మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్‌ గ్రీన్‌ కాంబినేషన్ ట్రై చేశారా.?

ఆదివారం వస్తే చికెన్‌తో చాలా వెరైటీలు చేయడం సహజమే. చికెన్‌ ఫ్రై, కోడి కూర పులుసు, చికెన్‌ బిర్యానీ ఇలా ఎన్నో రకాలు మన నాలుకను ఊరించేస్తుంటాయి. అలాంటి చికెన్‌ వెరైటీలలో మునక్కాడ కోడికూర ఒకటి. మునక్కాడలోని గుజ్జు, చికెన్‌ ముక్కల్లోని మజా మీ సండే స్పెషల్‌ను అదరగొట్టేస్తుంది. మరి ఈ సెలవు రోజు మీ డైనింగ్‌ హాల్‌ ప్రత్యేకంగా ఉండాలంటే ఈ మునక్కాడ కోడికూరను తప్పకుండా ట్రై చేయాల్సిందే..

Munakkada kodi kura recipe sunday special with spicy taste

మునక్కాడ కోడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు

స్కిన్‌లెస్‌ చికెన్‌- కేజీ
ములక్కాడలు- నాలుగు
ఉల్లిపాయలు- రెండు(పెద్ద సైజు)
టమాటాలు- రెండు
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి- నాలుగు
కారం- రెండు టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర- గుప్పెడు
ఉప్పు- రుచికి సరిపడా

రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్

మసాలా కోసం

వెల్లుల్లి రెబ్బలు- 12
ఎండు కొబ్బరి ముక్క- ఒకటి
ధనియాలు- రెండు టేబుల్‌ స్పూన్లు
మిరియాలు- టీస్పూన్‌
దాల్చిన చెక్క- మూడు
మిరియాలు- నాలుగు
సాజీరా- టీస్పూన్‌

మునక్కాడ కోడి కూర తయారీ విధానం

Munakkada kodi kura recipe sunday special with spicy taste

మునక్కాడ కోడి కూర తయారీ కోసం మునక్కాడ ముక్కలను కట్‌ చేసి కడిగి పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం సిద్ధం చేసి పెట్టుకోవాలి.

స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని చిన్నగా కట్‌ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా వేసి వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలతో కలిపి మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి.

మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్‌ లివర్‌ ఫ్రై.. బ్యాచ్‌లర్స్‌ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!

ఇప్పుడు బాణలి పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అనంతరం టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వండి.

రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసి కలపండి. తర్వాత నూరిపెట్టుకున్న మసాలా ముద్ద వేసి కలిపి ఉడికించండి. మసాలా మొత్తం ఉడికిన తర్వాత చికెన్‌ను వేసుకుని నీచు వాసన పోయే వరకు మూత పెట్టి ఉడికించాలి.

చికెన్‌లో నీరు మొత్తం ఇగిరిపోయిన తర్వాత కారం వేసి కలపండి. ఉప్పు సరిచూసుకుని కాసేపు ఉడికిన తర్వాత గ్రేవీకి తగినట్లుగా నీరు పోయాలి. మూత పెట్టి మీడియం మంటపైన ఉడకనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. చాలా సింపుల్‌ అండ్‌ టేస్టీగా మునక్కాడ కోడి కూర రెడీ. ఇంటికి అతిథులు వస్తే ఈ ప్రత్యేక డిష్‌తో వాళ్ల కాంప్లిమెంట్స్‌ పొందడం పక్కా.

[ of 5 - Users]
Story first published: Saturday, September 19, 2026, 18:41 [IST]
Desktop Bottom Promotion