1980’s ఏఐ క్లాసిక్‌ ట్రెండ్‌ ఎఫెక్ట్‌.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్‌. !

గత కొన్ని రోజులుగా 1980ల ఏఐ ట్రెండ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. క్లాసిక్‌ లుక్స్‌, లొకేషన్స్‌తో మనల్ని మనం నచ్చిన రీతిలో రీక్రియేట్‌ చేసుకోవచ్చు. ఈ క్లాసిక్‌ లుక్‌లో మనల్ని అలా చూసుకోవడం మనకు ఎంతో మంచి అనుభూతిని ఇస్తోంది. అయితే కేవలం సరదా కోసం తీసుకొచ్చిన ఈ ట్రెండ్‌ సరదాకే పరిమితం కాలేదు. ఈ నయా ఓల్డ్‌ ట్రెండ్‌ పోలీసులకు పెద్ద సహాయం చేసిందని తెలుసా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 ఏళ్లుగా పోలీసులకు సవాలుగా మారిన ఓ కేసును ఎంతో సులభంగా పరిష్కరించింది. అది ఎలా సాధ్యమైందంటే..

1980 s ai trend helps police trace woman 45 years after allegedly stealing gold chain

45 ఏళ్ల క్రితం బంగారం గొలుసు దొంగిలించిన మహిళను 1980ల ఏఐ ట్రెండ్‌ దొంగను పట్టించిన సంఘటన నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 80ల నాటి క్లాసిక్‌ లుక్‌ పోలీసులకు ఎనలేని సహాయం చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో 45 ఏళ్ల క్రితం ఒక నగల దుకాణం నుంచి మహిళ బంగారు గొలుసును దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏఐ-జనరేటెడ్ ఫోటోను దుకాణ యజమాని గుర్తించడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఐఫోన్‌ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!ఐఫోన్‌ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!

సోషల్‌ మీడియా నివేదికల ప్రకారం 1980ల ప్రారంభంలో ఓ మహిళ నగల దుకాణంలోకి ప్రవేశించి, బంగారు గొలుసును అపహరించి పారిపోయింది. దుకాణదారుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంతగా గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆ మహిళ కొన్నాళ్లకు పేరు మార్చుకుని, వేరే ప్రదేశంలో కొత్త పేరుతో నివసిస్తున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ కేసు ఓపెన్‌గానే ఉంది.

మహిళ చేసిన తప్పు ఇదే

అయితే సదరు మహిళ.. ఇటీవల ట్రెండ్‌ అవుతున్న 1980ల నాటి ఏఐ జనరేటెడ్‌ ఫొటో ఫీచర్‌ సాయంతో తన లేటెస్ట్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేసి క్లాసిక్ లుక్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలో నగల దుకాణం యజమాని ఆమె పోస్ట్‌ను చూసి, ముఖ కవళికలను గుర్తించారు. అప్పట్లో దొంగతనం చేసిన మహిళ ఆమేనని అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను గుర్తించారు. విచారించగా అప్పుడు దొంగతనం చేసింది తానేనని సదరు మహిళ అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మిస్టరీ వీడిపోయినట్లయింది.

హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండిహైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి

ఇదంతా నిజమేనా

కాగా, ఈ సమాచారం అంతా ఇప్పటివరకూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కథనం ద్వారా తెలిసిందే. కానీ ఫ్యాక్ట్‌ చెక్‌ను పరిశీలిస్తే అలాంటిదేమీ జరిగినట్లు సరైన ఆధారాలు లభించలేదు. ఇది నిజమేనని చెబుతూ, ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కథనాన్ని వ్యంగ్యంగా చేసినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్‌ సినిమాటిక్‌ స్టైల్‌లో అనిపించినా, దీనికి సంబంధించి నమ్మదగిన ఆధారాలు ఏమీ లేవని సమాచారం.

Story first published: Saturday, September 19, 2026, 17:36 [IST]
Desktop Bottom Promotion