Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
FSSAI సంచలన నిర్ణయం..ORS బ్యాన్!..పోరాడి గెలిచిన హైదరాబాద్ డాక్టర్
ప్రస్తుతం మనకు మార్కెట్ లో ఓఆర్ఎస్(ORS)పేరుతో రకరకాల కంపెనీల ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా నీరసంగా అనిపించినప్పుడు లేదా డీహైడ్రేషన్ కు గురైన సమయంలో ఓఆర్ఎస్ తాగితే ఎనర్జీ వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఓఆర్ఎస్ ల కారణంగా నీరసం తగ్గడం అటు ఉంచి ఉన్న ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అన్నీ ఓఆర్ఎస్ లు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతూ భారత ఆహార భద్రత,ప్రమాణాల ప్రాధికార సంస్థ (fssai)కీలక నిర్ణయం తీసుకుంది.
అధిక చక్కెర ఉన్న పానీయాలను ప్రాణాలను రక్షించే ORSగా తప్పుదారి పట్టించి అమ్ముతున్న కంపెనీలపై fssai ఉక్కుపాదం మోపింది. ఇక మీదట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణం లేనటువంటి ఏ పానీయం మీద అయినా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్(ORS) అనే పదాన్ని లేదా దాని సంక్షిప్తీకరణను(ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించి,క్లుప్తంగా చెప్పడం)ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ FSSAI నిర్ణయం తీసుకుంది.

ఒక డాక్టర్ అలుపెరుగని పోరాటం
ORS విషయంలో FSSAI నిర్ణయం వెనుక హైదరాబాద్ కు చెందిన పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్ పాత్ర చాలా కీలకమైనది. మార్కెట్లో ORS పేరుతో అమ్ముతున్న అనేక పండ్ల రసాలు, ఎలక్ట్రోలైట్ పానీయాలు వాస్తవానికి చక్కెర నిండిన డ్రింక్స్ అని, అవి ప్రాణాలను కాపాడటం మాట అటుంచి, అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని వాదిస్తూ డాక్టర్ శివరంజని దాదాపు దశాబ్ద కాలం పాటు అవిశ్రాంత పోరాటం సాగించారు. ముఖ్యంగా విరేచనాలతో బాధపడే పిల్లలకు, షుగర్ పేషెంట్లకు ఇవి చాలా డేంజరస్ అని ఆమె హెచ్చరించారు. ఈ మోసపూరిత మార్కెటింగ్ కు వ్యతిరేకంగా డాక్టర్ శివరంజని 2022 లో తెలంగాణ హైకోర్టులో ఓ పిల్(PIL)కూడా ఫైల్ చేశారు. దీంతో FSSAI కదిలింది. గతంలో కొన్ని కంపెనీలు ట్రేడ్ మార్క్ సమస్యలను సాకుగా చూపి ఇది WHO ఫార్ములా కాదు అని చిన్న డిస్క్లైమర్(హెచ్చరిక) పెట్టి ORS పేరును వాడుకోవడానికి పొందిన అనుమతులను FSSAI ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది.
ORS అంటే ఏంటిది? నకిలీలు ఎందుకు డేంజర్?
WHO ప్రకారం..ORS అనేది కేవలం ఒక పానీయం కాదు, అది ఒక సైంటిఫిక్ ఫార్ములా. డీహైడ్రేషన్ (dehydration) ఎదుర్కోవడానికి నీటిలో కరిగించిన ఉప్పు, చక్కెరల ఖచ్చితమైన మిశ్రమం. WHO ఫార్ములా ప్రకారం.. ఒక లీటరు ORSలో 13.5 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర), దాని ఆస్మోలారిటీ 245 mOsm/L మాత్రమే ఉండాలి. కానీ మార్కెట్లో ORS పేరుతో అమ్ముడవుతున్న అనేక పానీయాలలో WHO నిర్దేశించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటోంది. ఈ అదనపు చక్కెర ప్రేగుల్లోకి నీటిని లాగి, విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
స్పందించిన డాక్డర్ శివరంజని
FSSAI విజయంపై డాక్టర్ శివరంజని సంతోషం వ్యక్తం చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో..మేము గెలిచాం, ఇది ఎనిమిదేళ్ల పోరాటం, లెక్కలేనన్ని గంటల ప్రజా సమీకరణ ఫలితం. ఇది తల్లిదండ్రులు, డాక్టర్లు, న్యాయవాదులు, వేలాది మంది ప్రజల సమిష్టి విజయం అని అన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
