అందరూ టాప్ హీరోలతో నటించే ఛాన్సు కొట్టేసింది.
అలా చూస్తుండగానే తను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 50కి (అర్థసెంచరీ)పైగా సినిమాలలో నటించి ఔరా అనిపించుకుంది. ఆమె తొలి సినిమా నుండి చాలా అందంగా మరియు సెక్సీ లుక్స్ తో కుర్రాళ్ల మతి పోగొట్టేది. అలా ఈరోజు (డిసెంబర్ 21వ తేదీన) 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమన్నా తళుక్కున మెరిసే చీరలతో తాజా లుక్స్ మీకోసం తీసుకొచ్చాము. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ల ద్వారా తెలియజేయగలరు...

ఎల్లో స్యారీ...
బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ తో తీసిన సినిమాలో ఎల్లో సారీతో నటించిన ఈ మిల్కీ బ్యూటీ ఎంతో మంది కుర్రకారు మతి పోగొట్టేసింది. ఇక ఈ చిత్రంలో వెండి కలర్ బ్యాంగిల్స్ వేసుకున్న ఈ అందాల భామ చాలా సింపుల్ గా కనిపిస్తోంది.

పింక్ స్యారీ..
ఈ చీరలో తమన్నా అందం మరింత పెరిగింది. ఈ చీరకు తగ్గట్టు జ్యువెలరీ కూడా సరిపోవడంతో ఇది మగువలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ఈమె చెవి రింగులు ఇంకా హైలెట్.

రెడ్ స్యారీ..
రెడ్ కలర్ సారీలోనూ తమన్నా తళుక్కున మెరిసిపోయింది. నైట్ మోడ్ లో ఫొటో స్టిల్ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ మ్యాచింగ్ జ్యువెలరీని ధరించింది.

ఆరెంజ్ స్యారీ..
ఆరెంజ్ సారీలోనూ ఈ అందాల బామ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చీరలో గోల్డెన్ జ్యువెలరీ వేసుకున్న ఈ భామ యూత్ కు పిచ్చెక్కిస్తోంది.

వైట్ స్యారీ..
వైట్ సారీలోనూ మిల్కీ బ్యూటీ మరింతగా మెరిసిపోతోంది. ఈ సారీ తగ్గ మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. అందుకు తగ్గట్టే జ్యువెలరీని ధరించింది. ఈ డ్రెస్ తో పాటు ఆమె స్మైల్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతారు.

గ్రీన్ స్యారీ..
గ్రీన్ కలర్ స్యారీలో నిలబడి ఫొటో స్టిల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది.

రోజ్ స్యారీ..
ఈ ఫొటోలో రోజ్ కలర్ స్యారీ సింపుల్ గా ఉన్నా తన జ్యువెలరీని హైలెట్ చేసింది. ముఖ్యంగా చేతి నిండా గాజులు. చెవికి రింగులు ధరించి చాలా అందంగా కనబడుతోంది.

హాట్ ఫోజు..
రామ్ చరణ్ తో నటించిన సినిమాలో వాన పాటలో ఈ చీరతో తన అందాలను మరోసారి ఆరబోసింది. దీంతో కుర్రాళ్లందరికీ పిచ్చెక్కిపోయింది. ముఖ్యంగా మెగాఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.

లేటెస్ట్ స్యారీ..
ఈ లేటెస్ట్ స్యారీ ద్వారా తాను నటనలోనే కాదు ఫ్యాషన్ లో సైతం ఒక అడుగు ముందే ఉంటానని నిరూపించింది. ఈ స్యారీతో పాటు డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, మిల్కీ బ్యూటీ స్మైల్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

లెహంగాలలో కూడా...
తమన్నాకు చీరలతో పాటు లెహంగా, లాంగ్ అనార్కలి, కుర్తాస్, టునిక్స్ చాలా ఇష్టమట.. అందుకే పెద్ద పెద్ద అకేషన్స్ లో మాత్రమే ఇండియన్ అవుట్ ఫిట్స్ లో అందరినీ అలరిస్తుంది.రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంట్లో మేకప్ లేకుండా ఉన్నప్పుడు ట్రాక్ ప్యాంట్స్ లేదా టీ షర్ట్స్ ధరిస్తుంది.



Click it and Unblock the Notifications

