Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
స్టార్ సిగ్నేచర్ స్టైల్: హైదర్ సినిమాలో టాబూ కాశ్మీరీ డ్రస్సులు
అమాయకత్వం, హుందాతనంతోకూడిన అందం అంటే టాబూ నే గుర్తుకొస్తుంది.బాలీవుడ్ లో తను చాలా విజయాలు సాధించింది. ఆమె ఒక అసమాన నటి.ఘాత్ మరియూ చాందినీ బార్ సినిమాలలో ఆమె నటనని ఎవ్వరూ మర్చిపోలేరు.
ఆ మధ్య వెండి తెర నుండి కాస్త విరామం తీసుకున్న టాబూ హైదర్ సినిమాతో మరలా వెండి తెర మీద మెరిసింది.షేక్స్ పియర్ హేమ్‌లెట్ నాటకం ఆధారంగా హైదర్ సినిమా రూపొందింది. ఈ సినిమాలో టాబూ తన బావగారితో రహస్య ప్రేమాయణాన్ని సాగిస్తూ ఉంటుంది.
షాహిద్ కి ఈ విషయం తెలిసి ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఈ సినిమాలో కాశ్మీర్ లో జరిగే తిరుగుబాటు ఘటనలని కూడా మన కళ్ళకి కడుతుంది.అంతటి శక్తివంతమైన పాత్ర పోషించడంటే టాబూ ఎంత ధైర్యవంతురాలో చూడండి.

ఒక కాశ్మీరీ జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో టాబూ రకరకాల కాశ్మీరీ దుస్తుల్లో కనిపిస్తుంది.ఎక్కువగా కాశ్మీరీ పంజాబీ సూట్లు ధరించి టాబూ కనువిందు చేస్తుంది.అవి చూస్తే ఆమె ఆ దుస్తులని ధరించడానికి ఎంత మక్కువ చూపిందో మనకి తెలిసిపోతుంది.
ఈరోజు స్టార్ సిగ్నేచర్ స్టైల్ సెక్షన్ లో టాబూ ధరించిన కాశ్మీరీ డ్రెస్సుల గురించి మాట్లాడుకుందాము.

మొదట ఆమె ధరించిన ఎర్రటి డ్రస్ చూద్దాము.ఒక సీన్ లో టాబూ ఎంబ్రాయిడరీ చేసిన ఎర్రటి డ్రెస్సులో కనిపిస్తుంది.ఆ సీన్ గుర్తుందా?? షాహిద్ కపూర్ పగ తీర్చుకునేముందు ఆమె అందాన్ని చూసి అభిమానించే సీన్ అది.ఆ సీన్ లో టాబూ ధరించిన ఎర్ర డ్రెస్స్ గురించే మేము చెప్పేది.ఆ ఎర్ర రంగు దుస్తుల్లో టాబూ ముగ్ధ మనోహరంగా ఉంది.
రెండొది, టాబూ ధరించిన ఆకుపచ్చటి డ్రెస్.ఆ డ్రెస్ ధరించినప్పుడు వచ్చే సీన్ ఆమె ధరించిన డ్రెస్స్ లాగే చాలా బరువుగా గా ఉంటుంది .ఆ దుస్తుల్లో ఆమె ఎంత అందం గా ఉందో.ఆ డ్రెస్స్ మీద అనేక రకాల దారాలు అందం గా అలంకరించబడ్డాయి. ఈ సినిమాలో టాబూ ధరించిన దుస్తులలో కెల్లా ఇదే ఉత్తమం అనచ్చు.

చివరిగా, షాహిద్ తో మాట్లాడుతున్నప్పుడు టాబూ ధరించిన డ్రెస్స్ చూద్దాము.పొడుగైన మరూన్ కలర్ కఫ్టాన్ డ్రెస్ మీద నీలి రంగు దుపట్టా ధరించింది టాబూ. దుపట్టా, డ్రెస్ కి పెద్దగా మ్యాచ్ అవ్వకపోయినా టాబూ కి ఈ డ్రెస్స్ నప్పింది.
ఇవండీ హైదర్ సినిమాలో టాబూ ధరించిన ముగ్ధమనోహరమైన డ్రెస్సుల వివరాలు.బోల్డ్ స్కై తరపున ఆమెకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.ఈ ఆర్టికిల్ మీద అభిప్రాయాలని మాతో పంచుకోండి. మీరు మీ అభిమాన నటి లేదా నటుడి సిగ్నేచర్ స్టైల్ గురించి చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.



Click it and Unblock the Notifications
