Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
ఆస్కార్ అవార్డ్స్ 2016: రెడ్ కార్పెట్ మీద సెంటరాఫ్ అట్రాక్షన్ గా మెరవనున్నప్రియాంక చోప్రా...
88వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి, ఇంటర్నేషనల్ పాప్‌స్టార్ ప్రియాంక చోప్రా విజేతలకు అవార్డ్స్ ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక రిహర్సల్స్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
సినిమా రంగానికి అందించిన సేవలకు గానూ కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ రోజు నుండి హాలీవుడ్ అవార్డుల పండగ 'ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ ఫంక్షన్' లో ఆమె 'ప్రెసెంటర్' గా మెరవనుంది. ఈ నెల 28న జరగనున్న రెడ్ కార్పెట్ వేడుకల్లో హాలీవుడ్ భామలతో పాటు ప్రియాంక కూడా తళుక్కుమనేందుకు సిద్ధమైంది.

ఆస్కార్ వేడుకలకు సంబంధించిన ప్రెసెంటర్ల జాబితాను అకాటమీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రియాంక ప్రెసెంటర్ గా ప్రకటించబడగా.. ప్రియాంకతో పాటు పలువురు హాలీవుడ్ దిగ్గజాలు ర్యాన్ గోస్లింగ్, చార్లెజ్ థిరాన్, స్టీవ్ కారెల్, జారెడ్ లెటో, రీజ్ విదర్‌స్పూన్, జూలియన్ మూర్ ప్రసెంటర్లుగా వ్యవహరించనున్నారు. అవార్డులు సాధించిన విజేతలకు ప్రియంక చోప్రా తన చేతుల మీదుగా అవార్డులు అందజేయనంది.

ఇటీవలే అమెరికా టీవీషో క్వాంటికోలో ట్రైనీ ఏజెంట్ గా నటించిన ప్రియాంకా చోప్రా.. 'పీపుల్స్ ఛాయిస్' అవార్డును కైవసం చేసుకొని వార్తల్లో నిలవగా.. కొద్ది రోజులకే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ ప్రసెంటర్ గా మరో ఘనతను సాధించింది.

బాలీవుడ్ సినిమా రంగంలో స్టైల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఘనత కూడా ప్రియాంక చోప్రాకే సంతం..ఆమె నటనతో, స్టైల్ తో ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొడుతుంది. మరి ఇంతటి బ్యూటిఫుల్ క్వాంటికో బ్యూటీ ఆస్కార్ అవార్డ్స్ 2016 రెడ్ కార్పెట్ మీద అత్యద్బుతమైన వైట్ జువారీ మురాడ్ స్ట్రాప్ లెస్ స్ప్రింగ్ 2016 కౌచ్చర్ వాక్ చేయడం అస్కార్ అవార్డ్స్ ప్రారంభోత్సవానికి మరింత వన్నెతెచ్చింది.

వైట్ డ్రెసులో చూడటానికి అందంగా ...హాలీవుడ్ బామలకు ఏమాత్రం తీసుపోకుండా ...వావ్ అనిపించే విధంగా అట్రాక్ట్ చేస్తోంది...
వైట్ జువారి మురద్ స్ట్రాప్ లెస్ గౌన్ లో మన ఈ ఇండియన్ బ్యూటీ , డ్రెస్ స్టైల్ కు తగ్గట్టే, హెయిర్ స్టైల్ కూడా మార్చేసింది ..

మేకప్ విషయంలో లైట్ అండ్ గోల్డెన్ స్మోకీ ఐస్ , పెదవుల నిండుగా మెంజంతా లిప్ కలర్స్ తో రెడ్ కార్పెట్ స్టార్స్ మద్య ఓ గ్లిట్టరింగ్ స్టార్ గా 2016ఆస్కార్ అవార్డ్స్ లో సందడి చేయనుంది...



Click it and Unblock the Notifications
