Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Filmfare Awards Telugu 2022: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో తళుక్కున మెరిసిన తారలు
ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ లో టాలీవుడ్ కు చెందిన సినీ తారలు తమ ఫ్యాషన్ వేర్ తో సూపర్ లుక్ లో కనిపించారు.
Filmfare Awards Telugu 2022: కమర్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2022 అవార్డ్స్ ఫంక్షన్ అక్టోబర్ 9వ తేదీన అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అవార్డ్స్ ప్రకటించారు.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా అత్యధిక అవార్డులు కైవసం చేసుకుంది. మొత్తం 7 అవార్డులు వచ్చాయి.
ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ లో టాలీవుడ్ కు చెందిన సినీ తారలు తమ ఫ్యాషన్ వేర్ తో సూపర్ లుక్ లో కనిపించారు.

సుకుమార్, తబితా
బ్లాక్ అండ్ బ్లాక్ లో డైరెక్టర్ సుకుమార్, ఆయన భార్య తబితా అమేజింగ్ గా కనిపించారు. నెరసిన గడ్డంతో సుకుమార్ మ్యాన్లీ లుక్ లో కనిపించారు. మినిమల్ యాక్ససెరీస్ తో చేతికి ఒక వాచ్ పెట్టుకుని సింపుల్ అండ్ క్లాస్ గా కనిపించారు. తబితా లెహంగాలో కూల్ లుక్ తో అదరగొట్టింది. లైట్ వేవీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. పుష్ప: ది రైజ్ పార్ట్-1 కు గానూ సుకుమార్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.

మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాలో సీతా పాత్రలో కనిపించి కుర్రాళ్ల మనసులు దోచేసిన మృణాల్ ఠాకూర్.. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కనిపించి ఫ్యాషన్ ప్రియుల మదిని కొల్లగొట్టింది. లెహంగాలో ట్రెడిషనల్ అండ్ క్యూట్ గా కనిపించింది.

పూజా హెగ్డే
వరుస సినిమాలతో బిజి బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కనిపించి కవ్వించింది. అందాలు పొదిగిన వెస్టర్న్ వేర్ లో కనిపించి అందంలా మెరిసిపోయింది. లేటెస్ట్ ఫ్యాషనబుల్ లుక్ లో పూజా హెగ్డే నిజంగా అదిరిపోయింది.

టబు
ఎప్పట్లాగే టబు ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ మెరిసిపోయింది. గులాబీ కలర్ శారీలో టబు నిజంగా అదిరిపోయింది. చీర కట్టుతో తన అందం రెట్టింపు అయింది. మెడను అలా ఖాళీగా వదిలేసి, చెవులకో మీడియం సైజ్ రింగ్స్ పెట్టుకుంది. గ్లాసీ లిప్ కలర్ తన నవ్వుకు మరింత అందాన్ని జోడించింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి దేవకన్యలా కనిపించింది.

మాధవన్
నంబి నారాయణ్ పాత్రలో నటించి రాకెట్రీ సినిమాతో మన ముందుకు వచ్చిన మాధవన్.. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మ్యాన్లీ లుక్ లో కనిపించాడు. డార్క్ గ్రీన్ కలర్ శర్వాణి, బ్లాక్ కలర్ ట్రౌజర్, బ్లాక్ ఆక్స్ ఫర్డ్ మ్యాచ్ చేశాడు. ఈ లుక్ పైకి షేడ్స్ తో మ్యాన్లీగా కనిపించాడు.

సందీప్ కిషన్
బ్లాక్ సూట్ లో సందీపి కిషన్ సూపర్ కూల్ గా కనిపించాడు. సూట్ ను క్యాజువల్ గా ధరించాడు. బ్లాక్ ఆక్స్ ఫర్డ్ షూతో కనిపించాడు.

బ్రహ్మాజీ
బ్రహ్మాజీ ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలో కొత్తగా కనిపించాడు. ఎప్పుడూ సింపుల్ గా కనిపించే బ్రహ్మాజీ అవార్డు వేడుకల్లో సూపర్ లుక్ లో కనిపించాడు. చేనేత తరహా మోడీ జాకెట్ ధరించి కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ షూ ధరించాడు.



Click it and Unblock the Notifications
