Latest Updates
-
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్తకి మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.! -
అన్నీ ఇచ్చాక కూడా ప్రేమ మారిపోయిందా? దానికి కారణం మీరు కాదు -
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్‌తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.? -
జూన్ 5, 2026: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం ఖాయం! -
ఎలాంటి విషాన్నైనా మింగేస్తుంది.. ఆరోగ్యానికి సంజీవని నేరేడు పండ్ల ప్రయోజనాలు తెలుసా.!
ఒంటె మూత్రం తాగితే ఆ వ్యాధులన్నీ నయమైపోతాయా? సైన్స్ చెప్పిన నిజం ఏంటంటే..
మన దేశంలో గోమూత్రాన్ని తాగేవాళ్లు చాలామందే ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే అరబ్ దేశాల్లో వందల ఏళ్ల నుంచి బంటె మూత్రం గురించి ఓ నమ్మకం బలంగా పాతుకుపోయింది. ఒంటె మూత్రాన్ని తాగడం ద్వారా క్యాన్సర్, హెపటైటిస్ వంటి భయంకరమైన వ్యాధులను సైతం ఇది నయం అయిపోతాయని వారు నమ్ముతారు. ఈ ఆచారానికి మత గ్రంథమైన హదీసులో ప్రవక్త మహమ్మద్ అనారోగ్యంతో ఉన్నవారికి ఒంటె పాలు, మూత్రం తాగమని సలహా ఇచ్చినట్లు ఉన్న ఒక ప్రస్తావన ఆధారం. ఇటీవల ఒక వైరల్ వీడియో ఈ సంప్రదాయాన్ని మళ్ళీ ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.
ఈ నమ్మకం వెనుక ఉన్న నిజమెంత?
మోడ్రన్ సైన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒంటె మూత్రం తాగడం కేవలం నిరుపయోగం మాత్రమే కాదు, ప్రాణాలకే ప్రమాదమని స్పష్టం చేస్తున్నాయి. 2015లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) అనే భయంకరమైన శ్వాసకోశ వ్యాధి విజృంభించినప్పుడు WHO ఒక కీలక సూచన చేసింది. పచ్చి ఒంటె పాలు, మూత్రం తాగడం మానుకోవాలని హెచ్చరించింది. ఎందుకంటే ఈ MERS వైరస్ ఒంటెల నుంచే మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల రేటు 35శాతం వరకు ఉండటం దీని తీవ్రతకు అద్దం పడుతుంది.

2023లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఒంటె మూత్రం తాగిన ఇద్దరు క్యాన్సర్ రోగులు బ్రూసెల్లోసిస్ అనే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారు. దీనివల్ల తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనపడి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఒంటె మూత్రంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని కొన్ని ప్రయోగశాల పరీక్షలు సూచించినా వాటికి మనుషులపై నిరూపితమైన క్లినికల్ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.
విశ్వాసానికి, విజ్ఞానానికి మధ్య సంఘర్షణ
ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. కొందరు దీనిని మత విశ్వాసంగా సమర్థిస్తుంటే.. మరికొందరు ఇది అశాస్త్రీయం, ప్రమాదకరం అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటూ కొందరు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
.
ఆరోగ్య సమస్యలే కాకుండా పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటె మూత్రాన్ని విచ్చలవిడిగా సేకరించి, సరైన శుద్ధి ప్రక్రియ లేకుండా పారవేయడం వల్ల పర్యావరణ వ్యవస్థలకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications