Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
మెంతులను ఇలా వాడారంటే..100 ఏళ్లు మీ గుండె సేఫ్!
పొద్దున్నే పరడగుపున గ్లాసుడు మెంతి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. మనలో చాలామంది ఇది ఫాలో అవుతుంటారు. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి, బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం మెంతుల సంపూర్ణ ప్రయోజనాలను పొందాలంటే ఇది మాత్రమే సరైన మార్గం కాదు. మెంతులను తినేందుకు ఇంతకంటే మెరుగైన, శక్తివంతమైన పద్ధతి ఒకటి ఉంది. అదే మెంతులను నెయ్యిలో వేయించి పాలలో కలుపుకుని తీసుకోవడం. దీని వెనుక అమోఘమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.
నెయ్యితో మెంతులు..ఎందుకింత ప్రత్యేకం?
సాధారణంగా మెంతులు చేదుగా ఉంటాయి. కానీ వాటిని నెయ్యిలో దోరగా వేయించడం వల్ల ఆ చేదుదనం చాలా వరకు తగ్గి చక్కటి సువాసన వస్తుంది. రుచి పెరగడం ఒకటయితే.. ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవ్వడం మరో బెనిఫిట్.

జీర్ణవ్యవస్థకు బలం: మెంతులలో పీచుపదార్థం (Fiber) పుష్కలంగా ఉంటుంది. దీనిని నెయ్యితో వేయించినప్పుడు నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
షుగర్ కంట్రోల్: మెంతులు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నెయ్యితో కలిపి తీసుకున్నప్పుడు ఈ గుణం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుండెకు రక్షణ: మెంతులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. నెయ్యితో కలిసినప్పుడు ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువును అదుపులో ఉంచడంలో కూడా ఈ మిశ్రమం సహాయపడుతుంది.
పాలతో కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు
వేయించిన మెంతులను పాలలో కలపడం వల్ల ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. పాలు కడుపులో మంట, అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మెంతులు పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తే, పాలు కడుపుకు చల్లదనాన్నిస్తాయి. ఈ రెండింటి కలయిక జీర్ణవ్యవస్థకు ఒక వరం లాంటిది. ఈ మిశ్రమం శరీరంలో పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పాలలో ఉండే కాల్షియంను శరీరం సులభంగా గ్రహిస్తుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.

ఎలా తీసుకోవాలి?
ఒక టీస్పూన్ మెంతులను కొద్దిగా నెయ్యిలో దోరగా వేయించి, వాటిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం తాగవచ్చు.
ఎవరు దూరంగా ఉండాలి?
అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొందరు దీనికి దూరంగా ఉండటం మంచిది. పప్పుధాన్యాలు, బాదం లేదా ఇతర నట్స్ పట్ల అలెర్జీ ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వారికి మెంతులు కూడా పడకపోవచ్చు. పాలు పడకపోవడం వంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్లు పాలకు బదులుగా నీటితో ప్రయత్నించవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఈ మిశ్రమాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా తమ డాక్టర్ సలహా తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications