Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఎన్ని సిరప్‌లు వాడినా దగ్గు తగ్గడం లేదా..? ఈ చిట్కాలతో దగ్గు పూర్తిగా మాయం..!
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయినా, లేదా ఏదైనా వైరల్ అటాక్ అయినా విపరీతమైన దగ్గు వస్తుంది. శరీరంలో కఫం కూడా తయారవుతుంది. దగ్గినప్పుడల్లా కఫం బయటకు వస్తుంది. కొంతమందికి ఈ దగ్గు ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. దగ్గేటప్పుడు ఊపిరి కూడా తీసుకోవడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారంపాటు ట్యాబ్లెట్లు, సిరప్‌లు తాగినాసరే కొందరిలో ఈ దగ్గు అలాగే వుంటుంది. తాజాగా నెబ్యులైజర్లను కూడా ఉపయోగిస్తున్నా దగ్గు మాత్రం తగ్గడం లేదు. ఒకరి నుంచి ఒకరికి ఈ దగ్గు చాలా త్వరగా సులభంగా వ్యాపిస్తుంది.
ఊపిరి తిత్తుల్లో, గాలిపీల్చుకునే గొట్టాల్లో శ్లేషం వుండడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ శ్లేషం ఉపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. దగ్గినప్పుడు శ్లేషం బయటకు వస్తుంది.
కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కఫాన్ని బయటకు పంపించి దగ్గును కూడా తగ్గించవచ్చు. దీని కోసం ముందుగా వేడినీళ్లను తాగాలి. మరీ ఎక్కువ వేసడి కాకుండా తాగే విధంగా వుండేలా చూసుకొని తాగాలి. వేడి వల్ల కఫం బటయకు వస్తుంది. వేడితో గాలి గొట్టాలు కూడా వ్యాకోచిస్తాయ్.
1. వేడినీళ్ల ఆవిరి పీలిస్తే కూడా మంచి ఫలితం వుంటుంది. వేపపుల్లను నొట్లో పెట్టుకొని కఫాన్నివుంచడం వల్ల కూడా శ్లేషం మొత్తం బయటకు వస్తుంది. రాత్రి సమయంలో దగ్గు వస్తే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. తిన్న ఆహారం కూడా వాంతి అయ్యే అవకాశం వుంది. సాయంత్రం ఆరు గంటల లోపే భోజనం చేసేయాలి.
దగ్గు వున్నన్ని రోజులు వేడినీళ్లల్లో ఉదయం తేనె కలుపుకొని తాగాలి.

2. అల్లం ముక్కలను వేడి చేసి చిన్న ముక్కలుగా చేసుకొని నోట్లో దవడ దగ్గర పెట్టుకొని ఆ రసాన్ని పీల్చుడం వల్ల దగ్గు త్వరగా తగ్గుతుంది. మిక్సీలో అల్లం ముక్కలను వేసి, ఆ రసాన్ని ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో కొంచెం తేనె వేసుకొని నాకితే కూడా దగ్గు తగ్గుతుంది.
3. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. నీళ్లల్లో రెండు టీస్పూన్ల జిలకరను వేసుకోవాలి. సగం టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. అవసరమైనంత తులసి ఆకులను యాడ్ చేసుకోవాలి. ఐదు అల్లం ముక్కలను వేసుకొని నీళ్లను బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి నీళ్లను బాగా మరిగించాలి. చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసాము కాబట్టి అందులో సగం కప్పుకు పైగా నీళ్లు బాగా ఇంకిపోయేలా మరిగించాలి. ఇప్పుడు తయారైన రసాన్ని ఒక గ్లాసులో పోసుకొని అందులొ సగం నిమ్మకాయరసాన్ని పిండుకోవాలి. ఒక టీ స్పూన్ తేనెను కూడా కలుపుకోవాలి. ఇక దీంతో దగ్గు తగ్గే కషాయం రెడీ అయినట్టే. ఈ కషాయాన్ని తాగితే దగ్గు ఖచ్ఛితంగా తగ్గి తీరుతుంది.
4. ఒక ప్యాన్‌లో ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక దాల్చిన చెక్కను వేసుకోవాలి. సగం టీ స్పూన్ జిలకర, సగం టీ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. నాలుగు లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని స్టవ్‌పైన పెట్టి బాగా మరిగించాలి. ఈ మరిగిన నీళ్లను వడకట్టుకొని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీన్ని మూడు పూటలు, మూడు రోజులు తీసుకుంటే ఎంతటి దగ్గైనా సరే శరీరంలోంచి ఎగిరిపోవాల్సిందే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications