Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఉప్పు తగ్గించక్కర్లేదు..ఈ రెండూ తింటే చాలు హై బీపీ ఢమాల్!
సాధారణంగా మన ఇంటి పెరట్లో కూడా లభించే పండ్లలో అరటి ఒకటి. అరటిపండు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే అరటిపండు గురించి ఓ అధ్యయనంలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. అరటిపండు తినడం వల్ల హై బీపీని కూడా తగ్గించుకోవచ్చని తాజాగా చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. అరటి మాత్రమే కాకుండా బ్రకోలీ తినడం వల్ల కూడా హై బీపీ తగ్గిపోతుందట. సాధారణంగా హై బీపీ ఉన్న వ్యక్తులు ఉప్పు కొంచెం తగ్గించుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే హై బీపీని తగ్గించడంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించడం కంటే అరటిపండ్లు, బ్రోకలి వంటి ఆహారాలు చాలా సహాయపడతాయని సైంటిస్టులు కనిపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో హై బీపీ(అధిక రక్తపోటు)ఒకటి. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ సహా అనేక రకాల గుండె సంబంధిత వ్యాధులకు, చిత్తవైకల్యం, ధీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు ఇదే ప్రధాన కారణంగా ఉంటుంది. సాధారణంగా మనకు హైబీపీ ఉంటే తినే తిండిలో కొంచెం ఉప్పు తగ్గించుకోండి అని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అయితే కెనడా దేశంలోని యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ (university of waterloo)నిర్వహించిన తాజా పరిశోధనలో..తీసుకునే ఆహారంలో సోడియం(ఉప్పు)తగ్గించుకోవడం కంటే పొటాషియం,సోడియం శాతాన్ని పెంచుకోవడం బీపీని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఈ విషయంలో అరటి, బ్రోకలి వంటివి హెల్ప్ చేస్తాయని పరిశోధనలో తేలిందని వాటర్లూ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ డాక్టర్ అనితా లేటన్ తెలిపారు.

పోటాసియం,సోడియం రెండూ
పొటాసియం,సోడియం అనేవి రెండూ ఎలక్ట్రోలైట్లు. ఎలక్ట్రోలైట్లు అంటే శరీరంలోని ద్రవాలతో కరిగి విద్యుత్ ఛార్జ్ ను కలిగి ఉండే ఖనిజాలు. ఇవి మన శరీరం సరిగ్గా పరిచేయడానికి చాలా అవసరం. కండరాలు కదలడానికి,సంకోచించడానికి ఈ ఎలక్ట్రోలైట్లు విద్యుత్ సంకేతాలను పంపుతాయి. నరాలు సమాచారాన్ని పంపడానికి, స్వీకరించడానికి ఈ ఎలక్ట్రోలైట్లు అవసరం. గుండె, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయడానికి ివి సహాయపడతాయి. వీటి సమతుల్యత లేకపోతే కండరాల బలహీనత,గుండె సమస్యలు, నరాల సమస్యలు వంటివి వస్తాయి. అరటి, బంగాళదుంప, పాలకూర, బీన్స్, చిలగడదుంపలు వంటి వాటిలో పొటాసియం అధికంగా ఉంటాయి..ప్రాసెస్ చేసిన ఆహారం, ఉప్పు వేసిన చిరుతుళ్లు వంటి వాటిల్లో సోడియం అధికంగా ఉంటుంది.
ప్రారంభంలో మానవులు అలా
ప్రారంభంలో మానవులు ఎక్కువగా పండ్లు,కూరగాయలు తినేవారని..అందువల్ల వారి బాడీ కంట్రోల్ సిస్టమ్ అధిక పొటాషియం,తక్కువ సోడియంతో బాగా పనిచేసేలా డెవలప్ అయి ఉండొచ్చని వాటర్లూ యూనివర్శిటీకి చెందిన హీహెచ్ డీ స్టూడెంట్ మెలిస్సా స్టాడ్ట్ అన్నారు. అయితే ప్రస్తుతం ఆహారాలలో సోడియం ఎక్కువగా, పొటాషియం తక్కువగా ఉంటుందని..ముఖ్యంగా సిటీల్లో నివసించేవాళ్లు తీసుకునే ఆహారాల్లో ఇలా ఉంటుందని తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications