Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అరటిపండు ఇలా తింటే పైల్స్ సమస్య రమన్నా రాదు
ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్య పైల్స్. పైల్స్ నుండి ఉపశమనం పొందడానికి వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కూడా పైల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. పైల్స్ నుండి ఉపశమనం పొందడానికి అరటిపండు చాలా బాగా పని చేస్తుంది.
అరటి పండులోని పోషకాలు, అధిక ఫైబర్ పైల్స్ సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. అందుకే అరటి పండ్లను పైల్స్ ఫ్రెండ్లీ ఆహారంగా చూస్తారు. పైల్స్ తగ్గించుకోవడానికి, పైల్స్ రాకుండా ఉండటానికి అరటి పండ్లను ఎలా తినాలి, ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అరటిపండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ప్రేగు కదలికల సమయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. పైల్స్ తీవ్రతరం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.
చక్కగా పండిన అరటిపండ్లనే తినాలి:
పైల్స్ రాకుండా అరటి పండ్లను తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా పండిన అరటి పండ్లనే ఎంచుకోవాలి. అరటి పండ్ల కంటే అరటి కాయలను జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సులభంగా జీర్ణం కావడానికి, అందులోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందడానికి పూర్తిగా పండిన అరటిపండ్లను తినాలి.
తాజా పండ్లు తినాలి:
తాజా అరటి పండ్లు తినడం చాలా ముఖ్యం. అలాగే అరటిపండ్లను ఇతర ఆహారాలతో కాకుండా నేరుగా తినడం వల్ల దాని ప్రయోజనాలు సక్రమంగా అందుతాయి. అలాగే తాజా పండ్లు తినడం మంచిది. తినేటప్పుడు పూర్తిగా నమలాలి.
బనానా స్మూతీస్:
బాగా పండిన అరటి పండ్లను లో ఫ్యాట్ యోగర్ట్, బాదం పాలతో కలిపి రుచికరమైన, పోషకమైన స్మూతీని తయారు చేసుకోవచ్చు. అదనపు ఫైబర్ బూస్ట్ కోసం బెర్రీలు వంటి ఇతర పండ్లను జోడించుకోవచ్చు.
అల్పాహారంలో అరటిపండ్లు:
తృణధాన్యాలు, వోట్ మీల్, వోల్ గ్రెయిన్ పాన్‌కేక్‌లతో కలిసి ముక్కలు చేసిన అరటిపండ్లు తినొచ్చు. ఇలా కలపడం వల్ల రుచి మెరుగుపడటంతో పాటు అన్ని రకాల పోషకాలు అందుతాయి.
అరటి పండ్లను ఎప్పుడు తినాలంటే:
అరటి పండ్లను భోజనాల మధ్యలో లేదా సాయంత్రం చిరుతిండిగా తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో అరటి పండు తినడం వల్ల పైల్స్ కు దారితీసే యాసిడ్ రిఫ్లక్స్ ను నివారించవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications