Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
Foods That Causes Dehydration: ఈ పదార్థాలు డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.. దూరంగా ఉండటం మంచిది
వేసవి కాలం వచ్చేసింది. ఇంట్లో నుండి కాలు బయట పెడదామంటే భయపడిపోయేలా సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఏప్రిల్, మే నెలల్లో పట్టపగలు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చేస్తుంది.

ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ వేడి వల్ల అలసట, నీరసం ఆవహిస్తాయి. డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. వేసవిలో ఎన్ని ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిదని చెబుతారు వైద్య నిపుణులు. హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగడం ఎంత ముఖ్యమో.. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వేసవిలో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాల్టీ స్నాక్స్:
పొటాటో చిప్స్, జంతికలు, క్రాకర్స్ వంటి ఉప్పు వేసి తయారు చేసే స్నాక్స్ కు వేసవి కాలంలో దూరంగా ఉండాలి. కరకరలాడే ఈ ఫుడ్ ఐటెమ్స్ అంటే చాలా మందికి నోరూరుతుంది. కానీ ఎండాకాలంలో వీటిని తినడం వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
ఈ ఆహారాల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది నీటిని సంగ్రహించి శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురి చేస్తుంది. ఉప్పగా ఉండే స్నాక్స్ కు బదులు.. నీరు, సహజ ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉండే పుచ్చకాయ, దోసకాయ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి.
మద్యం:
ఎండాకాలంలో చల్లని బీరు తాగాలని చాలా మంది కోరుకుంటారు. ఎక్కడికైనా వెళ్లినా, ఫ్రెండ్స్ ను కలిసినా బీరు వేద్దామా అని అడుగుతుంటారు. వేసవికాలంలో చిల్డ్ బీర్ తాగాలని నాలుక లాగుతున్నా.. కంట్రోల్ చేసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన ఎక్కువ అవుతుందని, మూత్రం ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని హెచ్చరిస్తున్నారు. వేసవికాలంలో ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా తగ్గించాలని సూచిస్తున్నారు. దానికి బదులు నీరు, నిమ్మరసం తాగడం ఉత్తమమని చెబుతున్నారు.
చక్కెర పానీయాలు:
సోడా, టీ, నిమ్మరసం వంటి చక్కెర పానీయాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. కానీ వాటి వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ పానీయాల్లో చక్కెర అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
ఇది మూత్ర ఉత్పత్తిని, డీహైడ్రేషన్ ను పెంచుతుంది. చక్కెర పానీయాలకు బదులు మంచి నీరు తాగడం, తాజా పండ్లు, కూరగాయలు తినడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు:
ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇష్టపడని వారు ఉండరు. వాటిలో సోడియం, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఆహార పదార్థాల వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. దీని వల్ల మరింత డీహైడ్రేషన్ కు గురవుతారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు వంటి ప్రాసెస్ చేయని ఆహారాలు తినడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
