Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
తిండి మానేస్తే కాదు..రాత్రిపూట ఇది చేస్తే బరువు ఈజీగా తగ్గొచ్చు!
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా చాలా ముఖ్యం. లేకుంటే తొందరగా అనారోగ్యాల బారిన పడి జీవితాన్ని మధ్యలోనే ముగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఆరోగ్యానికి మేలు చేసు విధానాలను పాటించడం తప్పనిసరి. సూర్య నమస్కారాల గురించి మనలో చాలామంది విని ఉంటారు కానీ చంద్ర నమస్కారాల గురించి అసలు విని ఉండరు. చాలా తక్కువమందికి మాత్రమే చంద్రనమస్కారాల గురించి తెలుసుని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
సూర్య నమస్కారాల వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలున్నట్లుగానే.. చంద్ర నమస్కరాల వల్ల కూడా మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. సూర్య నమస్కారాలు శరీరానికి శక్తినిస్తే, చంద్ర నమస్కారాలు చల్లదనాన్ని,ప్రశాంతతను ఇస్తుంది. చంద్ర నమస్కారం అంటే అనేక యోగాసనాల క్రమం. ఇది సూర్య నమస్కార్ లాంటిదే కానీ దీనిలో ఆసనాలు ఒకదాని తర్వాత మరొకటి నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కో భంగిమలో ఎక్కువసేపు నిలబడకుండా శ్వాసతో అనుసంధానంగా కదులుతూ ఉంటారు. దీనిని 'మూన్ సెల్యూటేషన్' అని కూడా అంటారు. చంద్ర నమస్కారం చేయడం వల్ల వెన్నెముక, కాళ్ల వెనుక భాగాలు, చేయి, వీపు, కడుపు కండరాలను బలపరుస్తుంది.

చంద్ర నమస్కారాలను ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి చంద్రుడు కనిపించే సమయంలో చేయాలి. అయితే చంద్ర సమస్కారాలు చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండాలి. భోజనం చేసిన తర్వాత కనీసం మూడు గంటలైనా ఆగాలి. రోజూ సాయంత్రం వేళ చంద్ర నమస్కారాలు చేస్తే బరువు కూడా తగ్గవచ్చంట. మీ దినచర్యలో చంద్ర నమస్కారాలను చేర్చుకోవాలనుకుంటే దాని వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఇక్కడ చూడండి
ప్రశాంతత, విశ్రాంతి
చంద్ర నమస్కారం చేయడం వల్ల శరీరం,మనస్సులో ఒక విధమైన సామరస్యాన్ని కలిగిస్తుంది. ఇది మనసుకు శాంతిని,విశ్రాంతిని అందిస్తుంది. దీనిలోని సున్నితమైన కదలికలు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి,ఆందోళన తగ్గుతాయి. అందుకే నిద్రపోయే ముందు చేయడానికి ఇది ఒక అద్భుతమైన సాధనంగా చెప్పవచ్చు. రోజంతా పోగొట్టుకున్న ప్రశాంతతను తిరిగి పొందడానికి ఇది చక్కటి మార్గం.
శరీర ఫ్లెక్సిబిలిటీను మెరుగుపరుస్తుంది
చంద్ర నమస్కారాలలో శరీరాన్ని బాగా సాగదీయడం జరుగుతుంది. ముఖ్యంగా తుంటి భాగాలు, వెన్నెముక, భుజాలు బాగా సాగుతాయి. క్రమం తప్పకుండా చంద్రాసనాలు చేయడం వల్ల శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజంతా పనిచేయడం వల్ల వచ్చే కండరాల బిగుతును తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది.
శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది
సూర్య నమస్కారాలు శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి..అదే సమయంలో చంద్ర నమస్కారాలు మనస్సును శాంతపరచడానికి, శరీరంలోని శక్తులను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. రాత్రిపూట ప్రాక్టీస్ చేయడానికి ఇది చాలా మంచిది. రోజంతా పేరుకుపోయిన మానసిక,శారీరక ఒత్తిడిని ఇది విడుదల చేస్తుంది. నిద్రకు ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఇది దోహదపడుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
చంద్రాసనాల క్రమం శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రోజంతా కదలకుండా ఉండటం వల్ల కాళ్లు, నడుము వంటి భాగాలలో నిలిచిపోయిన రక్తం మళ్లీ ప్రసరించేలా చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల అలసట తగ్గుతుంది. శారీరక అసౌకర్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం తేలికగా,హాయిగా అనిపిస్తుంది.
ఒత్తిడి, మానసిక ఆందోళనను తగ్గిస్తుంది
చంద్ర నమస్కారంలోని సున్నితమైన, ప్రవహించే కదలికలు శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాసతో ఒక లోతైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుందని, ప్రశాంతమైన స్థితిని కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రపోయే ముందు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
మీ రోజును చంద్ర నమస్కార్ తో ముగించడం వల్ల మీ శరీరం, మనస్సు నిద్రకు సిద్ధమవుతాయి. రోజంతా ఉన్న ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను శాంతపరచడం ద్వారా గాఢమైన, హాయిగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది ఒక మంచి పరిష్కారం. కాబట్టి మీరు ప్రశాంతమైన నిద్రను పొందాలనుకుంటే మీ శరీరాన్ని మరింత ఫ్లెక్సిబుల్ గా మార్చుకోవాలనుకుంటే, మీ మనసుకు విశ్రాంతినివ్వాలనుకుంటే ఈరోజే చంద్ర నమస్కారాలను మీ దినచర్యలో చేర్చుకోండి.
ఇది గుర్తుపెట్టుకోండి
-ఏదైనా అభ్యాసాన్ని ప్రారంభించే ముందు అర్హత కలిగిన యోగా శిక్షకుడి దగ్గర శిక్షణ తీసుకోవాలి.
-హైబీపీ, గుండె జబ్బులు, పక్షవాతం, వెన్నెముక సమస్యలు, నడుము నొప్పి, సయాటిక ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆసనాలకు దూరంగా ఉండటం మంచిది
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
