Latest Updates
-
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
మీ ముఖంపై వీటిని పొరపాటున కూడా పూయకండి.. లేదంటే మొటిమలతో చిరాకు తప్పదు.!
కొందరిలో ముఖం జిడ్డుగా ఉంటుంది. ఫేస్‌పై ఉండాల్సిన ఆయిల్ కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే చిరాకు కలిగిస్తుంది. అయితే ఈ జిడ్డును తొలగించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితంగా ఇది మొటిమలకి దారితీస్తుంది. ఈ క్రమంలో ఆయిల్ ఫేస్‌పై కొన్ని పదార్థాలను పూయకూడదని చర్మ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

వర్షాకాలంలో చర్మ సంరక్షణ చాలా కీలకం. ఈ సీజన్‌లో వాతావరణంలో వేడి, తేమ అధికంగా ఉంటుంది. ఫలితంగా ముఖంపై దుమ్ము, ధూళి కారణంగా చిరాకు కలుగుతుంటుంది. మొటిమలు ఏర్పడతాయి. చర్మం సైతం దెబ్బతింటుంది. జిడ్డు ముఖం ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ముఖ సంరక్షణ కోసం కొన్ని ఉత్పత్తులు వాడుతుంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో ఆయిల్ ఫేస్ ఉన్నవారు కొన్ని పదార్థాలను పూయకూడదు.
ఆయిల్ ఫేస్ ఉన్నవారు తరచుగా ముఖం కడుక్కోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ముఖం రఫ్‌గా మారుతుంది. రోజుకి రెండు సార్లు ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ లోషన్ వాడటం ద్వారా యూవీ కిరణాల నుంచి ముఖాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జిడ్డు ముఖం ఉన్నవారు తరచుగా ముఖాన్ని తాకకూడదు.. లేదంటే మొటిమలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.
జిడ్డు చర్మం సహజంగానే నూనెగా ఉంటుంది. అందుకే ఈ రకమైన చర్మం ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆయిల్ ఫేస్ ఉన్న వారి చర్మంలో సెబమ్ ఉత్పత్తిలో కలిగే అంతరాయం వల్ల ముక్కు, చెంపలపై జిడ్డు ఎక్కువగా ఏర్పడుతుంది. సెబేషియస్ గ్రంథి ఈ జిడ్డు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. చర్మ సంరక్షణ లోపం, పొట్ట సమస్యలు కూడా చర్మంపై అధిక జిడ్డుకు దారితీస్తాయి.
ఆ క్రీములను వాడొద్దు
అందుకే ఆయిల్ ఫేస్ ఉన్నవారు చిక్కటి క్రీములను వాడకూడదు. కోకో బటర్, షియా బటర్ వంటి క్రీములను పూయడం వల్ల చర్మంపై మందపాటి పొర ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం స్వేచ్ఛగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంది. తద్వారా రంధ్రాలు మూసుకుపోయి మొటిమలకు దారీతీసే ప్రమాదం ఉంది.

చర్మంపై నూనె
చర్మం ఎప్పుడూ తేమగా ఉండేందుకు కొబ్బరి నూనె లేదంటే ఇతర నూనెలను ఉపయోగిస్తారు. అయితే ఇప్పటికే ఉన్న జిడ్డు చర్మంపై ఈ నూనెను పూయడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆయిల్ స్కిన్‌పై నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు రావండం ప్రారంభమవుతాయి.
పెట్రోలియం జెల్లీ
జిడ్డు చర్మం ఉన్నవారికి పెట్రోలియం జెల్లీలు హాని చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి చర్మంపై సహజ తేమను అడ్డుకుంటాయి. జిగురును పెంచి మరింత ఆయిలీగా మారేలా చేస్తాయి. అందుకే వీటిని వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.
కఠినమైన స్క్రబ్‌లు
ఆయిల్ స్కిన్ ఉన్నవారు మార్క్‌ట్‌లో లభించే కఠినమైన స్క్రబ్‌లను వాడకపోవడం ఉత్తమం. లేదంటే ఇవి చర్మాన్ని మరింతగా దెబ్బతీస్తాయి. ఈ స్క్రబ్‌లు చర్మంపై నూనెను తగ్గించడంతో పాటు తొలగిస్తాయి. ఇది మంచి అనుభూతిని ఇచ్చినా.. మున్ముందు చికాకు, దురదను కలిగిస్తాయి. అందుకే వీటిని వాడటం మానుకోవాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
