Latest Updates
-
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!
లేటెస్ట్ ఆరెంజ్ కలర్ దుస్తులతో కలర్ ఫుల్ గా కనిపిస్తున్న రకుల్ ప్రీత్..
రకుల్ ప్రీత్ మార్జావాన్ లో "తారా సుతారియా" యాక్షన్ - డ్రామా చిత్రంలో సిద్ధార్థ్ మల్హొత్రా, రితీష్ దేశ్ ముఖ్ సరసన కలిసి నటించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో థియేటర్లలో విడుదల కానుంది.

రకుల్ ప్రీత్ సింగ్ రోజుకో సెన్సెషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఎప్పటికప్పుడు న్యూ లుక్ లో కనిపించేందుకు ప్రయత్నించే రకుల్ ప్రీత్ తాజాగా మరో కొత్త డ్రెస్ తో ఫొటోషూట్ చేసింది. ఇప్పటికే బోలెడన్ని ఫొటో షూట్లు చేసిన రకుల్ ప్రీత్ మళ్లీ సడెన్ గా ఇలా ఎందుకు కొత్త ఫోజులిచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
రకుల్ ప్రీత్ సింగ్ కర్నాటక నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె అందచందాలకు కుర్రకారు ఫిదా అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా నిరాశ చెందని ఈ ఉత్తరాది భామ తెలుగులోనే సినిమాలను కంటిన్యూ చేసింది. లౌక్యం సినిమా హిట్ కావడంతో ఆమెకు ఆఫర్లు వరుసగా వచ్చేశాయి. దీంతో టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి తారక రామారావుతో కలిసి నటించే ఛాన్సు కొట్టేసింది. ఆ సినిమా కూడా హిట్టు కొట్టేయడంతో ఆ హీరోయిన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ వెంటనే మెగా ఫ్యామిలీ హీరోలతోనూ నటించింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ లో దాదాపు అగ్రనటులందరితోనూ నటించింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని మన్మథుడు, అక్కినేని, కింగ్ నాగార్జునతో సైతం మన్మథుడు-2లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. తొలిసారిగా సిగరేట్ తాగుతూ కనిపించింది. అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ హైదరాబాద్ లో పలు బిజినెస్ లను సైతం ప్రారంభించింది. ఇప్పటికే ఓ హిందీ సినిమా కూడా నటించిన రకుల్ మళ్లీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా తను నటించిన "దే దే ప్యార్ దే" చిత్ర ప్రమోషన్లను చురుకుగా నిర్వహిస్తోంది. అంతేకాదు తన ఆన్-పాయింట్ స్టైలిష్ స్టేట్మెంట్లతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. తాజాగా తాను ధరించిన ఆరెంజ్ కలర్ దుస్తులను పోస్ట్ చేసింది. సిఎన్ బిసి ప్యానెల్ చర్చ నిమిత్తం ఆమె ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ స్లీవ్ ఫ్రిల్లీ క్రాప్ టాప్ బ్లేజర్ ను ఎంచుకుంది. దానికి మ్యాచింగ్ గా అదే కలర్ తో ఉన్న పెన్సిల్ ప్యాంటును ధరించింది. డబుల్ బ్రెస్ట్ ఓవర్లాపింగ్ క్రాప్ బ్లేజర్ ఒక చల్లని పాతకాలపు - ప్రేరేపిత రూపాన్ని సృష్టించినట్లు ఉంది. ఇది పత్రికా కార్యక్రమాలు లేదా అధికారిక సమావేశాలకు సరైనది కాదని తెలుస్తోంది. ఇక ఆమె ఎత్తైన ప్యాంటులో ప్రతివైపు పాకెట్స్, ఫ్యాషన్ స్టేట్ మెంట్గా జిప్ ఫ్లై ఉన్నాయి. ఇలా ఏ యాంగిల్ లో చూసినా రకుల్ ఆ డ్రస్ లో మరింత ప్రకాశవంతంగా మెరిసింది.

రకుల్ ప్రీత్ మార్జావాన్ లో "తారా సుతారియా" యాక్షన్ - డ్రామా చిత్రంలో సిద్ధార్థ్ మల్హొత్రా, రితీష్ దేశ్ ముఖ్ సరసన కలిసి నటించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి ఆ సినిమా హిట్ కొట్టి బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే అక్టోబర్ వరకు వేచిచూడాల్సిందే.



Click it and Unblock the Notifications
