Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా
రెస్టారెంట్ స్టైల్ లో క్రీమీగా, జ్యూసీగా ఉండే మలాయ్ చికెన్ తినాలని ఉందా? కానీ బరువు పెరుగుతామనే భయంతోనో, నూనె ఎక్కువగా ఉంటుందనే డైటింగ్ రూల్స్ తోనో మీ కోరికను చంపుకుంటున్నారా? అయితే ఇంట్లోనే, అదీ చుక్క నూనె లేకుండా, ఎంతో ఆరోగ్యకరమైన మలాయ్ చికెన్ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, కండరాల పుష్టికి అవసరమైన హై ప్రోటీన్ రెసిపీ కూడా. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా సాఫ్ట్ గా, జ్యూసీగా ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా, లేదా రాత్రి పూట హెల్తీ డిన్నర్ చేయాలనుకున్నా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

మలాయ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ లెగ్ పీసులు
నీళ్లు తీసేసిన గట్టి పెరుగు
ఫ్రెష్ క్రీమ్
ఉప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
కసూరి మేతి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
శెనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
మలాయ్ చికెన్ తయారీ విధానం
-ముందుగా చికెన్ లెగ్ పీసులను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. మసాలా లోపలి దాకా వెళ్లడానికి వీలుగా చాకుతో చికెన్ ముక్కల మీద చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో గట్టి పెరుగు, ఫ్రెష్ క్రీమ్, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.ఆ తర్వాత ఇందులో కసూరి మేతిని చేతులతో నలిపి వేయాలి. అలాగే కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి మసాలా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
-మసాలా ముక్కలకు పర్ఫెక్ట్ గా పట్టాలంటే బైండింగ్ ముఖ్యం. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి వేసి, చికెన్ లెగ్ పీసులకు మసాలా అంతా బాగా పట్టేలా చేత్తో మర్దన చేసినట్లుగా కలపాలి.
-మసాలా పట్టించిన చికెన్ ని మూతపెట్టి కనీసం 1 గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఎంత ఎక్కువసేపు ఉంచితే చికెన్ అంత జ్యూసీగా తయారవుతుంది.
-ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకుని అందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఒకదానికొకటి అంటుకోకుండా కాస్త గ్యాప్ ఇచ్చి సర్దాలి. ఎయిర్ ఫ్రైయర్ ని 160°C దగ్గర సెట్ చేసి, 30 నిమిషాల పాటు కుక్ చేయాలి.
-15 నిమిషాల తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తెరిచి, ముక్కలను మరోవైపు తిప్పాలి. ఇలా చేయడం వల్ల చికెన్ అన్ని వైపులా సమానంగా, రోస్ట్ గా ఉడుకుతుంది.
-అంతే గుమగుమలాడే మలాయ్ చికెన్ రెడీ. ఎయిర్ ఫ్రైయర్ నుంచి వేడివేడిగా బయటకు తీసిన ఈ జ్యూసీ చికెన్ ని పుదీనా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేస్తే ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications