Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Weight Loss Tips: మిల్లెట్స్ ఇలా తీసుకున్నారంటే ఒంట్లో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
బరువు తగ్గడానికి ఎప్పుడూ తీసుకునే దాని కంటే తక్కువ కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉండేలా డైట్ తీసుకోవడంతో పాటు రోజూ కొంత కొవ్వు తగ్గిస్తూ ఉండాలి. రోజూ ఎంత వ్యాయామం చేసినా సరైన డైట్ పాటించకపోతే బరువు తగ్గలేరు. బరువు తగ్గడంలోనైనా, పెరగడంలోనైనా డైట్ దే కీలక పాత్ర.

బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంది చెప్పే మాట తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవాలని, ఫైబర్ కంటెంట్ ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలని చెబుతారు. బరువు తగ్గాలనుకునే వారికి మిల్లెట్స్ ఉత్తమమైన ఎంపిక. ఇందులో గ్లూటెన్ ఉండదు. ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు మిల్లెట్లను ఎలా తినాలి, ఎలా తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చు, ఏయే మిల్లెట్స్ తీసుకుంటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్లెట్ రకాలు:
* జొన్న
* పెర్ల్ మిల్లెట్(బజ్రా)
* ఫింగర్ మిల్లెట్(రాగులు)
* లిటిల్ మిల్లెట్(వరి)
* కోడో మిల్లెట్(కోడ్రా)
* ఫాక్స్‌టైల్ మిల్లెట్(రాలా)
* బార్న్యార్డ్ మిల్లెట్(ఝంగోరా)
* ప్రోసో మిల్లెట్
* బ్రౌన్‌టాప్ మిల్లెట్
తినడం ఒక అవసరం, కానీ తెలివిగా తినడం ఒక కళ:
మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో గ్లూటెన్ ఉండదు. బియ్యానికి, గోధుమలకు గొప్ప ప్రత్యామ్నాయం మిల్లెట్లు. మిల్లెట్లలోని ఫైబర్ కంటెంట్ శరీరంలోని ట్యాక్సిన్లను బయటకు పంపడం ద్వారా సాధారణ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. మిల్లెట్లలోని ఫైబర్ దాని బయో యాక్టివ్ కాంపౌండ్స్ తో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఏదో తినాలని అనిపించడాన్ని తగ్గిస్తుంది.
బ్రౌన్ రైస్ VS మిల్లెట్స్:
బ్రౌన్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మిల్లెట్లలో ప్రోటీన్లు, కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. బ్రౌన్ రైస్ స్థానంలో మిల్లెట్ డైట్ ని ఎంచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన మార్పు వస్తుంది. అయితే రైస్ తీసుకోవడాన్ని మాత్రం పూర్తిగా నిలిపివేయకూడదని వైద్యులు చెబుతున్నారు.
అన్నం మానేసి కేవలం మిల్లెట్స్ తింటే..:
మంచి ఆరోగ్యం కోసం, మంచి బరువును మెయింటైన్ చేయడం కోసం రోజూ తీసుకునే ఆహారంలో మిల్లెట్స్ భాగం చేసుకోవడం మంచిది. అయితే అన్నం పూర్తిగా మానేసి కేవలం మిల్లెట్లు తీసుకుంటే బరువు తగ్గవచ్చా అనే ప్రశ్న రావొచ్చు. కానీ కేవలం మిల్లెట్లు మాత్రమే తినడం వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మిల్లెట్లు మంచివే అయినప్పటికీ మితంగా తింటేనే ప్రయోజనం.
బరువు తగ్గడానికి మిల్లెట్లను ఎలా తినాలి:
* పిండి:
గోధుమ, బియ్యపు పిండిని ఉపయోగించే చోట మిల్లెట్ల పిండిని వాడుకోవచ్చు. చపాతీలు, బిస్కెట్లు, రొట్టెలు చేసుకోవచ్చు.
* సెమోలినా/ రవ్వ:
ఉప్మా, అప్పం, దోశె, ఇడ్లీ, పొంగల్ లను మిల్లెట్లతో తయారు చేసుకోవచ్చు. వివిధ రకాల మిల్లెట్లతో చేసిన వెర్మిసెల్లి కూడా ఇప్పుడు మార్కెట్లలో దొరుకుతోంది.
* ఖిచ్డీ, పొంగల్:
కిచ్డీలో అన్నం, పప్పు మంచి కాంబినేషన్. కాబట్టి, బియ్యాన్ని మిల్లెట్లతో భర్తీ చేయడం వల్ల రుచిలో పెద్ద తేడా ఉండదు. కానీ శరీరానికి మాత్రం ఎక్కువ పోషకాలు అందుతాయి.
* మిల్లెట్లతో సలాడ్‌లు:
మిల్లెట్లతో సలాడ్ లు చేసుకుని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
* బ్రేక్‌ఫాస్ట్:
మిల్లెట్ ఉప్మా, పొంగల్, దోసెలు, పాన్‌కేక్‌లు, రాగి ఇడ్లీలు, మిల్లెట్ వెర్మిసెల్లి
* మధ్యాహ్న భోజనం:
మిల్లెట్ చపాతీలు, భక్రీ, మిల్లెట్ కిచ్డీ, మిల్లెట్ సలాడ్స్, మిల్లెట్ పొంగలు
* స్నాక్స్:
రాగులతో చేసిన లడ్డూలు, మిల్లెట్లతో చేసిన చిక్కీలు
* డిన్నర్:
ఖిచ్డీ, మిల్లెట్ నూడుల్స్, పాస్తా, సూప్‌లు
బరువు తగ్గడానికి బెస్ట్ మిల్లెట్లు:
* రాగులు
* బజ్రా/ పెర్ల్ మిల్లెట్
* జొన్నలు
* ఫాక్స్‌టైల్
* రాజ్‌గీరా
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications