Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Summer Health Tips: వేసవిలో ఆరోగ్యాన్ని ఆగం చేసుకోవద్దు, ఈ పదార్థాలను ఎప్పుడూ కలిపి తీసుకోవద్దు
ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఇంట్లో నుండి కాలు బయట పెడదామంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎండలు పెరిగేకొద్దీ శరీరం నీరసించి పోతుంది. డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. వేసవికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే రోగాల బారిన పడటం ఖాయం.
ఎండాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురవ్వడంతో పాటు, జీర్ణ సమస్యలు, ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తుతాయి. వేసవి కాలంలో ఏయే ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల ఉత్పత్తులు, పండ్లు:
పాలు, జున్ను, పెరుగు వంటి పాల ఉత్పత్తులు వేసవికాలంలో తీసుకోవడం వల్ల పొట్టపై భారం పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, పైనాపిల్ వంటి ఆమ్ల పండ్లతో పాల ఉత్పత్తులను కలిపినప్పుడు అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలు రావొచ్చు. అందుకే డైరీ ప్రొడక్ట్స్ ను, పండ్లను కలిపి తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
కూల్ డ్రింక్స్, వేడి ఆహారం:
వేడి ఆహారాలు తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది తిమ్మిరి, ఉబ్బరం, మలబద్ధకానికి దారితీస్తుంది. భోజన సమయంలో గది ఉష్ణోగ్రత లేదా గోరువె్చని నీటిని తాగడానికి ప్రయత్నించాలి. దీని వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే జీవక్రియ మెరుగుపడుతుంది.
పిండి పదార్థాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు:
పిండి పదార్థాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను కలపడం వల్ల కడుపుపై భారం పెరుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. బంగాళాదుంపలు, బియ్యం, బ్రెడ్ వంటి ఆహారాలు మాంసం, చేపలు, బీన్స్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే వాటిని ఒకేసారి తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను ఆప్టిమైజ్ చేయడానికి, ఉబ్బరాన్ని కలిగించడానికి, అసౌకర్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
కొవ్వు, చక్కెర పదార్థాలు:
వేసవి కాలం అంటే ఐస్ క్రీములు, కేక్ లు, పేస్ట్రీల వంటి తీపి పదార్థాలు ఎక్కువగా తింటుంటాం. అయితే బర్గర్లు, ఫ్రైలు, ఫ్రైడ్ చికెన్ వంటి కొవ్వు పదార్థాలతో ఈ చక్కెర పదార్థాలను కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను మితంగా తినడానికి ప్రయత్నించాలి. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను ఆ సమయంలో నివారించాలి.
ఎసిడిక్, మసాలా ఆహారాలు:
స్పైసీ ఫుడ్స్ జీర్ణ వ్యవస్థను చికాకు పెడతాయి. టమోటాలు, సిట్రస్ ఫ్రూట్స్, వెనిగర్ వంటి ఆమ్ల ఆహారాలతో కలిపినప్పుడు, గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. స్పైసీ ఫుడ్స్ ను విడిగా తినాలి. ఆకుపచ్చ ఆకు కూరలు వంటి ఆల్కలీన్ ఆహారాలతో ఆమ్ల ఆహారాలను కలిపి తినకూడదు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications