Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఈ విషయాలు తెలుసా?
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్నా.. చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా మారింది. పుష్ప సినిమాతో మరింత దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ. తన గ్లామర్ తో, తన నటనతో కుర్ర హృదయాలను దోచుకుంది.

ఏప్రిల్ 5వ తేదీన రష్మిక మందన్నా పుట్టినరోజు. 1996లో జన్మించిన రష్మిక, ఇప్పుడు 27 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కుర్ర హీరోయిన్ ఇప్పటికే ఎంతో మంది మనసులు గెలుచుకుంది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్(కొడుగు) జిల్లాలోని విరాజ్ పేట్ లో 1996 ఏప్రిల్ 5వ తేదీన జన్మించింది. రష్మిక తల్లి పేరు సుమన్, తండ్రి పేరు మదన్ మందన్నా. రష్మికకు షిమాన్ అనే చెల్లులు ఉంది.

రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్ లోనే పాఠశాల విద్య అభ్యసించింది. సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఎం.ఎస్. రామయ్య కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2012 నుండే రష్మిక మోడలింగ్ చేయడం ప్రారంభించింది. పలు ప్రకటనల్లోనూ కనిపించింది. అలా క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డును గెలుచుకుంది.

క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ప్రకటనలో రష్మికను చూసిన కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి తనకు సినిమా అవకాశం ఇచ్చాడు. 2016లో కిరిక్ పార్టీ సినిమాలో రక్షిత్ శెట్టితో కలిసి నటించి తొలిసారి స్క్రీన్ పై కనిపించింది రష్మిక. కిరిక్ పార్టీ హీరో అయిన రక్షిత్ శెట్టితో రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వారు 2018లో తమ నిశ్చితార్థాన్ని క్యాన్సల్ చేసుకున్నారు.

తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాలో నాగ శౌర్య సరసన నటించింది. అదే రష్మిక మందన్నాకు తొలి తెలుగు సినిమా. ఆ మూవీలో రష్మిక అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆతర్వాత తనకు అవకాశాలు రావడం మొదలైంది. చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా మారిపోయింది.

రష్మిక మందన్నా తెలుగులో తీసిన గీతా గోవిందం, పుష్ప సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే తన ఫోకస్ ను బాలీవుడ్ పై పెట్టింది. ఒకవైపు తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్‌లో అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే పలు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్ లో అవకాశాల కోసం అక్కడి హీరోయిన్లతో గ్లామర్ ప్రదర్శనలో పోటీ పడుతోంది. రష్మిక మందన్నా తన అందాల ఆరబోతలో హద్దులు లేకుండా దూసుకుపోతోంది. వివిధ రకాల ఔట్‌ఫిట్‌లు ధరిస్తూ థైస్ షో, నడుము, ఎద అందాల ప్రదర్శనతో కుర్రకారులో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తాజాగా రష్మిక మందన్నా 'రెయిన్ బో' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పింది. ఈ సినిమాను శాంతిరుబన్ డైరెక్ట్ చేయనున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు.



Click it and Unblock the Notifications