Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
షుగర్ వచ్చే ముందు మీ బాడీ చూపించే 5 సంకేతాలు ఏంటో తెలుసా!
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో, మారిపోయిన ఆహారపు అలవాట్ల కారణంగా షుగర్ వ్యాధి అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే షుగర్ ఒక్కసారిగా మన శరీరంలోకి ప్రవేశించదు. ఈ వ్యాధి బారిన పడటానికి చాలా రోజుల ముందు నుంచే మన శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ డేంజర్ సిగ్నల్స్ పసిగట్టి ముందే జాగ్రత్త పడితే మధుమేహాన్ని దరిచేరనివ్వకుండా అడ్డుకట్ట వేయవచ్చు. మరి మీ బాడీ షుగర్ వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తుందో ఇక్కడ చూడండి
మెడ, చంకల భాగంలో చర్మం నల్లగా మారడం
మీరు ఎప్పుడైనా గమనించారా? ఉన్నట్లుండి మెడ చుట్టూ మురికి పట్టినట్లుగా లేదా చర్మం మందంగా, నల్లగా మారుతోందా? అది సాధారణ మురికి కాకపోవచ్చు. వైద్య పరిభాషలో దీనిని అకాంతోసిస్ నిగ్రికన్స్ అంటారు. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ (ఇన్సులిన్ హార్మోన్‌కు శరీరం సరిగ్గా స్పందించకపోవడం) పెరిగిందనడానికి ఇది మొట్టమొదటి సంకేతం. చంకలు, మెడ వెనుక భాగంలో ఇలా నల్లగా మారుతుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.

అకస్మాత్తుగా పెరిగే పులిపిర్లు
సాధారణంగా కొందరిలో పులిపిర్లు ఉండటం చూస్తుంటాం. కానీ ఉన్నట్లుండి మెడ, చంకలు లేదా చర్మం మడతలు పడే ప్రాంతాల్లో చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ గుంపులుగా ఎక్కువగా వస్తుంటే మాత్రం తేలికగా తీసుకోకండి. రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ అసాధారణంగా పెరిగినప్పుడు శరీరంలో ఇలాంటి మార్పులు వస్తుంటాయి. ఇది ప్రీ డయాబెటిస్ కు ఒక ముఖ్యమైన లక్షణం.
విపరీతమైన దాహం, తరచుగా మూత్రం రావడం, బరువు తగ్గడం
నీళ్లు ఎంత తాగినా గొంతు ఎండిపోయినట్లు అనిపించడం, తరచుగా మూత్ర విసర్జనకు (ముఖ్యంగా రాత్రి పూట) వెళ్లాల్సి రావడం ప్రధాన లక్షణాలు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కిడ్నీలు ఆ అధిక గ్లూకోజ్ ను బయటకు పంపేందుకు ఎక్కువగా శ్రమిస్తాయి. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి దాహం వేస్తుంది. అలాగే, ఆహారం బాగానే తీసుకుంటున్నా కారణం లేకుండా ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట రావడం వంటివి గమనిస్తే అది కచ్చితంగా షుగర్ ముప్పుగా భావించాలి.
గాయాలు త్వరగా మానకపోవడం
సాధారణంగా మనకు చిన్న దెబ్బ తగిలినా లేదా గీసుకున్నా వారం రోజుల్లో తగ్గిపోతుంది. కానీ, చిన్న చిన్న గాయాలు కూడా మానడానికి వారాలు, నెలల సమయం పడుతుంటే మాత్రం మీ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగాయని అర్థం. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ మందగిస్తుంది, అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే గాయాలు త్వరగా మానవు.
పదే పదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం
శరీరంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫంగస్, బ్యాక్టీరియాలు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. కాళ్ల వేళ్ల మధ్య, చర్మం మడతల్లో, లేదా ప్రైవేట్ భాగాల్లో పదే పదే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే అది హై బ్లడ్ షుగర్ కు సంకేతం కావచ్చు. ఎన్ని మందులు వాడినా తగ్గకుండా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వస్తుంటే షుగర్ ఉందేమోనని అనుమానించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
