Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
బొద్దుగా ఉండేది సినిమా హీరోయిన్ లా మారింది..ఇలా చేస్తే ఈజీగా 25 కేజీల బరువు తగ్గొచ్చు!
మనదేశంలో ఊబకాయం ప్రస్తుతం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీ కూడా ఊబకాయం గురించి ప్రస్తావించారు. ప్రజలు తమ ఆహారాల్లో వంటనూనె వాడకాన్ని తగ్గించుకోవాలి, మెరుగైన జీవనశైలిని అలవర్చుకోవాలని తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టాలని ప్రధాని మోదీ అనేక కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇక బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సూచనలు చేస్తుంటారు..కొందరు ఫుడ్ తగ్గించుకోవడమే దీనికి పరిష్కారం అని మరికొందరు తింటూనే బరువు తగ్గడం ఎలా అనే దానిపై సూచనలు చేస్తుంటారు.
సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సాక్షియాదవ్ తరుచుగా ఫిట్ నెస్, వెయిట్ లాస్ కి సంబంధించిన వీడియోలు తన ఇన్ ప్ట్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తుంటది. సాధారణంగా మనం బరువు పెరగాలనుకున్నా లేదా బరువు తగ్గాలన్నా కూడా పొద్దున్నే మనం ఏం తింటున్నాం అనే దానిమీదనే ఆధారపడి ఉంటుందని తరుచుగా డాక్టర్లు,నిపుణులు చెబుతుంటారు. సాక్షి యాదవ్ కూడా ఇదే విషయాన్ని చెబుతూనే సాధారణంగానే బరువును తగ్గించుకునే కొన్ని బెస్ట్ టిప్స్ ని పంచుకుంది. ఒకప్పుడు తాను చాలా బరువుతో ఉండేదాన్ని అని ఇప్పుడు ఆమె ఎలా మారిపోయిందనేది తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ వీడియోలో నెటిజన్లతో షేర్ చేసుకుంది. కేవలం 6 నెలల్లోనే 25 కేజీల వరకు నేచురల్ గా తగ్గినట్లు సాక్షి యాదవ్ తెలిపింది. తన వెయిట్ లాస్ జర్నీ సమయంలో తాను తిన్న ఫుడ్ గురించి సాక్షి యాదవ్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

సాక్షి యాదవ్ 6 నెలల్లో 25 కేజీల బరువు తగ్గి తనడైట్ ఫ్లాన్ లో కొంత భాగాన్ని ఇన్ స్టా వీడియో ద్వారా తెలిపింది. సాక్షి యాదవ్ పొద్దున్నే న్యూడిల్స్,ఇడ్లీ,దోశ, బోండా,పూరీ వంటివి కాకుండా.. డ్రై ఫ్రూట్స్ తినేది. ఉదయాన్నే కూరగాయల జ్యూస్ లు తాగుతానని.. ప్యాకెట్లలోని జ్యూస్ కు బదులుగా బీట్ రూస్ జ్యూస్ తాగేదానన్ని తెలిపింది. ఇక బ్రెడ్ కు బదులుగా పనీర్ తో హోలం వీట్ బ్రెడ్ ను తిన్నట్లు చెప్పింది.
బరువు తగ్గడానికి మధ్యాహ్నా భోజనం చాలా ముఖ్యం, అయితే లంచ్ చేయకపోతే బరువు తగ్గొచ్చని చాలామంది లంచ్ చేయరు, అయితే ఇది పెద్ద తప్పు. మధ్యాహ్నాం భోజనంలోకి పప్పు,రైస్, పెరుగు తిన్నట్లు వీడియోలో సాక్షి యాదవ్ తెలిపింది. బరువు తగ్గడానికి రాత్రిపూట అధికంగా తినడం మానుకోవాలి. నిపుణులందరూ రాత్రిపూట లైట్ పుడ్ తినాలని సూచిస్తుంటారు..సాక్షి యాదవ్ కూడా ఈ నియమం పాటిస్తుంది.
కాగా, డైట్ టిప్స్ తో పాటు తొడ కొవ్వును ఎలా కరిగించాలి, చేయి కొవ్వు ఎలా కరిగించాలి, మరికొన్ని రకాల కొవ్వులను తగ్గించడానికి సాయపడే వ్యాయామ దినచర్యలను కూడా సాక్షి తన వీడియోల్లో చెబుతుంది. అయితే ఈ సాధారణ సమాచారం నిపుణుల సలహాలకు ప్రత్యామ్నాయం కాదని కూడా ఆమె చెప్పింది. ఒక వ్యక్తి బరువు తగ్గించే విధానం మరొకరికి ఉత్తమ దినచర్య కాకపోవచ్చన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
