Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2018 లో, తన సౌందర్యంతో ప్రతిఒక్కరినీ సమ్మోహపరచిన జాహ్నవి కపూర్!
వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2018 లో, తన సౌందర్యంతో ప్రతిఒక్కరినీ సమ్మోహపరచిన జాహ్నవి కపూర్!
వోగ్ బ్యూటీ అవార్డులకు హాజరైన జాహ్నవి కపూర్, అందాలను ప్రదర్శించదానికి అవకాశమిచ్చే దుస్తులను ధరించి, తన తెగువతో మనందరిని ఆశ్చర్యపరిచింది. ధడక్ లో నటించాలని నిర్ణయించుకున్నప్పటి నుండి, ఈ నటీమణి వార్తలలో నానుతూనే ఉంది. ఇప్పటివరకు మనం ఆమెను చూసిన వాటిలో, దీనిని ఆమె ఉత్తమ ప్రదర్శనలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆమె స్వభావరిత్యా సిగ్గరి అని తరచూ వెల్లడించినప్పటికిని, ప్రయోగాత్మకమైన దుస్తులను ధరించే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నిజానికి, ఆమె నేటి యువతకు సొగసు సోయగాల విషయంలో స్ఫూర్తిగా మారింది.
ఈ సుందరాంగి, రాల్ఫ్ & రస్సోచే సృష్టింపబడిన భుజాలు లేని గౌనును ఈ ఈవెంట్ కోసం ధరించింది. వైవిధ్యమైన నిర్మాణం కలిగిన ఈ దుస్తులలో, ఆమె ఒక ఐస్-ప్రిన్సెస్ లా కనపడింది. ఆమె అలంకరణలో ముఖ్యంగా, నేలపై జీరాడే గౌనుపై పొదిగిన పక్షి ఈకల వంటి నిర్మాణాలు వింత శోభను చేకూర్చాయి. ప్రకృతి నుండి ప్రేరణ పొందిన ఎంబ్రాయిడరీ మోటిఫ్స్ కూడా జాహ్నవి అలంకరణ స్థాయిని ఒక మెట్టు పైకెక్కించింది.

వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2018 లో జాహ్నవి కపూర్
తను ధరించిన అద్భుతమైన దుస్తులకు జతగా, మేనికాంతిని నలుదిక్కులకు ప్రసారింపజేసే, భారీ ప్రకాశవంతమైన మేకప్ తో అభిమానులను కట్టిపడేసింది.
పెదవులకు గులాబీ సోయగాలు అద్ది, చెవులకు మెరిసే పూల దిద్దులను పెట్టి, అందానికి తానే అర్ధమనే భావన కలిగించింది. జుట్టును గాలికి ఎగసిపడే అలల వలే తీర్చిద్దుకుని, మత్తెకించే నవ్వుతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.

ఆమెను ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం వరించింది. తన రూపురేఖల మాయాజాలంతో ప్రతిఒక్కరి చేత వావ్! అనిపించింది. రాబోయే కాలంలో, ఉత్తమ ఫ్యాషన్ అభిరుచికి స్ఫూర్తిగా ఆమె నిలుస్తుందని మనం తప్పక నమ్మాలి!




Click it and Unblock the Notifications
