Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా..? అయితే, అనారోగ్య సమస్యలు తప్పవు..!
ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్‌లు ఎక్కువయిపోయాయి. కంటిన్యూగా గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్టింగ్ జాబ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయనే హెచ్చరికలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ కార్యాలయంలో కూర్చని పనిచేస్తుంటారు. లేదంటే ఇంట్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో గంటలతరబడి కుస్తీలు పట్టేవారిన చూస్తుంటారు. అయితే, ఒకచోటు అలా కూర్చుని పనిచేయడం వల్ల రక్త ప్రసరణ అవ్వక డీప్ వీన్ త్రొంబోసిస్ (డీవీటీ) అనే వ్యాధికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డీవీటీ వంటి పెను ఆరోగ్య సమస్యతో పాటు ఇంకా అనేక రకాల వ్యాధులకు గురవుతారని వైద్యులు అంటున్నారు. రక్తపోటు, వెన్నెముక, కీళ్ల నొప్పులు, మానసిక కుంగుబాటు, మధుమేహం, ఆందోళన, మెటబలైజ్ ఫ్యాట్ తదితర సమస్యలు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోజంతా కార్యాలయం పనిలో నిమ్నగమయ్యి, పని ఒత్తిళ్లను ఎదుర్కొన్నా రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం తప్పక చేయాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయమం, నడక లాంటి వ్యాపకాలతో మంచి ఫలితాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. రోజులో గంటలతరబడి ఒకేదగ్గర కూర్చుని పనిచేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొవాలంటే వ్యాయమమే దానికి సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయని, వాటివల్ల ఎదురయ్యే దుష్ఫలితాలకు సంబంధించి నిర్వహించిన వివిధ పరిశీలనను 'మెటా అనాలిసిస్'చేసింది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన ఆరోగ్యం కోసం బిజిలైఫ్‌లో రోజువారీ జీవన విధానాన్ని కొంత మార్చుకుని, దినచర్యలో భాగంగా ఫిజికల్ యాక్టివిటీస్ వంటివి చేర్చితే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
అనారోగ్య సమస్యలు ఇవే..
ఒకరోజులో గంటలతరబడి కూర్చుని ఉండడం వల్ల కదలికలు లేక కాళ్లలో రక్తం, ద్రావకాలు ఒకేచోట చేరడం వల్ల గుండెజబ్బులు వచ్చే సమస్యలు అధికంగా ఉన్నాయి.
ఇది రక్తప్రసారంలో మార్పులకు కూడా కారణమవుతుంది దీంతో అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మధుమేహ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
గంటల తరబడి కూర్చొవడం వల్ల కొన్నిరకాల కేన్సర్‌లకు కూడా కారణం అవుతారు.
మానసిక ఒత్తిళ్లు పెరగడంతో పాటు ఆందోళనలు, చిరాకు వంటివి కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వీటిని చేయండి..
ఎక్కువ సేపు కూర్చుకుండా మధ్యమధ్యలో లేచి నిల్చోవాలి.
కొంత దూరం అటు ఇటు నడవాల్సి ఉంటుంది.
చేస్తున్న పని నుంచి కొంతసేపు విరామం తీసుకోవాలి.
కూర్చునే పనిచేయకుండా కాసేపు వీలును బట్టి నిల్చోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications