Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే 5 స్ట్రెచెస్
తామెటువంటి కండరాల నొప్పినీ ఎదుర్కోలేదని చెప్పేవాళ్ళు మనలో అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. మీలో కొందరు అసలు కండరాల నొప్పి అనేది ఎటువంటి ఇబ్బంది కలిగించదని, దీని వలన కలిగే నొప్పి నెగ్లిజబుల్ అని అతి తక్కువని భావించవచ్చు. వాస్తవమేంటంటే, కండరాల నొప్పి అనేది కాస్తంత అసౌకార్యాన్ని కలిగిస్తుంది.
అయితే, ఈ నొప్పి నుంచి ఉపశమనం లభించదని అనిపించడం నిస్సహాయతను గురిచేస్తుంది. నిజానికి, కండరాల నొప్పి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవాలని ఎవరూ కోరుకోరు. ఈ నొప్పి నుంచి వీలైనంత ఉపశమనాన్ని ఆశిస్తారు.

ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి వింటూ ఉన్నాము. వాటిలో, కండరాల నొప్పి కూడా చోటు సంపాదించింది. అయితే, మిగతా ఆరోగ్య సమస్యల లాగా డైట్ లో మార్పులూ చేర్పులతో కండరాల నొప్పిని తగ్గించుకోలేము. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ ను రోజులో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే, మజిల్ గ్రూప్స్ లోని ఇంబ్యాలెన్స్ తలెత్తడం వలన కండరాల నొప్పి సమస్య వేధిస్తుంది.
కొన్ని ప్రత్యేకమైన గ్రూప్ కి చెందిన మజిల్స్ మిగతా వాటికంటే దృఢంగా ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. అందువలన, బలహీనంగా ఉండే కండరాల నొప్పి మిమ్మల్ని బాధిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే బలహీనంగా ఉండే కండరాలను దృఢంగా మార్చుకోవాలి.
ఈ ఆర్టికల్ లో కండరాలను బలపరచుకోవడానికి మీరు పాటించవలసిన అయిదు స్ట్రెచెస్ గురించి వివరించాము. వీటిని పాటిస్తే కండరాల నొప్పి దరి చేరదు.
1. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచెస్:
ఈ స్ట్రెచెస్ ను చేయడం చాలా సులభం. దీన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు కూడా. మీరు చేయవలసిందల్లా మీ రెండు కాళ్ళను దూరంగా ఉంచుతూ నిటారుగా కూర్చోవాలి. మంచి బెడ్ పైన ఈ ఆసనాన్ని వేయండి. లేదంటే, ఫ్లోర్ మీద కూడా ఈ ఆసనాన్ని వేయవచ్చు.
మీ వెన్ను నిటారుగా ఉండాలి. ముందుకు వంగాలి. ఈ పద్దతిని పాటిస్తూ మీరు మీ కాలి వేళ్ళను తాకడానికి ప్రయత్నించాలి.
ప్రారంభదశలో మీరు కొంచెం అసౌకర్యానికి గురికావచ్చు. ప్రారంభదశలోనే కాలివేళ్ళను తాకడానికి ప్రయత్నిస్తూ ఒత్తికి పెట్టకుండా ఎంతవరకు మీరు చేయగలిగితే అంతవరకే ప్రాధాన్యతనివ్వండి. రాను రాను ఈ స్ట్రెచ్ ను మీరు పెర్ఫెక్ట్ గా చేసే వీలుంటుంది. ఈ స్ట్రెచింగ్ ను సీటెడ్ కాఫ్ స్ట్రెచింగ్ అనంటారు. మజిల్ క్రామ్ప్స్ ని తగ్గించేందుకు ఉపయోగపడే అద్భుతమైన స్ట్రెచింగ్ ఇది.
2. హ్యాంస్ట్రింగ్ స్టాండింగ్ స్ట్రెచెస్:
ఇది ఇంతకు ముందు ప్రస్తావించుకున్న స్ట్రెచ్ కి సిమిలర్ గానే ఉంటుంది. అయితే, ఈ స్ట్రెచ్ కోసం మీకు కొన్ని ప్రాప్స్ కావాలి. ఒక ఛైర్ ని తీసుకుని గోడకి ఎదురుగా ఉంచండి. చైర్ లేనప్పుడు ఏదైనా బెడ్ ని గాని మరేదైనా అటువంటి ప్రోడక్ట్ ని వాడండి. ఇప్పుడు చైర్ కి ఎదురుగా నిల్చుని మీ కుడి మడమను చైర్ మీద పెట్టండి.
మీ కుడి కాలు స్ట్రెయిట్ గా ఉండాలి. మీ అప్పర్ బాడీ స్ట్రెయిట్ గా ఉండాలి. మీ ఎడమ కాలు ఫ్లోర్ పై ఉండాలి. హిప్స్ వద్ద బాడీని కొంచెం బెండ్ చేయండి. రెండు కాళ్ళకి ఈ ప్రాసెస్ ను రిపీట్ చేయండి. ఇలా కంటిన్యూయస్ గా 10 నుంచి 15 స్ట్రెచెస్ ని చేయండి.
3. లంగ్ స్ట్రెచెస్:
రెండు కాళ్లను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలుచోండి. ఇప్పుడు, ముందుకు ఒక పెద్ద అడుగును వేయండి. కాళ్ళ మధ్య దూరం ఎంత సాధ్యమవుతుందో అంత అడుగు వేయండి. ఇప్పుడు లంగ్ భంగిమ కోసం ఒక మోకాలును బెండ్ చేయండి. మరొక లెగ్ ను స్ట్రెయిట్ గా ఉంచండి. కాలివేళ్ళను నేలపై ఆనించి ఉంచాలి.
ఇప్పుడు రెండు చేతులను భూమిపైనా ఆనించి ఉంచండి. ఇప్పుడు అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు భుజాలు సీలింగ్ వైపు స్ట్రెచ్ అయ్యేలా చూడండి. ఈ స్ట్రెచ్ ని పది సార్లు వరసగా చేయాలి. ఆల్టర్నేట్ సైడ్స్ ను ఉపయోగిస్తూ ఉండాలి.
4. స్టాండింగ్ కాఫ్ స్ట్రెచ్:
గోడకి ఎదురుగా నిల్చుని గోడపై అరచేతులను ఉంచండి. ఈ స్ట్రెచ్ ని చేసేటప్పుడు చేతులు ఎంత వీలయితే అంత స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు మోకాలిని వంచండి. మీ కుడి కాలును ముందుకు తీసుకురండి. ఈ దశలో లెఫ్ట్ లెగ్ అనేది వెనుకవైపుకు స్ట్రెచ్ అవ్వాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రెయిట్ గా ఉండాలి.
ఇప్పుడు మీరు ముందుకు లీన్ అవ్వాలి. లీన్ అవుతున్నప్పుడు మీ రైట్ లెగ్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఒక గోడను పుష్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఈ పోసిషన్ లో 30 నుంచి 40 సెకండ్ల పాటు ఉండాలి. తిరిగి నిటారుగా నిల్చున్న పోశ్చర్ లోకి మారాలి. ఈ యాక్టివిటీను మూడు లేదా అయిదు సార్లు పాటించాలి. వారానికి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు పాటించాలి.
5. 90/90 స్ట్రెచ్
ఈ టైప్ ఆఫ్ స్ట్రెచ్ అనేది ఎంతో ఉపయోగకరం. 90 డిగ్రీల కోణంలో కుడి కాలు బెండ్ అవ్వాలి. మడమ కండరాలు శరీరానికి పెర్పెండిక్యూలర్ గా ఉండాలి. ఎడమ కాలు ఫ్లోర్ పై రెస్ట్ అవ్వాలి. కుడి పాదం ఫ్లెక్స్డ్ గా ఉండాలి. పోశ్చర్ లో చూపించిన విధంగా, ఎడమ మోకాలు శరీరానికి ఎడమవైపుగా కదలాలి. ఆ తరువాత పాదాలు మీ వెనుకగా వచ్చే విధంగా ఉండాలి.
ఈ దశలో రెండు కాళ్ళు ఫ్లెక్స్డ్ గా ఉండాలి. ఈ పొజిషన్ తో మీరు సౌకర్యవంతంగా ఫీల్ అయ్యాక, కుడి రైట్ బట్ ని ఫ్లోర్ పై ఫేస్ చేయాలి. ఈ స్ట్రెచెస్ అన్నీ కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించేందుకు తోడ్పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











