Latest Updates
-
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.?
మీరు వాడుతున్న మేకప్ సురక్షితమైనదేనా.?.. హానికరమైన కిట్స్‌ను ఇలా గుర్తించండి.!
కొందరు మేకప్ లేకుండా బయటకు వెళ్లలేరు. ఇందుకోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు వాడుతున్న మేకప్ సురక్షితమేనా.. కొన్ని మేకప్ కిట్స్ మీ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తాయి. వీటిని ఎలా గుర్తించాలి.? హానికరమైన మేకప్‌లకి ఎలా దూరంగా ఉండాలి… ఇక్కడ తెలుసుకుందాం..

మేకప్ కేవలం అందానికి సిగ్నేచర్‌గా మాత్రమే కాకుండా.. స్టైల్‌కి స్టేట్‌మెంట్‌గా మారింది. అయితే ఇందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ని కొనుగోలు చేసేముందు వాటిలో ఉపయోగించే పదార్థాల గురించి ఆలోచించరు. ఈ క్రమంలో ధర తక్కువ, నాణ్యత తక్కువ ఉన్న మేకప్ కిట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఉత్పత్తుల్లో కొన్ని రసాయనాల కారణంగా.. చర్మానికి, కళ్లకు హాని కలుగజేస్తాయి. వీటిలో విషపూరిత పదార్థాలను ఉపయోగించడం వల్లే ఇది జరుగుతుందని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో హానికరమైన మేకప్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
ప్రొడక్ట్ వివరాలు
మేకప్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు అవి ఎలాంటివో ముందుగా గుర్తించాలి. ప్రొడక్ట్ ప్యాక్‌పై ఉన్న పదార్థాల వివరాలను తప్పకుండా చదవాలి. ఇందులో ఫార్మాల్టిహైడ్ విడుదల చేసే పదార్థాలు, పారాబెన్‌లు, సీసం, పాదరసం వంటివి ఉంటే వాటిని కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
సువాసన ఎక్కువగా వస్తుందా
మీరు కొనుగోలు చేసిన మేకప్ కిట్ వాసన చాలా ఘాటుగా ఉన్నట్లయితే అలాంటి వాటిని కొనకపోవడం మంచిది. ఇందులో అధికంగా రసాయనాలను వినియోగించడం వల్ల సువాసన అధికంగా వెదజల్లుతుంది. ఈ కృత్రిమ సువాసనలు, ఇందులోని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి.
గడువు తేదీ
మేకప్ కిట్స్, ఇతర సౌందర్య సాధనాలను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా గడువు తేదీని తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తేదీ ముగిసిన పాత మేకప్ ఉత్పత్తులను కొనడం మంచిది కాదు. ఇందులో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. వీటిని ఉపయోగించడం ద్వారా స్కిన్ ఇన్‌ఫెక్షన్లకి దారితీయవచ్చు.

ప్యాకేజింగ్ ఎలా ఉంది
మేకప్ కిట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్‌ని కొనుగోలు చేసే ముందు వాటి ప్యాకేజింగ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. సీలింగ్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి. చిరిగినట్లుగా, లీకైనట్లుగా ఉంటే కొనకూడదు. ప్యాకేజ్ ఉత్పత్తిపై తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, పదార్థాల వివరాలు సరిచూసుకోవాలి. ఈ వివరాలు లేకపోతే, వాటిని కొనుగోలు చేయకూడదు. లేదంటే అవి మీ చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.
ధర సరిచూసుకోండి..
మేకప్ కిట్స్ కొనుగోలు చేసే ముందు ధర తప్పనిసరిగా చూసుకోవాలి. అతి తక్కువ ధరలకు లభించే మేకప్ ఉత్పత్తులు నకిలి అయ్యే అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ బ్రాండెడ్ మేకప్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని.. కొనేముందు వాటిని కూడా తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ధర తక్కువ ఉత్పత్తుల్లో ఘాటైన రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇవి చర్మానికి, ముఖానికి హాని కలిగించి ఇన్‌ఫెక్షన్లకి, దురదకి దారితీస్తుంది. కాబట్టి మేకప్ ఉత్పత్తులు కొనుగోలు చేసేముందు తప్పనిసరిగా అన్ని వివరాలు సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications