Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుందా? సంచలన విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు
ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు తాగే నీరు కూడా చాలా చాలా ముఖ్యం. గతంలో అందరూ బావి నీళ్లు తాగేటోళ్లు..ఆ తర్వాత కుళాయిల ద్వారా వచ్చే నీటిని నేరుగా తాగేవాళ్లు. అయితే గ్రౌండ్ వాటర్ క్రమంగా కలుషితం అవుతుండటంతో అందరూ వాటర్ ని ఫిల్డర్ చేసుకొని తాగుతుంటారు. అయితే ఫిల్టర్ వాటర్ తాగితే డేంజర్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ వల్ల వివిధ రకాల క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది.
దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, టీహెచ్‌ఎంల వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. నైట్రేట్ పరిమాణం ఎంత పెరిగితే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు అంత పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

సాధారణంగా తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ అనే రసాయనాన్ని వాడుతుంటారు. దీని వల్ల నీటిలో ఉండే హానికారక క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే బ్యాక్టీరియాను తొలగిపోతాయని..అయితే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్‌తో ట్రైహాలోమీథేన్ అనే కారకం ఉత్పత్తి అవుతుందని..ఇది అనేక ఆరోగ్య సమస్యలను,ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల మూత్రాశయ క్యాన్సర్ 33శాతం ముప్పు ఉందని, పెద్దపేగు క్యాన్సర్ 15శాతం వచ్చే అవకాశం పెరుగుతుందట. గర్భిణీలకు గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, శిశువుల్లో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
సాధారణంగా పొలాల్లో వాడే ఎరువులు, పశుపెంపకం కేంద్రాల దగ్గర నుంచి వచ్చే వ్యర్థాల్లో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుందని, అది భూగర్భజలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుందని చెప్పారు. వాస్తవానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమైనప్పటికీ మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతోందని సైంటిస్టులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications