మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉందో లేదో..ఇలా తెలుసుకోండి

ఈ మధ్య కాలంలో చాలామంది అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నట్లు ఉండి సడెన్ గా కుప్పకూలిపోవడం, హాస్పిటల్ కి తీసుకెళ్తే వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడం చూస్తున్నాం. అయితే బ్రెయిన్ స్ట్రోక్ అనే పేరు వింటేన వామ్మో అని చాలామంది భయపడుతున్నారు. తమకు కూడా భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వస్తదేమో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ టెస్టులు చేయించుకోవాలి? ముందుగానే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పుని గుర్తించడం ఎలా? అని రకరకాల సందేహాలతో సతమతమవుతున్నారు.

ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బండారు హారతి తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో కొన్ని టెస్టులను సూచించారు. ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా 80 శాతం మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఆ టెస్టులు ఏంటో ఇక్కడ చూడండి.

Neurologist advice 5 essential medical tests to prevent brain stroke

బీపీని తరచూ చెక్ చేయించుకోవాలి

హై బీపీ..ఇదొక సైలెంట్ కిల్లర్. అందుకే తరచుగా మీ బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ బీపీ 130/80 ఉండేలా చూసుకోవాలి. ఇంతకన్నా కొంచెం తక్కవ ఉండేలా చూసుకోవడం ఇంకా మంచిది.

కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి

కొలెస్ట్రాల్ లెవల్స్ తెలుసుకోడానికి ఫాస్టింగ్ లిపిడ్ ప్యానల్ అనే రక్త పరీక్ష చేసుకోండి. దీనిని లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ టెస్ట్ మీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అలాగే, గుండె జబ్బేలు,స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ టెస్టులో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL కొలెస్ట్రాల్ 70 కన్నా తక్కువ ఉంటే మీరు బాగా మెయింటెన్ చేస్తున్నట్లు.

షుగర్ లెవల్స్ ని కంట్రోల్ లో

అతి ముఖ్యమైనది డయాబెటిస్..ఇది బ్రెయిన్ లో ఉన్న రక్త నాళాలను డ్యామేజ్ చేస్తుంది. అందుకే మీ హీమోగ్లోబిన్ లెవల్స్(HBA1C) 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. 6.5 ఉంటే ఇంకా మంచిదని డాక్టర్ హారతి చెబుతున్నారు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే..కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే..

EGG లేదా EKG(ఎలక్ట్రో కార్డియోగ్రామ్)

చాలామందికి క్రమరాహిత్య హార్ట్ బీట్,(irregular hart beat) గుండె దడలా వచ్చినప్పుడు తప్పనిసరిగా EKG చెక్ చేయించుకోవాలి.ఈ క్రమరాహిత్య హార్ట్ బీట్ ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్(atrial fibrilation)అంటారు. ఇది బ్రెయిన్ నుంచి గుండెకు క్లాట్స్ ని విసిరేస్తుంది. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అందుకనే ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి.

నిద్రలో గురక రాకుండా చూసుకోవాలి

ఎక్కువగా గురకపెట్టినా, అధిక బరువు ఉండి గురకపెడుతున్నప్పుడు ఖచ్చితంగా స్లీప్ స్టడీ చేయాలి. దీనిని కరెక్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు స్ట్రోక్స్ రాకుండా కాపాడుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, October 27, 2026, 9:17 [IST]
Desktop Bottom Promotion