వర్క్‌ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.!

కొవిడ్ మహమ్మారి సమయం నుంచి దేశంలో వర్క్‌ ఫ్రమ్‌ సంస్కృతి గణనీయంగా పెరిగిందనే చెప్పవచ్చు. ఇక, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చాలా కంపెనీలు మరోసారి ఇంటి నుంచే పని విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ విధానం సౌకర్యవంతంగా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఇది ఒత్తిడికి గురిచేస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.

boost your mental well-being with these methods while working from home

వర్క్‌ ఫ్రం హోం విధానం వల్ల ఆఫీసుకు వెళ్లే సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్‌ అవస్థలు తప్పుతాయి. అయితే ఇంటి నుంచి పనిచేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆఫీసు వాతావరణం, ఇంటి వాతావరణం వేర్వేరుగా ఉంటుంది. ఆఫీసులో మీటింగ్‌లు, చిట్‌చాట్‌లు అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. కానీ ఇంట్లో వాటిని ప్రత్యేకంగా అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి నుంచి పనితో కొంత ఒత్తిడీ ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.

వర్క్‌ ఫ్రం ఆఫీసు విధానంలో సహోద్యోగులతో ముఖాముఖి సంభాషణలు ఉంటాయి. అయితే ఇంటి నుంచి పనిచేసే విధానంలో ఈ సదుపాయం ఉండదు. దీంతో ఒంటరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంభాషణ లేని కారణంగా పని ఒత్తిడి పెరుగుతుంది. ఇక, కుటుంబ సభ్యుల మధ్య పనిచేయడం వల్ల మధ్యమధ్యలో పనికి విరామం ఇవ్వాల్సి వస్తుంది. దీంతో ఆఫీసు పని సమయం పెరిగి మరుసటి రోజుకి ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో మీకంటే ప్రత్యేక వాతావరణం కేటాయించుకోవాలి. ఏకాగ్రతగా పనిచేయడానికి మీకంటూ ఒక గదిని ఎంచుకోండి. టిఫిన్‌, లంచ్‌, స్నాక్స్‌ సమయాలను ఆఫీసు షెడ్యూల్‌ ప్రకారం తీసుకుంటూ నిర్ణీత సమయంలో చేసుకోగలరు.

ఆఫీసులో సహోద్యోగులు ఉన్న కారణంగా మధ్యమధ్యలో వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మధ్యమధ్యలో పది పదిహేను నిమిషాల పాటు చిన్న విరామం తీసుకోవచ్చు. అయితే ఇంట్లో అలాంటి వాతావరణం లేక నిరంతరం పనిలో నిమగ్నమై పోతారు. ఇది మీపై ఒత్తిడి పెంచి ఆందోళనకి దారితీస్తుంది. అందుకే ఆఫీసులో మాదిరిగానే మధ్యమధ్యలో విరామం తీసుకోండి. ఈ సమయంలో తేలికపాటి నడక, చిన్నపాటి స్ట్రెచింగ్‌ వంటి ఫిజికల్‌ యాక్టివిటీస్‌ ద్వారా చురుకుగా ఉండగలరు. మధ్యమధ్యలో ఏమైనా ఫోన్‌ కాల్స్ మాట్లాడాల్సి వస్తే నడుస్తూ మాట్లాడవచ్చు. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వర్క్‌ ఫ్రం హోమ్‌ కారణంగా ఆఫీసుకి వెళ్లడానికి తొందరపడే పని ఉండదు. అయితే ఆ సమయాన్ని మీరు వాకింగ్‌, వ్యాయమాలకు కేటాయించడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండగలరు. ఉదయం నిద్ర లేవగానే ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలిలో కొంత సమయం గడపడం, లోతుగా శ్వాస తీసుకోవడం, యోగా, ధ్యానం ద్వారా రోజును ఉల్లాసంగా ప్రారంభించవచ్చు. తేలికపాటి, పోషకాహార బ్రేక్‌ఫాస్ట్‌ ద్వారా శక్తితో పాటు నీరసం రాకుండా ఉంటుంది.

boost your mental well-being with these methods while working from home

ఆఫీసు పనివేళల సమయం ముగిసిన తర్వాత మీ వర్క్‌కి సంబంధించి అన్ని విషయాలకు దూరంగా ఉండండి. ఆఫీసు ఈమెయిల్‌లు, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లను పట్టించుకోకండి. ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి. కుటుంబంతో గడపడం, ఫ్రెండ్స్‌తో సరదా సమయం వంటి వాటి ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి. లేదంటే అనసరంగా ఒత్తిడి పెంచుకుంటారు.

ఆఫీసు పని అనంతరం వారాంతాల్లో మీకు నచ్చిన పనులు చేస్తూ ఆ రోజులు బాగా గడిచేలా చూసుకోండి. అప్పుడే మిగతా వారమంతా శక్తివంతంగా పనిచేయగలరు. ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లడం, సైకిల్‌ తొక్కడం లాంటి పనులతో ప్రకృతితో గడపాలి. వారాంతాల్లో శారీరక శ్రమకి ప్రాధాన్యత ఇవ్వండి. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలరు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, ఫ్యామిలీ ట్రిప్పులు మీకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, June 22, 2026, 14:55 [IST]
Desktop Bottom Promotion