Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Miss World 2023: దాదాపు 3 దశాబ్దాల తర్వాత.. భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు
మిస్ వరల్డ్ 2023 పోటీలు ఇండియాలో జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తిరిగి భారత్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు భారత దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ వేదికగా మిస్ వరల్డ్ 71వ ఎడిషిన్ ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్నాయి.
చివరిసారిగా 1996లో ఈ ప్రపంచ అందాల పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పటికి 27 ఏళ్లు అవుతున్నాయి. మళ్లీ ఇప్పుడు భారత్ కు ఈ ప్రపంచ అందాల పోటీలను నిర్వహించే అవకాశం దక్కింది.

నెల రోజుల పాటు పోటీలు:
నెల రోజుల పాటు సాగే ఈ పోటీలు చాలా కఠినంగా ఉంటాయి. అందాలు పోటీలు కదా అని కేవలం శారీరక అందాన్ని మాత్రమే చూస్తారనుకుంటే పొరబడినట్లే. మిగతా రంగాల్లోనూ ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీల్లో అందమే ప్రధానం అయినప్పటికీ, అదొక్కటే కీలకం కాదు. టాలెంట్ ప్రదర్శన, స్పోర్ట్స్ ఛాలెంజ్, ఛారిటీ పనులతో పాటు మార్పుకు చిహ్నంగా నిలిచే వారే ఈ పోటీల్లో విజేతగా నిలుస్తారు.
యూఏఈ నుంచి భారత్‌కు మార్పు:
నిజానికి ఈ సారి మిస్ వరల్డ్ పోటీలు యూఏఈలో జరుగుతాయని ప్రచారం జరిగింది. అక్కడే జరుగుతాయని కొందరు కన్‌ఫమ్ చేశారు కూడా. కానీ.. ఇంతలోనే వేదిక మారిపోయింది. 71 ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను ఇండియాలోనే నిర్వహిస్తామని ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.
మిస్ వరల్డ్ గెలిచిన భారతీయులు:
2023 డిసెంబర్ లో జరిగేది 71వ మిస్ వరల్డ్ ఎడిషన్. అంటే ఇప్పటి వరకు 71 సార్లు ఈ అందాల పోటీలు జరిగాయి. ఇందులో భారత్ ఆరుగురు మాత్రమే మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచారు.
రీటా ఫారియా - 1966
ఐశ్వర్య రాయ్ - 1994
డయానా హేడెన్ - 1997
యుక్తా ముఖి - 1999
ప్రియాంక చోప్రా - 2000
మానుషి చిల్లర్ - 2017
ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జులియో మోర్లీ భారత్ లో పర్యటించారు. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయలను చూసి మనసు పారేసుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. భారత్ కు వస్తే తనకు సొంతింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు. ఇక్కడి కుటుంబ విలువలు, ప్రేమ, దయ ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్న జులియో మోర్గీ.. భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.



Click it and Unblock the Notifications