Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Film fare Awards South: 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుక ఆడంబరమైన దుస్తుల్లో మెరిసిన సెలబ్రెటీలు..
Film fare Awards South: 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వేడుక ఆడంబరమైన దుస్తుల్లో మెరిసిన సెలబ్రెటీలు..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 67వ సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక అక్టోబర్ 09న బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. ఈ అవార్డు వేడుకకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం సినిమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సత్కరిస్తూ అవార్డులు అందజేశారు.

67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు హాజరైన పలువురు ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై కళ్లు చెదిరే దుస్తులతో హాజరయ్యారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2022కి అద్భుతమైన దుస్తులను ధరించిన ప్రముఖుల ఫోటోలు క్రింద ఉన్నాయి.

పూజా హెగ్డే
నటి పూజా హెగ్డే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై మిర్రర్ వర్క్‌తో మెరిసే డ్రెస్‌లో నడిచింది. ఈ డ్రెస్ కోసం ఆమె ఎలాంటి నగలు ధరించలేదు మరియు పోంచో ధరించింది.

సాయి పల్లవి
నటి సాయి పల్లవి ఏదైనా ఫంక్షన్‌కు హాజరైనప్పుడు సంప్రదాయ చీర కట్టుకుంటుంది. అదేవిధంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ చేసిన తెల్లటి చీరలో క్యూట్‌గా కనిపించింది.

ప్రియమణి
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకకు నటి ప్రియమణి గులాబీ రంగు చీర కట్టుకుంది. ఈ చీర ఎంబ్రాయిడరీ స్లీవ్‌లెస్ జాకెట్‌తో జత చేయబడింది, ఆమె మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

సూర్య-జ్యోతిక
'సురారై పోతు' చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడానికి నటుడు సూర్య తన భార్య నటి జ్యోతికతో కలిసి హాజరయ్యారు. సూర్య బ్లాక్ కోర్టు-సూట్ ధరించాడు. దానికి తగ్గట్టుగానే జ్యోతిక మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లాక్ డ్రెస్ వేసుకుంది.

టబు
నటి టబు కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. డిజైనర్ అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన పింక్ చీరను ఆమె ధరించింది.

అపర్ణ బాలమురళి
'సురారై పోత్రు' నటి అపర్ణ బాలమురళి 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకకు నల్లటి దుస్తులు ధరించారు. ఈ డ్రెస్ కోసం చెవుల్లో ఆభరణాలు వేసుకోకుండా, మెడలో హారం వేసుకోకుండా సింపుల్ గా వచ్చింది.

సానియా అయ్యప్పన్
మలయాళ నటి సానియా అయ్యప్పన్ 67వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు అందమైన హాల్టర్ నెక్ బ్లాక్ అండ్ వైట్ గౌనులో దేవతలా కనిపించింది.

మాధవన్
నటుడు మాధవన్ 67వ సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు ఆలివ్ గ్రీన్ కుర్తా మరియు ఎప్పటికీ కూల్ కూలింగ్ గ్లాసెస్‌తో హాజరయ్యారు.



Click it and Unblock the Notifications
