Latest Updates
-
పక్కింటి ఆంటీల నుంచి సొంత చుట్టాల వరకు..పదే పదే విమర్శించే బంధువుల నోళ్లు మూయించే టిప్స్! -
చర్మ నిగారింపు కోసం.. వీటిని ముఖానికి పూయడమే కాదు, తిన్నా ప్రయోజనమే.! -
ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ ఆలూ కూర వండారంటే.. చపాతీలు, పూరీలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
ఈ విటమిన్ లోపంతో నిరంతరం అలసట, తిమ్మిర్లు.. ఈ హెల్తీ ఫుడ్స్‌తో ఉపశమనం -
షుగర్ వ్యాధికి చెక్ పెట్టే జ్యూస్ ఇదే..తాగితే 100 ఏళ్లు హ్యాపీగా బతికేస్తారు! -
ఉదయం చట్నీ టెన్షన్ వద్దు.. ఈ టొమాటో తొక్కు ఉంటే ఇడ్లీ, దోసెల్లోకి పండుగే..ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ -
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.! -
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.? -
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.! -
ఉదయం నిద్రలేవగానే మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రిలీఫ్!
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.?
భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా భార్యాభర్తల మధ్య సంబంధంపైన చర్చలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత భర్త ఎక్కువగా తల్లి మాటలకు, ఆమె ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. దీనివల్ల తమ మధ్య భావోద్వేగ సమస్యలు తలెత్తుతున్నాయని భార్య ఫిర్యాదు చేయడం చూస్తుంటాం. అయితే ఇది ఎంతవరకు నిజం, ఇందుకు దారితీసే కారణాలేంటి.. ఇది కుటుంబం, విలువలు, పెంపకం, బాధ్యతలు, సంబంధాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

ప్రతి ఇంటి పరిస్థితి ఇంకో కుటుంబంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో పరిస్థితులు ఎవరైనా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, అత్తాకోడళ్ల తగవులు, తల్లి, భార్య మధ్య నలిగిపోతున్న పురుషుడు.. ఇవన్నీ సహజంగానే ఉంటాయి. పెళ్లికి ముందుకు తల్లి సంరక్షణలో పెరిగిన కొడుకు, వివాహం తర్వాత తన జీవితంలోకి వచ్చిన భార్య, తల్లి మెచ్చేలా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాధాన్యత కారణంగా ఇద్దరితో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అయితే కొందరు పురుషులు పెళ్లయిన తర్వాత తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో దంపతుల మధ్య భావోద్వేగ సంబంధం లోపిస్తోంది. ఇది సరైంది కాదని నిపుణులు అంటున్నారు. తల్లిని గౌరవిస్తూనే భార్యకు సమాన ప్రాధాన్యత ఇస్తేనే ఆ కుటుంబం విజయవంతంగా ఉంటుందని సూచిస్తున్నారు. మరి పురుషుడు తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి దారి తీసే కారణాలేంటో చూద్దాం..
తల్లితో భావోద్వేగ బంధం
పురుషులకు చిన్నతనం ననుంచే తల్లితో బలమైన భావోద్వేగ బంధంతో ఉంటారు. వారి పెంపకం, చదువు, ఆరోగ్యానికి సంబంధించి అంశాలతో పాటు వారి జీవితంలోని ప్రతి దశలో తల్లి పాత్ర కీలకంగా ఉంటుంది. దాదాపు పాతికేళ్లుగా తల్లీకొడుకుల అనుబంధం ఎనలేనిదిగా ఉంటుంది. ఈ అనుబంధం పురుషులు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో తల్లి పాత్ర ప్రధానంగా ఉండేలా చేస్తుంది. పెళ్లయిన తర్వాత ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే దీనర్థం భర్త భార్యకి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కాదు.. తల్లితో అనుబంధం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
సామాజిక దృక్పథం
మన సమాజంలో తల్లిదండ్రుల బాధ్యత కుమారులపైనే ఉంటుంది. అంతేకాకుండా వారిని గౌరవించడం మన సంప్రదాయం. అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాటలను, సూచనలను పరమావధిగా భావిస్తూ పాటిని పాటిస్తుంటారు. ఈ క్రమంలో పెళ్లి తర్వాత కూడా ఇవే విలువలు, ప్రవర్తన వారిలో కనిపిస్తాయి. కాగా నేటి కుటుంబాల్లోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. తల్లిదండ్రుల భాగస్వామ్యం, భార్య సలహాలతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బాధ్యతల ఒత్తిడి
వివాహం తర్వాత పురుషులు.. ఒకేసారి మూడు పాత్రలు పోషిస్తారు. కొడుకు, భర్త, తండ్రి, సంపాదనలో పెద్ద దిక్కుగా ఇలా అనేక రకాల బాధ్యతలు తలపై ఉంటాయి. తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు భార్య ప్రాముఖ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించదని.. ఇది కుటుంబ బాధ్యతల్లో భాగమేనని అంటున్నారు.
సంభాషణ లోపం
కొన్ని సందర్భాల్లో భర్త తన అభిప్రాయాలను వినడం లేదని, కుటుంబీకులు సైతం పట్టించుకోవడం లేదని భార్య ఫీల్ అవ్వడం సహజం. ఈ క్రమంలో తల్లి, భార్య మధ్య సంబంధాలను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో భార్యతో సహా కుటుంబీకులందరితో బహిరంగ సంభాషణ ఉండటం అవసరం. చిన్న చిన్న విషయాల లోపం వారి మధ్య వివాదానికి దారితీస్తాయి. కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇద్దరి మధ్యా ఒత్తిడి ఉండదు.
భార్యాభర్తల మధ్య అనుబంధంతో పాటు తల్లితోనూ పురుషుడికి సరైన అనుబంధం ఉంటేనే బంధాలు బలపడతాయి. తల్లి పట్ల గౌరవంగా, ప్రేమతో ఉంటూనే. భార్యతో నమ్మకంగా ఉండాలి. ఆమెకి సహకారం అందించాలి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అనేలా భార్యతో అనుబంధం ఉండాలి. అంతేకాకుండా కుటుంబీకులతోనూ ఆప్యాయత, పరస్పర గౌరవం పాటించడం ద్వారా సామరస్యం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications