For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెనింజిటిస్ సమస్యకు సూచించగల గృహనివారణా చికిత్సా విధానాలు

|

మెనింజిటిస్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి, ఇది అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది. మరియు దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ వ్యాధితో వ్యవహరించడానికి ప్రతి ఒక్కరికీ ఈ సమస్య పట్ల అవగాహన కల్పించడం ముఖ్యం. ఇది కేవలం యుక్తవయసు మరియు వృద్దాప్య దశలలోనే కాకుండా, అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా ప్రభావితమవుతుందని కనుగొన్నారు.

అసలు ఈ మెనింజిటిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ...

మెనింజిటిస్ సమస్యకు సూచించగల గృహనివారణా చికిత్సా విధానాలు

మెనింజిటిస్ అనేది మెదడు మరియు వెన్నెముక యొక్క బాహ్య ఉపరితల ప్రాంతంలో తలెత్తే సంక్రమణగా చెప్పబడుతుంది. అనేక రకాల వైరస్లు, శిలీంధ్రాలు, కొన్ని పరాన్నజీవులు మరియు బాక్టీరియా ఈ వ్యాధికి దారితీయవచ్చు.

మెనింజిటిస్ వర్గీకరణ :

మెనింజిటిస్ వర్గీకరణ :

వాస్తవానికి ఇది ప్రధానంగా రెండురకాలుగా ఉంటుంది. 1) వైరల్ మెనింజిటిస్ 2) బాక్టీరియా మెనింజిటిస్. సాధారణంగా వైరల్ మెనింజిటిస్ రోగ నిరోధక శక్తి బాగా ఉన్న వారికి 2 వారాలలోపునే తగ్గిపోతుంది. మరియు దీనిపట్ల అంతగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. కానీ బ్యాక్టీరియా ద్వారా ప్రభావితమైన మెనింజిటిస్ మాత్రం ప్రాణాంతకంగా మారి, అంగవైకల్యం లేదా మరణానికి కూడా దారితీస్తుంది. మెనింగోకోక్కల్, నుమోకోక్కల్, క్షయ, గ్రూప్ B స్ట్రెప్టోకోక్కల్ మరియు ఈ-కోలి వంటివి., బాక్టీరియా రకానికి చెందిన మెనింజిటిస్ వ్యాధులుగా చెప్పబడుతాయి.

 మెనింజిటిస్ లక్షణాలు :

మెనింజిటిస్ లక్షణాలు :

మెనింజిటిస్ ప్రధాన లక్షణాలుగా, అధిక జ్వరం, వాంతులు, కండరాల నొప్పి, వికారం, దద్దుర్లు మరియు చేతులు మరియు పాదాలు చల్లబడడం మొదలైనవి ఉంటాయి. శిశువుల్లో గమనించాల్సిన లక్షణాలుగా ఎరుపు లేదా ఊదా రంగులో మచ్చలు ఏర్పడడం, చర్మం సున్నితంగా మారడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, తినడానికి లేదా తాగడానికి నిరాకరించడం, ఎక్కువ సమయం ఏడుస్తూ గడపడం, అధిక ఉష్ణోగ్రతలకు లోనవ్వడం, నిద్రపోతే అంత సులభంగా నిద్రలేయకపోవడం మొదలైనవి ఉంటాయి.

యుక్త వయసు పిల్లల్లో లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉన్నా, కొన్ని అదనపు లక్షణాలు కూడా ఉంటాయి. మెనింజిటిస్ సమస్యతో బాధపడే పిల్లలలో తీవ్రమైన వణుకు, అధిక ఉష్ణోగ్రతలు, తలనొప్పి, నిద్రమత్తు, చికాకు, గందరగోళం, మెడలో నొప్పి, కీళ్లలో నొప్పి, మెడ గట్టిపడడం, శరీరంపై ఊదా లేదా ఎర్రటి మచ్చలు ఏర్పడడం, వేగంగా శ్వాస తీసుకోవడం,అర చేతులు మరియు పాదాలు చల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

మెనింజిటిస్ నిర్ధారణ మరియు చికిత్సా విధానం :

మెనింజిటిస్ నిర్ధారణ మరియు చికిత్సా విధానం :

మెనింజిటిస్ సమస్యను నిర్ధారించిన తర్వాత, తక్షణమే చికిత్సకు ఉపక్రమించవలసి ఉంటుంది. ఈ వ్యాధిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు మరియు సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోవాలి లేదా అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. శిశువుల రోగనిరోధక వ్యవస్థ అంత బలంగా లేని కారణంగా, వారి సంకేతాలు మరియు లక్షణాల పట్ల అధిక శ్రద్దవహించవలసి ఉంటుంది. మెనింజిటిస్ అనేది రక్తపరీక్షల ద్వారా నిర్దారించడం జరుగుతుంది. క్రమంగా సెడెటివ్స్, ద్రవాలు, యాంటీ బయాటిక్స్, పారాసెటమాల్ టాబ్లెట్స్, ఆక్సిజన్ థెరపీ, యాంటీ కన్వల్సెంట్లు మరియు స్టెరాయిడ్ల సహాయంతో చికిత్స చేయడం జరుగుతుంది.. లక్షణాలు తీవ్రంగా ఉన్న ఎడల, రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బదిలీచేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

 మెనింజిటిస్ సమస్యకు సూచించదగిన గృహవైద్య చిట్కాలు :

మెనింజిటిస్ సమస్యకు సూచించదగిన గృహవైద్య చిట్కాలు :

మెనింజిటిస్ సమస్యకు సూచించదగిన గృహ వైద్య చిట్కాలు గురించిన సమగ్ర వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి. వెల్లుల్లి :

వెల్లుల్లి మెనింజిటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి అత్యంత లాభదాయకమైన గృహ వైద్య చిట్కాగా ఉంటుంది. దీనికి కారణం, ఇందులో అలిసిన్ వంటి వివిధ రకాల సేంద్రీయ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ వలె పనిచేస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లి యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను అత్యుత్తమ స్థాయిలో కలిగి ఉంటుంది. కావున తరచుగా ఆహార ప్రణాళికలో వెల్లుల్లిని జోడించుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

 ఆలివ్ ఆకు సారం :

ఆలివ్ ఆకు సారం :

మెనింజిటిస్ చికిత్సకు గృహ వైద్యాన్ని అనుసరించదలచినట్లైతే, మీరు ఆలివ్ ఆకు సారాన్ని కూడా వినియోగించవచ్చు. ఇది యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మెనింజిటిస్ నివారణకు సహాయపడేలా, శోథ వ్యతిరేక సామర్ధ్యాలను సైతం కలిగి ఉంటుంది.

క్లోరెల్లా :

క్లోరెల్లా :

మెనింజిటిస్ సమస్య చికిత్సలో భాగంగా, గృహ నివారణలలో సూచించదగిన ఉత్తమ మూలికలల్లో క్లోరెల్లా కూడా ఒకటి. ఇది ఒక చిన్న మొక్క రకానికి చెందినదిగా ఉంటుంది. దీనిలోని అధిక క్లోరోఫిల్ నిక్షేపాల కారణంగా, దీన్ని అత్యుత్తమ నివారణిగా సూచించబడుతుంది. క్లోరోఫిల్ హీమోగ్లోబిన్ నిర్మాణంతో సమానంగా సరితూగేలా ఉంటుంది. మరియు ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి దోహదపడుతుంది, ఇది ఆక్సిజనేషన్ పెంపొందిస్తుంది, మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. క్రమంగా మెనింజిటిస్ నుంచి నష్టాన్ని రికవరీ చేయడానికి మరియు క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది.

బెడ్ రెస్ట్ :

బెడ్ రెస్ట్ :

ఇది ఒక స్పష్టమైన సలహా వలె అనిపించినా, మెనింజిటిస్ వలన నిరోధక వ్యవస్థ కొద్దిగా రాజీ పడడం మూలంగా, అలసట గురైనప్పుడు వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రమంగా మొత్తం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేస్తుంది. అందువల్ల, ఈ సమస్యకు గురైనవారు, సౌకర్యవంతంగా, పుస్తకాలు లేదా మూవీలపై దృష్టి సారించి, వీలైనంతవరకు బెడ్ రెస్ట్ తీసుకునేలా ఉండాల్సి ఉంటుంది.

 కోల్డ్ ప్యాక్స్ :

కోల్డ్ ప్యాక్స్ :

మెనింజిటిస్ వలన కలిగే జ్వర౦ అత్యంత తీవ్ర౦గా ఉ౦టు౦ది. దీనివలన చికిత్స, మరియు రికవరీ కూడా కష్టతరంగా ఉ౦టు౦ది. జ్వరం కారణంగా మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి, సంక్రమణ కారక బాక్టీరియాతో పోరాడుతున్న కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. క్రమంగా ఈ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకొని ప్రాణాంతకం కావొచ్చు. కావున జ్వరాన్ని అదుపులో ఉంచేందుకు, ఐస్ ప్యాక్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం కూడా మంచిదిగా సూచించబడుతుంది. క్రమంగా మంట మరియు ఇన్ఫ్లమేషన్ వ్యతిరేకంగా మీ రోగనిరోధక వ్యవస్థ మరింతగా పోరాడే అవకాశం ఉంటుంది.

స్నానం :

స్నానం :

ఇది కూడా ఒక సూచనే అయినప్పటికీ, మీరు ఒక తటస్థ ఉష్ణోగ్రత వద్ద స్నానం చేసినప్పుడు, మీ రక్తం తదనుగుణంగా స్పందిస్తుంది మరియు మీ శరీరం అంతటా సరైన రీతిలో పునఃపంపిణీ చేస్తుంది. తద్వారా మెదడు మరియు వెన్నుముకలో మంట మరియు అసౌకర్యం తొలగి సడలింపుకు కారణమవుతుంది. క్రమంగా కొన్ని లక్షణాలను సమర్థవంతంగా చికిత్స చేసేందుకు సహాయపడుతుంది.

జిన్సెంగ్ :

జిన్సెంగ్ :

జిన్సెంగ్లో ఉండే చురుకైన పదార్ధం జిన్సెనోసైడ్ సంక్రమణను తగ్గించడానికి, మెనింజిటిస్ యొక్క రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి, మరియు ప్రభావితమైన పొరలపై నేరుగా పనిచేసి చికిత్సను వేగవంతం చేయడానికి చక్కగా పనిచేస్తుందని విశ్వసించడమైనది. దీని ప్రయోజనాలను అధికంగా పొందేందుకు, దీనిని టీ రూపంలో తీసుకోవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Read more about: home remedies
English summary

Home Remedies for Meningitis

Some of the common symptoms of meningitis are fever, sever headache, pain in the next etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more