Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
స్టార్ సిగ్నేచర్ స్టైల్: వివిధ రకాలా గౌన్లలో ఐశ్వర్యా రాయ్
ఐశ్వర్యా రాయ్.. ఈమె ఒకప్పుడు సూపర్ మోడల్. ప్రపంచ సుందరి గా ఎన్నికయ్యి భారతీయ సినిమాలలో అందాల నటి గా వెలుగొందుతున్న ఈ సెక్సీ నీలి కళ్ళ సుందరి ముఖం అందం గా ఉండటమే కాదు ఆమె శరీరం కూడా తీర్చిదిద్దినట్లుంటుంది.హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ లాంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.పింక్ పాంథర్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ లాంటి హాలీవుడ్ సినిమాలలో కూడా ఐశ్వర్యా రాయ్ నటించింది.మా సిగ్నేచర్ స్టైల్ సెక్షన్ ద్వారా ప్రసిద్ధ బాలీవుడ్ సెలెబ్రిటీల ఫేవరెట్ వస్త్రధారణ,వారు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు లేదా అలా క్యాజువల్ హ్యాంగ్ అవుట్స్ లో ధరించడానికి ఇష్టపడే వస్త్ర్తాల గురించి ముచ్చటిస్తాము.ఈరోజు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కి ఇష్టమైన వస్త్రధారణ గురించి చర్చిస్తున్నాము.ఆమె ఫ్యామిలీ తో డిన్నర్ కి వెళ్ళినప్పుడో లేదా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు, లేదా కాలేజీ స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడాల్సొచ్చినప్పుడో ఏమి ధరించడానికి ఇష్టపడుతుందో తెలుస్సుకోవాలనుందా?? ఆమెకి గౌన్లు అంటే ప్రీతి.పబ్లిక్ లోకి వచ్చినప్పుడల్లా రకరకాల గౌన్లని ధరించడానికి ఆమె ఇష్టపడుతుంది. ఆమె గౌన్లు ధరించిన వివిధ సంధర్భాలు చూద్దాము.

ఇక్కడ ఐశ్వర్యా రాయ్ నుపుర్ కనోయ్ గౌన్లో అందరి దృష్టి తన మీద పడే విధం గా మెరిసిపోతోంది.ఫ్లోర్ లెంగ్త్ ఉన్న గ్రే ఫ్లేర్డ్ గౌను లో ఈమె అధ్భుతం గా ఉంది. గౌను వెనుక భాగం బ్యాక్ లెస్ గా ఉండి ఐశ్వర్య మరింత సెక్సీ గా కనిపిస్తోంది.

ఇటీవలి కాలం లో వచ్చిన తన సినిమా జజ్బా ప్రమోషన్ లో భాగం గా ఆమె అనేక కార్యక్రమాల్లో పాల్గొంది.పక్కన స్లిట్స్ ఉన్న కాఫ్టన్ గౌను లో ఈమె మెరిసిపోవట్లేదూ?? మోనీషా జైసింగ్ కలెక్షన్ లో భాగమైన ఈ గౌను ఆమె కి బాగా నప్పింది.ఒక్క మాటలో చెప్పాలంటే అందానికి నిర్వచనం లా ఉందనచ్చు.

పసుపు పచ్చ సన్ షైన్ గౌను ధరించిన ఐశ్వర్య ని చూసారా ఈ ఫొటోలో?? అయ్య బాబోయ్, ఎంత అందం ఎంత అందం.ఈ రంగు ఆమె శరీరపు ఒంపు సొంపుల అందాన్ని ద్విగుణీకృతం చేసింది.బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన డిజైనర్లు గౌరీ మరియు నైనికా ఈ గౌను రూపకర్తలు.ఈ మధ్య తరచుగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తున్న ఐశ్వర్య ని చూసాకా ఈ పసుపు రంగు గౌను లో ఆమెని చూస్తే ఒక ఆహ్లాదకరమైన మార్పు లా ఉంది.
ఇదీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ సిగ్నేచర్ స్టైల్. బాలీవుడ్ సెలిబ్రిటీల గురించి మరింత సమాచారం కొరకు ఈ సెక్షన్ ని చూస్తూ ఉండండి. మీ అభిప్రాయాలని మాతో పంచుకోవడం మరచిపోవద్దు సుమా.



Click it and Unblock the Notifications
