Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో అందరి చూపూ శ్రీదేవి కూతుర్ల మీదే
నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో అందరి చూపూ శ్రీదేవి కూతుర్ల మీదే
మే 3వ తేదీసాయంత్రం 4 గంటలకు, జాన్వీ మరియు ఖుషీ వారి తండ్రి బోనీ కపూర్ తో కలిసి 65 వ నేషనల్ ఫిలిం అవార్డులకు విజ్ఞాన్ భవన్ కు విచ్చేశారు.
జాన్వీ, ఖుషీ ఇద్దరూ సంప్రదాయిక చీరలను ధరించి ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. శ్రీదేవి చివరి సినిమా అయిన “మాం” లో ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్న నేపధ్యంలో, అవార్డు స్వీకారానికి పరమపదించిన శ్రీదేవీకి ప్రత్యామ్నాయంగా ఈ ముగ్గురూ విచ్చేసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీదేవి చివరగా నటించిన “మాం” చిత్రం లో ప్రతీకారం తీర్చుకునే తల్లి పాత్రలో ఒదిగిపోయి నడించి క్రిటిక్స్ ప్రశంసలను కూడా అందుకుంది.

ఈ ఇద్దరు సిస్టర్స్, ధరించిన సాంప్రదాయిక దుస్తులు శ్రీదేవిని మరపించేవిలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జాన్వి క్లాసిక్ పాస్టెల్ పింక్-హుడ్ సరిహద్దులతో ప్రాధాన్యత ఇవ్వబడిన నావి- డ్రాప్ ప్రింటెడ్ పూల చీరను ధరించింది. తక్కువ మేకప్ మరియు నగలతో, ఒకపక్క బుజం పై జాలువారుతున్న జుట్టుని కలిగి అబ్బురపరచేలా సరికొత్తగా కనిపించింది.
జాన్వి చెల్లెలు ఖుషి, స్టన్నింగ్ లుక్ తో ముదురు రంగు దుస్తులను ఎంచుకుంది. ఖుషి భిన్నమైన రంగులకు ప్రాధాన్యమిచ్చింది. తద్వారా, ఎర్రమట్టి రంగు బోట్- నెక్ బ్లౌస్ ధరించారు. జాన్వీలా కాకుండా సమకాలీన దుస్తులైన పరికిణీ-పావడలో సంప్రదాయక మేళవింపుని జోడించినట్లు కనిపించింది. ప్రింటెడ్ గ్రే బాటం, ఎర్ర మట్టి అంచు పరికిణీ ధరించి, తక్కువ నగలతో, మద్యపాపిటి హెయిర్ స్టైల్ లో ఎంతో అందంగా కనిపించింది.

ఫిబ్రవరిలో దుబాయిలో జరిగిన శ్రీదేవి మరణం ఈ కుటుంబాన్ని ఎంతగా కుంగదీసిందో వేరే చెప్పనవసరం లేదు. ఆ తర్వాత వీరు ఎప్పుడూ ఎటువంటి కార్యక్రమాలలోనూ కనపడలేదు. ఈ కార్యక్రమానికి కూడా శ్రీదేవి చివరి బహుమతిని అందుకునే నేపద్యంలో భాగంగా వచ్చారు. శ్రీదేవీకి ఎవరూ ప్రత్యామ్నాయం కాకపోయినా, శ్రీదేవి అంతటి వారవ్వాలని, తల్లి పేరు నిలబెట్టేలా వీరి పురోగతి ఉంటుందని ఆశిద్దాం.
జాన్వి ఖుషి లలో మీకు ఎవరు ఎక్కువగా నచ్చారు ? క్రింది కామెంట్ బాక్స్ లో తెలుపండి.



Click it and Unblock the Notifications