Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
భారత్ లో భారీగా పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు..ICMR హెచ్చరిక!
క్యాన్సర్ పేరు వింటేనే చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంటది. క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. అలాంటివాటిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. మనదేశంలో ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్(బ్రెస్ట్ క్యాన్సర్) బాధితుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది.
బెంగళూరులోని ICMR నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(NCDIR) నిర్వహించిన పరిశోధన.. మహిళల మారుతున్న జీవనశైలి,శారీరక మార్పులే బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలని స్పష్టం చేసింది.

ఏటా 50 వేల కొత్త కేసులు
భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం దాదాపు 5.6 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అంటే ఏటా సుమారు 50,000 మంది మహిళలు కొత్తగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
2022 నాటి గణాంకాల ప్రకారం,దేశంలో దాదాపు 2,21,757 క్యాన్సర్ కేసులు నమోదవ్వగా..మహిళల్లో వచ్చే మొత్తం క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ వాటానే 22.8 శాతం (దాదాపు పావు వంతు) ఉండటం ఆందోళనకరం.
ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి?
డిసెంబర్ 22, 2024 వరకు ప్రచురించిన వివిధ అధ్యయనాలను క్రమబద్ధంగా సమీక్షించిన ICMR ఈ క్యాన్సర్ పెరుగుదలకు కొన్ని ప్రధాన కారణాలను గుర్తించింది.
జీవనశైలి లోపాలు
అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే ఊబకాయం, ప్రధానంగా నిద్రలేమి రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి.
పెళ్లి, పిల్లలు
పెళ్లి వయస్సు పెరగడం కూడా ఒక కారణమే. ముఖ్యంగా 30 ఏళ్లు దాటాక మొదటి బిడ్డకు జన్మనిచ్చే మహిళల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతోందని అధ్యయనం తేల్చింది.
అబార్షన్
గర్భస్రావం జరగని మహిళలతో పోలిస్తే, రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అబార్షన్ జరిగిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 1.68 రెట్లు ఎక్కువగా ఉంటుందట.
ఇతర కారణాలు
కుటుంబ చరిత్ర (జన్యుపరమైనవి), హార్మోన్ల ప్రభావం, పునరుత్పత్తి వయస్సు వంటి అంశాలు కూడా ఈ వ్యాధిని ప్రభావితం చేస్తున్నాయి.
పిల్స్ వాడకం,పిల్లలకు పాలివ్వడం
సాధారణంగా పిల్స్ వాడకం లేదా పిల్లలకు పాలివ్వడం వల్ల క్యాన్సర్ వస్తుందేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ తాజా అధ్యయనంలో తల్లిపాలు ఇచ్చే వ్యవధికి లేదా నోటి గర్భనిరోధక మాత్రల వాడకానికి, రొమ్ము క్యాన్సర్ కు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ICMR తెలిపింది.
సరైన ఆహారం, తగినంత నిద్ర, బరువు నియంత్రణ, సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మహిళలు ఈ ముప్పు నుండి తమను తాము కాపాడుకోవచ్చని ఐసీఎంఆర్ అధ్యాయం తెలియజేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications