Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
పొగాకు, గుట్కా వాడకపోయినా నోటి క్యాన్సర్ వస్తుందా? నిపుణులు హెచ్చరిస్తున్న రెండు కొత్త కారణాలు!
ఈరోజుల్లో మనం ఏదైనా సినిమాకి వెళ్తే ముందుగా వచ్చేది నోటి క్యాన్సర్ యాడ్.. నా పేరు ముఖేష్ అంటూ కొంతకాతం క్రితం వరకు సినిమా ప్రారంభంలో వచ్చే ఆ యాడ్ చూసి మనకు ఒళ్లు జలదరించిపోవడం ఖాయం. నోటి క్యాన్సర్ ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తోంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటిగా మారి, ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతోంది.
అయితే నోటి క్యాన్సర్ అనగానే మనకు పొగాకు, గుట్కా, ధూమపానం వంటి దురలవాట్లు గుర్తుకొస్తాయి. ప్రకటనల్ల కూడా వీటివల్లనే నోటి క్యాన్సర్ వస్తుందని తరచుగా చూపెడుతుంటాయి. చాలాకాలంగా ఇవే ప్రధాన కారణాలని మనం నమ్ముతూ వచ్చాం. కానీ ఇటీవలి పరిశోధనలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ దురలవాట్లు లేని వారిలో కూడా నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, దీనికి రెండు ఊహించని కారణాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసలు నోటి క్యాన్సర్ అంటే ఏమిటి?
మన నోరు, పెదవులు లేదా నాలుకలోని కణాలు అసాధారణంగా, అనియంత్రితంగా పెరగడం ప్రారంభించినప్పుడు నోటి క్యాన్సర్ ఏర్పడుతుంది. ఈ కణాలు మొదట చిన్నగా, చదునుగా ఉండి, క్రమంగా గడ్డలుగా లేదా పుండ్లుగా మారతాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే, ఇది తల, మెడ భాగాలకు ఆ తర్వాత శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకం.
నిపుణులు చెబుతున్న ఆ రెండు కొత్త కారణాలు
ఒకప్పుడు కేవలం వ్యసనాల వల్లే నోటి క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు, దంత సమస్యల పట్ల నిర్లక్ష్యం కూడా దీనికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
దంత ఆపరేషన్ తర్వాత మానని గాయాలు: చాలామంది జ్ఞానదంతం తీయించుకోవడం లేదా ఇతర దంత ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఆపరేషన్ వల్ల క్యాన్సర్ రాదు. కానీ ఆ తర్వాత ఏర్పడిన గాయం లేదా పుండు త్వరగా మానకపోతేనే అసలు సమస్య మొదలవుతుంది. గాయంపై ఇన్ఫెక్షన్ చేరి అది చాలాకాలం పాటు మానకుండా ఉంటే, అక్కడి కణాలు క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
దీర్ఘకాలిక నోటి పూతలు: శరీరంలో వేడి లేదా నీటి కొరత వల్ల అప్పుడప్పుడు నోటి పూతలు రావడం సహజం. అవి కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ పదేపదే వస్తూ, నెలల తరబడి మానకుండా వేధించే నోటి పూతలు మాత్రం అత్యంత ప్రమాదకరం. ఇది నోటి క్యాన్సర్ కు ఒక ముఖ్యమైన హెచ్చరిక సంకేతం. చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది భవిష్యత్తులో పెను ప్రమాదానికి దారితీయవచ్చు.

ప్రధాన లక్షణాలు - ఎలా గుర్తించాలి?
నాలుకపై లేదా నోటిలో త్వరగా మానని పుండు.
తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు కనిపించడం.
నోటిలో ఏదో ఒక భాగంలో గడ్డలా ఏర్పడటం.
ఎంత శుభ్రం చేసినా తగ్గని తీవ్రమైన నోటి దుర్వాసన.
చెవి లేదా గొంతులో నిరంతరంగా నొప్పి.
ఆయుర్వేద చిట్కా
దంత సమస్యలు ఉన్నవారు లేదా నోటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనుకునేవారు ప్రతిరోజూ 2-3 యాలకులను నమలాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే యాలకులు నానబెట్టిన నీటితో పుక్కిలించి, ఆ తర్వాత ఆ యాలకులను బాగా నమిలి తినాలి. సాయంత్రం కూడా ఇలాగే చేయడం వల్ల దంత క్షయం, కావిటీస్, దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. యాలకులు నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి, గొంతు నొప్పి నివారణకు కూడా సహాయపడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
