Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అప్సరగా మారిన భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే.. అందుకోసమే ఈ వేషధారణ..
భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే అప్సరగా వేషధారణలో కనిపించారు. కేవలం ఫోటోషూట్ కోసమో ఫ్యాషన్‌పై ఆమెకున్న క్రేజ్ వల్ల ఈ ఫోటోలను పోస్ట్ చేయలేదు. కంబోడియా నూతన సంవత్సరం ప్రారంభమైన కారణంగా అక్కడి ఖైమర్ సంసృతిని చాటే విధంగా ఖైమర్ అప్సర వేషధారణలో ఆమె కనిపించారు.

ఖైమర్ అప్సర
ఖైమర్ అప్సరగా వేషధారణ ధరించి కంబోడియన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఖైమర్ సంసృతి, సంప్రదాయాలపై తనకు అమితమైన గౌరవం ఉందని అందువల్లే ఖైమర్ అప్సరగా వేషధారణ ధరించి కంబోడియన్‌లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు భారత దౌత్యవేత్త దేవయాని షోబ్రోగాడే.
కంబోడియాలో భారత రాయబార సోషల్ మీడియా అధికారిక అకౌంట్ నుంచి ఈ విషయాలను, రాయబారి అధికారి దేవయానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఖైమర్ సంసృతి సాంప్రదాయాలు ఉట్టిపడేట్టుగా వస్త్రాధారణ ధరించినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.
దేవయాని ఖోబ్రోగాడే 1991కు బ్యాచ్‌కు చెందిన సివిల్ సర్వెంట్. అప్పటి నుంచి ఆమె ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె కెరీర్‌లో అమెరికా, బెర్లిన్‌తోపాటు పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, ఇరాన్ దేశాల్లో భారత రాయబారిగా పనిచేసారు. భారతదేశ విదేశాంగ శాఖలో ఎన్నో కీలక బాధ్యతలను దేవయాని చేపట్టారు.
ఈ నెలలో భారతదేశంలోని దాాదాపు అన్ని రాష్ట్రాల్లో వారి వారి సాంప్రదాయాలు సంస్కృతి ప్రకారం నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. అలాగే కంబోడియాలో కూడా వారి సాంప్రదాయం ప్రకారం నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. ఇటవలే తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాదిని మనమంతా జరుపుకున్న విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications
