Latest Updates
-
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ!
Met Gala 2024 : మెట్ గలా 2024లో మన భారతీయుల లుక్స్ పై ఓ లుక్ వేయండి..!
ప్రపంచంలో అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గలా 2024 న్యూయార్క్‌లో జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ వోగ్ మ్యాగజైన్ నిర్వహించిన ఈ ఫ్యాషన్‌షోలో మన భారత నటీమణులు, మోడల్స్, వ్యాపారవేత్తలు, ఉద్యోగిణులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ నుంచి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సుధా రెడ్డి వరకు ఇలా 9 మంది భారతీయ రాణులు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.

ప్రతీ సంవత్సరం ఈ మెట్ గలా ఫ్యాషన్ షోకు ఓ థీమ్ ఉంటుంది. ఈ సారి నిద్రిస్తున్న "సుందరీలు, ఫ్యాషన్‌ను మేల్కొలుపుతున్నారు" ( స్లీపింగ్ బ్యూటీస్ : రీఅవేకనింగ్ ఫ్యాషన్) అనే థీమ్‌తో సాగుతోంది.
అమెరికాలోని న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఈ ఫ్యాషన్ షోను నిర్వహించారు.
మెట్ గలా 2024 ఫ్యాషన్ సెలబ్రేషన్‌కు విచ్చేసిన భారత అతిధులు వీరే :
అలియాభట్
బాలీవుడ్ నటి అలియాభట్ సారీలో దర్శనిమిచ్చారు. ఆకుపచ్చని పూలు, తెల్లని బ్యాగ్రౌండ్‌తో, నెట్ మోడల్‌లో ఉండే సారీలో అలియా కనువిందు చేశారు. గత సంవత్స నుంచి అలియా ఈ మెట్ గలా షోలో పాల్గొంటోంది.
ఇషా అంబానీ
అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా ఈ మెట్ గలాలో కనిపించారు. ఇషా కూడా ఇండియన్ డిజైనర్ రాహుల్ మిష్రా డిజైన్ చేసిన సారీలో కనిపించారు.
సభ్యసాచి
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సభ్యసాచి జెవెలరీ అధినేత సభ్యసాచి ముఖర్జీ కూడా ఈ మెట్ గలాలో కనువిందు చేశారు. సినిమా, వ్యాపార రంగంలో ఎంతో మందికి ఈయన డిజైన్ చేస్తారు. సమంత, కత్రినా కేష్, ఐశ్వర్యారాయ్, దీపికా పడుకొనే, సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో డిజైనింగ్ ఇలా ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో డిజైన్లను అందించారు.
నతాషా పూనావాలా
భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సీరమ్ ఇన్స్‌టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా భార్య నతాషా పూనావాలా కూడా ఈ ఫ్యాషన్ సెలబ్రేషన్‌లో అలరించడం విషేశం.
మోనా పటేల్
ప్రముఖ వ్యాపారవేత్త మోనా పటేల్ కూడా ఈ ఫ్యాషన్ షోలో కనువిందు చేశారు. మెట్ గలాకు రావడం ఆమెకు ఇదే మొదటిసారి. మోనా వేసుకున్న డ్రెస్, డిజైన్‌కు సోషల్ మీడియాలో చాలా ప్రశంసలు వచ్చాయ్. బటర్‌ఫ్లై డిజైన్‌లో ఉన్న ఆమె డ్రెస్ నడుస్తూ ఉంటే సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్లు ఆమె డ్రెస్‌కు ఉన్న ఇరువైపుల రెక్కలు కదులుతాయ్. మోనా పటేల్ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ ఇరిస్ వాన్ హెర్పెన్ డిజైన్ చేశారు.
మైండ్లీ కెలింగ్
భారత సంతతికి చెందిన అమెరికన్ నటి మైండ్లీ కెలింగ్ కూడా ఈ మెట్ గలా లో కనువిందు చేశారు. అయితే ఆమె ధరించిన డ్రెస్ గతంలో ఐశ్వర్య ధరించిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఐశ్వర్య 2022లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో వేసుకున్న డ్రెస్‌ను కాపీ కొట్టిందని విమర్శలు వస్తున్నాయ్.
సుధా రెడ్డి
భారత ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి ఈ ఫ్యాషన్ షోలో మరో సారి అలరించారు. 2021 నుంచి ఆమె ఈ మెట్ గలా ష్యాషన్‌లో పాల్గొంటున్నారు. 180 క్యారెట్ల డైమండ్ నెక్లస్ వేసుకొని అందరినీ ఆకట్టుకుంటున్నారు.
అంబికా మోడ్
భారత సంతతికి చెందిన బ్రిటన్ నటి, కమెడియన్, రచయిత్రి అంబికా మోడ్ కూడా ఈ మెట్ గలా ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.
సిమోనె ఆష్లే
భారత మూలాలున్న బ్రిటీష్ నటి సిమోనె ఆష్లే కూడా ఈ మెట్ గలాలో కనువిందు చేశారు. సిమోనె అసలు పేరు సిమొనె అశ్వని పిల్లై. ఆమె తల్లిదండ్రులు తమిళులు. సెక్స్ ఎడ్యూకేషన్ సిరీస్‌లో ఆమె ప్రముఖ పాత్రను పోషించారు.



Click it and Unblock the Notifications