Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
రోడ్డు పక్కన కనబడే ఈ పువ్వు సాధారణమైనది కాదు..బీపీ, షుగర్,క్యాన్సర్,గుండె జబ్బులకి చెక్ పెట్టే సంజీవని!
సాధారణంగా పల్లెటూర్లలో రోడ్ల పక్కన కూడా బిళ్ళ గన్నేరు పువ్వులు కనబడుతుంటాయి. పెరట్లో, గుడి ప్రాంగణంలో, దారి పక్కన ఇలా ఎక్కడ చూసినా తన నిరాడంబరమైన అందంతో మనల్ని పలకరించే మొక్క బిళ్ళ గన్నేరు. తెలుపు, గులాబీ రంగుల్లో ఏడాది పొడవునా విరబూసి కంటికింపుగా కనిపించే ఈ పువ్వులను సాధారణంగా అలంకారానికి మాత్రమే ఉపయోగిస్తుంటాం. అయితే ఈ చిన్న పువ్వులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయుర్వేదంలో దీనిని సతత హరిత అని పిలుస్తారు, అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండేదని అర్థం. పేరుకు తగ్గట్టే ఇది మన ఆరోగ్యానికి నిత్యం మేలు చేసే ఒక సంజీవని.
మధుమేహానికి దివ్యౌషధం
మారుతున్న లైఫ్ స్టైయిల్ వల్ల ప్రస్తుతం చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ గా కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మధుమేహ రోగులుయ మన దేశంలో ఉన్నారు. బిళ్ళ గన్నేరు పువ్వులు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం లాంటివి. ఇందులో ఉండే విన్‌బ్లాస్టిన్, విన్‌క్రిస్టిన్ వంటి ప్రత్యేక ఆల్కలాయిడ్లు, క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే నాలుగైదు తాజా పువ్వులను నమలడం లేదా వాటి రసాన్ని తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది
బిళ్ళ గన్నేరు మొక్కలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఇందులోని కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు ప్రమాదకరమైన క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. అయితే ఇది క్యాన్సర్ కు పూర్తి నివారణ అని భావించకూడదు.. కేవలం నివారణ చర్యగా, డాక్టర్ సలహాతో మాత్రమే దీనిని పరిగణించాలి.
రక్తపోటును నియంత్రిస్తుంది
హై బీపీ సమస్యతో బాధపడేవారికి బిళ్ళ గన్నేరు పువ్వుల కషాయం ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తనాళాలకు విశ్రాంతినిచ్చి, రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. దీంతో గుండెపై భారం తగ్గి, గుండె జబ్బుల ముప్పును దూరం చేస్తుంది.
చర్మ సౌందర్యానికి, గాయాలకు సంరక్షణ
దీని ఆకులు, పువ్వులలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల పేస్ట్ ను గాయాలు, పుండ్లు, దురద, తామర, మొటిమల వంటి చర్మ సమస్యలపై రాయడం వల్ల ఇన్‌ఫెక్షన్లు తగ్గి, అవి త్వరగా మానుతాయి.
జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తుంది
అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. బిళ్ళ గన్నేరు పువ్వులతో చేసిన కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి, జీర్ణశక్తిని పెంచుతుంది.
మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది
ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు దీని సువాసన చక్కని పరిష్కారం చూపుతుంది. దీని పువ్వుల నుండి తీసిన నూనెను అరోమాథెరపీలో వాడతారు. దీని వాసన మనసును ప్రశాంతపరిచి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
కషాయం: నాలుగైదు పువ్వులు, కొన్ని ఆకులను నీటిలో వేసి మరిగించి వడగట్టి తాగవచ్చు.
పేస్ట్: ఆకులు, పువ్వులను మెత్తగా నూరి చర్మంపై ప్రభావిత ప్రాంతంలో పూయాలి.
రసం: తాజా పువ్వుల రసాన్ని తీసి కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గర్భిణులు, పాలిచ్చే తల్లులు దీనికి దూరంగా ఉండాలి.
మోతాదుకు మించి వాడితే వాంతులు, తలతిప్పడం వంటి సమస్యలు రావచ్చు.
ఏ ఆరోగ్య సమస్యకైనా సొంత వైద్యం ప్రమాదకరం. ఆయుర్వేద నిపుణులు లేదా డాక్టర్ల సలహా తీసుకున్నాక దీనిని వాడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications