Latest Updates
-
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!
మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోండిలా!
మన శరీరంలో అత్యంత కీలకమైన, విశ్రాంతి లేకుండా పనిచేసే అవయవం కాలేయం(లివర్). ఇది మన శరీరానికి ఒక పవర్‌హౌస్ లాంటిది. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడం, పోషకాలను గ్రహించడం నుంచి.. రక్తంలోని విషపదార్థాలను బయటకు పంపే వరకు ఇది దాదాపు 500 రకాల పనులను ఒంటరిగా చేస్తుందట.

సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీరిలో సగానికి పైగా మంది అసలు మద్యం ముట్టని వారే, దీనికి ప్రధాన కారణం..మనం రోజూ తీసుకునే అదనపు చక్కెర, చెడు జీవనశైలి. కాలేయానికి కొవ్వు అతిపెద్ద శత్రువు. ఇది పెరిగితే లివర్ పనితీరు మందగించి, క్రమంగా దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపించదు. కానీ కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం, ముదురు రంగు మూత్రం, కడుపు లేదా కాళ్లలో వాపు, చర్మంపై దురద, నల్లటి మలం, విపరీతమైన అలసట వంటివి కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.
ఏటా చేయించుకోవాల్సిన 5 ముఖ్యమైన పరీక్షలు
లివర్ ఆరోగ్యాన్ని ముందే పసిగట్టేందుకు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే 5 టెస్టులను వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT): ఇది కాలేయ పనితీరును అంచనా వేస్తుంది.
కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC): శరీరంలోని ప్లేట్‌లెట్స్, మొత్తం ఆరోగ్యాన్ని చెబుతుంది.
హెపటైటిస్ బి, సి: నీరసం, ఆకలి లేమి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ పరీక్ష తప్పనిసరి.
అబ్డామినల్ అల్ట్రాసౌండ్: కడుపు నొప్పి ఉన్నప్పుడు లివర్ నిర్మాణాన్ని స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుంది.
బయోకెమికల్ ప్యానెల్: లివర్ సంబంధిత లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేస్తారు.
ఈ అలవాట్లు మానుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి
నీళ్లు తక్కువగా తాగడం, కూర్చునే పనిచేయడం, జంక్ ఫుడ్స్ తినడం, నిద్రలేమి, పొగతాగడం, మద్యపానం, అలాగే డాక్టర్ సలహా లేకుండా ఇష్టానుసారం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది.
వీటికి బదులుగా.. రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. ఇది కాలేయాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. నారింజ, క్యారెట్, పాలకూర లాంటి ఫైబర్ ఉన్న ఆహారంతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, వాల్ నట్స్ తీసుకోవాలి. వీటికి వ్యాయామం తోడైతే మీ లివర్ కు తిరుగుండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
