Latest Updates
-
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.! -
రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్.. ఇప్పుడు మీ ఇంట్లోనే నిమిషాల్లో రెడీ! -
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.? -
పక్కింటి ఆంటీల నుంచి సొంత చుట్టాల వరకు..పదే పదే విమర్శించే బంధువుల నోళ్లు మూయించే టిప్స్! -
చర్మ నిగారింపు కోసం.. వీటిని ముఖానికి పూయడమే కాదు, తిన్నా ప్రయోజనమే.! -
ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ ఆలూ కూర వండారంటే.. చపాతీలు, పూరీలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
ఈ విటమిన్ లోపంతో నిరంతరం అలసట, తిమ్మిర్లు.. ఈ హెల్తీ ఫుడ్స్‌తో ఉపశమనం -
షుగర్ వ్యాధికి చెక్ పెట్టే జ్యూస్ ఇదే..తాగితే 100 ఏళ్లు హ్యాపీగా బతికేస్తారు! -
ఉదయం చట్నీ టెన్షన్ వద్దు.. ఈ టొమాటో తొక్కు ఉంటే ఇడ్లీ, దోసెల్లోకి పండుగే..ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ -
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.!
గ్యాస్, అసిడిటీతో రోజంతా కుదురే ఉండట్లేదా.?.. ఈ ఆయుర్వేద టిప్స్‌తో చెక్ పెట్టేయండి.!
డిజిటల్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శారీరక శ్రమ కంటే మెదడుకి ఎక్కువగా పనిచెప్పే కంప్యూటర్ ముందు గంటలుగంటలు కూర్చుని ఎప్పుడు తింటున్నామో.. ఏం తింటున్నామో అనే ధ్యాస లేకుండా రోజు గడుస్తోంది. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా ఇదే పద్ధతి కొనసాగడం వల్ల రోజంతా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీంతో పనిపై దృష్టి పెట్టలేరు. తినడానికి కూడా ఇష్టపడరు. అయితే ఈ సమస్యకి ఆయుర్వేదంలో సరైన పరిష్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు.

గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యల కారణంగా మీ శరీరం ఎప్పుడూ బరువుగా అనిపిస్తుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల ఈ సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. చివరికి చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. మీ రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులను చేయడం ద్వారా వీటి నుంచి ఉపశమనం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు.
గోరువెచ్చని నీరు
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే పరిగడుపునే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం ద్వారా శరీరం నుంచి విష పదార్థాలు సులభంగా బయటకు పోవడానికి, జీర్ణక్రియను సులభతరం చేయడానికి దోహదపడుతుంది.
యోగాతో ఉపశమనం
మీ వ్యాయామంలో కొద్ది సేపు యోగాకి కేటాయించాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. వజ్రాసనం, పవనముక్తాసనం, బాలాసనం వంటి ఆసనాల ద్వారా శరీరం తేలిక అయి గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. భవిష్యత్తులో మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
కిచెన్ చిట్కాలు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక గ్లాస్ జీలకర్ర నీరు, సెలెరీ టీ, కొత్తిమీర నీరు వంటి హెర్బల్ పానీయాలను తీసుకోవడం ప్రయోజనం కలిగిస్తుంది. ప్రతిరోజూ ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా వీటిని తీసుకున్నాకు టీ లేదా కాఫీ తాగడం మానుకోండి.
జీర్ణక్రియపై భారం వద్దు
మెరుగైన జీర్ణక్రియ కోసం.. క్రమం తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ప్రతిరోజూ యోగా సాధన, వ్యాయామం చేయాలి. 8-9 గంటల పాటు సరైన నిద్ర ఉండాలి. మీకు ఏవైనా జీర్ణ సమస్యలు ఎదురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వీటిని పాటించడం ద్వారా మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులను త్వరలోనే గమనిస్తారు. ఈ విధానంలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications