Latest Updates
-
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Kajal Aggarwal: బ్లాక్ డ్రెస్సులో అదిరిన చందమామ అందాలు, కాజల్ కవ్వింపులకు కుర్రకారు ఫిదా
కాజల్ అగర్వాల్.. దాదాపు గత 19 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. తన అందం, అభినయంతో అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2004లో లక్ష్మీ కల్యాణం సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి ఈ క్యూట్ బ్యూటీ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో అద్భుతమైన సినిమాల్లో నటించి చందమామగా మారిపోయింది.

ఆ తర్వాత చందమామ, మగధీర, గణేష్, ఆర్య, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ ఫెక్ట్, వీర, బిజినెస్ మాన్, సారొచ్చారు, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, అ! వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

అయితే మూడేళ్ల క్రితం గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకోగా.. ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుంచి సినిమాల్లో రీ ఎంట్రీ కోసం సోషల్ మీడియాను వేధికగా వాడుకుంది. తన అందమైన పొటోలను తరచుగా అభిమానులతో పంచుకుంటూ ఆఫర్ల కోసం గాళం వేసింది. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో ఛాన్సు కొట్టేసింది.

భారతీయుడు-2, ఎన్బీకే 108, గోస్టీ అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే హిందీలో రాబోతున్న ఉమ అనే చిత్రంలో కూడా మెరవబోతుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని పొటోలను షేర్ చేసింది. అందులో లాంగ్ బ్లాక్ డ్రెస్సులో అదిరిపోయింది.

నెట్టెడ్ హ్యాండ్స్ తో రంగురంగుల గీతలు ఉన్న డ్రెస్సు వేసుకున్న కాజల్.. పెద్ద పెద్ద ఇర్ రింగ్స్ పెట్టుకుంది. తన ఎద అందాలతో పాటు బాడీ షేపులన్నీ అధ్భుతంగా కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

పైన షర్ట్ లాంటిది వేసుకొని పలాజో వేసుకుంది. సన్నని నడుమును నయాగారా ఫాల్స్ లా తిప్పేసి తెగ సందడి చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇన్ స్టా గ్రామ్ వేధికగా కాజూ పాప ఈ ఫొటోలు షేర్ చేయగా... లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి.

రోజురోజుకూ నీ అందం పెరిగపోతుందని కొందరు, వయసు మరింత తగ్గుతుందని మరికొందరు చెబుతున్నారు.అసలు నువ్వు ఓ బాబుకి తల్లివనే అనిపించట్లేదని.. డెలివరీ తర్వాత కూడా నీ అందం ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.(All Images: Instagram)




Click it and Unblock the Notifications