Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Aditi Rao Hydari: అద్భుతమైన ఔట్‌ఫిట్‌లో అదరగొట్టిన అదితిరావు హైదరీ
సమ్మోహనం చిత్రం ద్వారా కుర్రాళ్లను సమ్మోహన పరిచిన బ్యూటీ అదితి రావు హైదరీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమా ద్వారానే ఆమె ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.
సమ్మోహనం చిత్రం ద్వారా కుర్రాళ్లను సమ్మోహన పరిచిన బ్యూటీ అదితి రావు హైదరీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమా ద్వారానే ఆమె ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.

అంతకుముందే పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన అదితి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుధీర్ బాబు హీరోగా వచ్చిన సమ్మోహనం చిత్రం ద్వారా ప్రేక్షకుల మనస్సు దోచుకుంది.

ఈ బ్యూటీ తెలుగమ్మాయి అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో పుట్టిన అదితి.. బాల్యం అంతా అక్కడే గడిపింది. తర్వాత వారి ఫ్యామిలీ హైదరాబాద్ కు అక్కడి నుండి ఢిల్లీకి మకాం మార్చింది.

అదితి రావు అందంతో, అభినయంతో ఆకట్టుకోవడంతో పాటు పాటలు కూడా పాడుతుంది. సమ్మోహనం చిత్రంలో 'ఓ చెలి తారా' అనే పాట తెలుగులో పాడింది. అంతకు ముందు అదితి ఏఆర్ రెహమాన్ సారథ్యంలో వచ్చిన 'వాన్ వరువాన్' పాటను పాడి సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది.

అదితి రావు హైదరీ పేరు వెనక పెద్ద స్టోరీయే ఉంది. అదితి తల్లి పేరు శాంతా రామేశ్వరరావు, తండ్రి పేరు ఇషాన్ హైదరీ.. వీళ్లద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోగా అదితి తల్లి శాంతా రామేశ్వరరావుతో ఉండిపోయింది. అలా తల్లి నుండి రావును, తండ్రి నుండి హైదరీని కలిపి అదితి రావు హైదరీగా తన పేరు మార్చుకుంది. తనను తండ్రి కూడా ఎంతో ప్రేమ చూసుకుంటాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

అదితి రావు హైదరీ అందంతో ఎప్పుడూ కుర్రాళ్లను ఆకట్టుకునే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫుల్ యాక్టివ్ గా ఉండే అదితి.. ఎప్పటికప్పుడు తన పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ ఔట్ ఫిట్ లో ఉన్న హాట్ పిక్స్ పోస్టు చేసింది. ఈ ఔట్ ఫిట్ పైకి హై హీల్స్ వేసుకుంది. చెవులకు పెద్ద సైజ్ రింగ్స్ ధరించింది.



Click it and Unblock the Notifications
